కరమునా మురళీని చేకొని ,,గానమూ చేయార కృష్ణా
కన్నులారా నిన్ను గాచీ ,,ధన్య నయ్యే దాను కృష్ణా //కరమునా//
దివ్య కస్తూరీయు తిలకము,,తీర్చి దిద్దేదాను కృష్ణా
తిన్నగా నీ మోము చూపితే ,,వెన్న పెట్టేదాను కృష్ణా //కరమునా//
మంచి మంచీ హారములనూ,,ఎంచి నీ మెడ నుంచే దానూ
మల్లెలు,మొల్లాలూ మంచీ,,మాలలూనీ సిగకు కూర్చెద //కరమునా//
గొల్లవారీ పిల్లలతో ,రే పల్లె కేగగా ఎల్ల వేళల
అల్లరీ చేయంగ నేలా పిల్లనా గ్రోవితో దేవా //కరమునా//
వేమారు నిన్నూ వేడుచుంటిని ,ఎచట నుంటివో మాధవా
రాధతో ముచ్చాట లాడుతూ, రారా ఇటు ఓ శ్రీ ధరా//కరమునా//
1 comment:
Chaala Bhagundhi
Post a Comment