పుట్టు శంఖు చక్రములతో పుట్టేనమ్మా కృష్ణమూర్తి
విపునా వింజామరము లూ కాంతి చంద్రుని పోలేనూ
బాలు నెత్తీ తొడల నుంచీ అతివ ఎంతో దుఃఖ పొందే
కళ్ళు తెరిచీ కృష్ణమూర్తి ఘల్లు ఘల్లున నవ్వెనూ
అమ్మానన్నేక్కడైనను దాచవే ,,
బాలు నెక్కడ దాతునే
వ్రేపల్లె వాడ లోను గోపిక యను పేరు గలా
ఆడబాలిక కన్నతండ్రి మేనమా కందియ్యవే
అమ్మా నన్నేక్కడైనను దాచవే ,,
బాలు నెక్కడ దాతునే
మూడు ఘడియలు దాచవమ్మా,
ముజ్జగంబులు ఏ లెదానూ,
నాలుగుడియలు దాచవమ్మా
నరుల నే రక్శిస్తునూ,
అమ్మానన్నేక్కడైనను దాచవే
బాలు నెక్కడ దాతునే
బాలు నెక్కడ దాతునే
ఐదుఘడియలుదాచవమ్మా
అయిహికంములుమీకుతెల్పెద
అయిహికంములుమీకుతెల్పెద
ఆరుఘడియలు దాచవమ్మా
అందరిని రక్శిస్తునూ
అందరిని రక్శిస్తునూ
ఏడు ఘడియలు దాచవమ్మా
ఏక చక్రం మెలెదానూ
ఏక చక్రం మెలెదానూ
అష్టమ ఘడియలు దాచవమ్మా,
కష్టములు నే దీర్చెదన్
కష్టములు నే దీర్చెదన్
,
అమ్మానన్నేక్కడైనను దాచవే
4 comments:
జయ భారతి రాం గారు,
ఇది మీరే రాసారా? చాలా బావుంది. ఇది రాయుటలో మీ ఉద్దేశం నాకు బోధపడలేదు కాని చదువుతున్నంత సేపు నాకు వేదాంతం గుర్తొచ్చింది. ఎందుకంటారు? మీ టపా కి అర్ధం కూడా వినిపించరూ!!
-krsna
ఇవెవీ నేను స్వయంగా రాసినవి కాదండి . నా చిన్నప్పుడు మా అమ్మగారు వంట చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ పాడుకుంటూ ఉండేవారు. ఈ పాటల్లో మా అమ్మగారు మా లో ఇంకా జీవించే ఉన్నారు.
కారాగారం లో కృష్ణుడు ఉద్భవించినప్పుడు శంకు, చక్రములతోనే పుట్టడనీ, అతని జన్మ సమయం లో అతని చుట్టూ అల్లుకున్న తేజస్సు చంద్రుని చుట్టూ ఉన్నా పున్నమి నాటి చంద్రుణ్ణి పోలి ఉన్నాయని, అంత దివ్య తేజస్సు తో కలిగిన కుమారుడ్ని భగవదవతారమని తెలిసినా, మాత్రు ప్రేమ తో కంసుడు ఎక్కడ చేమ్పెస్తాడో అన్న ఆత్రుత తో ఆ బాలున్ని ఎక్కడ దాచనే అని మధన పడుతుంది. ఆమె మనసు గ్రహించిన ఆ లీల మానుష మూర్తి, తనకెమీ చేత కానట్టు, తనని ఎక్కడైనా దాచమని దేవకీ దేవి ని కోరుతాడు.
చిన్ని కృష్ణుడు చైతన్య స్వరూపుడు. అతని లీలలని ఎన్ని విధాలుగా
పాడుకున్నా,విన్నా మనలో ఉన్ననిర్లిప్తత తొలగిపోయి , కొత్త చైతన్యం తో ముందుకి వెళ్తాం.
chaala bagundi paata.
మీ వివరణ బావుందండి. ధన్యవాదాలు. :-)
Post a Comment