Monday, July 25, 2011

ఏ సేవ సేయగ


      కొన్నేళ్ళ క్రితం సంక్రాంతి సందర్భం గా కాస్త ప్రశాంతత  కావాలనిపించి, ఒక పది రోజుల పాటు ప్రశాంత నిలయానికి వెళ్ళాను. నాకు ఒక పధ్ధతి లో పూజలు చేయడం కాని, ఉపవాసాలు చేయడం కానీ రాదు. ఒంటరిగా కళ్ళు మూసుకుని ప్రార్ధించడం  తప్ప. భయమేసినప్పుడు, మొండిగా నాతొ రమ్మని .మారాము చేస్తాను, నాకు ఇంతవరకు  , కష్టమనిపించి, మనసారా వేడుకుంటే దేవుడు సహాయమే చేసాడు.
 
    మాములుగా ఒక మంచి సినిమా చూస్తేనే స్నేహితులతోటి, ఇంట్లో వాళ్ళతోటి మరి,మరి  చర్చించు కుంటామే , అలాంటిది, ఈ  సృష్టి కి మూలమైన ,సమాజాన్ని,తను ఉన్నానన్న ఒకే ఒక్క భావన  తో అదుపులో ఉంచుతున్న (నమ్మకం ఉన్నవాళ్ళకి)  ఆ దేవుడు, మనకి ఏ భావన కలిగించినా పంచుకోవడం లో అభ్యంతరం లేదనిపించింది.    
 

      భక్తు లందరితో బాటే నేను కూడా సాయిబాబా దర్శనం కోసం హాలు లో కూర్చున్నాను. అర గంట అయినాక స్వామి హాల్   లోకి రావటం చూసాను. . అందరితో బాటే నేను కూడా స్వామి    ఆశీర్వాదం కోసం ఆత్ర్తగా చూస్తున్నాను. రెండు క్షణాలు ఐతే,  స్వామి నా  తల మిద చేయి పెట్టి ఆశిర్వదించే వారే  .        ప్రాప్తాన్ని నమ్ముతాన్నేను. లిప్త లో స్వామి నన్ను పట్టించుకోకుండా నే వేరే వాళ్ళకేసి చూస్తూ, ముందుకు వెళ్ళిపోయారు. ఆ క్షణం లో నా మనసులో కలిగిన బాదే,ఒక పాటగా ప్రవహించింది. నాలో నేనే ఎప్పుడు పాడుకుంటూ ఉండే దాన్ని.

   నిన్న మా ఇంటికి స్నేహితులు  వచ్చారు. సరదాగా   కాసేపు గడిచినాక అందరు ఆటలు,పాటలు అయినాక నన్ను కూడా పాడమన్నారు.  ఎందుకో స్వామి మీద పాడాలని అనిపించి ఈ పాట పాడాను  .అంతే , అందరు చాలా బాగుంది అన్నారు. మా సోనీ ఐతే  పబ్లికైజ్జ్ చేయాలిసినంత బాగుంది అంటూనే  పాట  రాసుకుంది . అందరికి అందుబాటులో ఉంటుందని ఇవ్వాళ బ్లాగ్ లో వ్రాస్తున్నాను.

 
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ

సెల వీయ మని నిన్ను నిరతము వెడితే
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


అల్లంత దురాన  అగుపించి
మా ఉల్లము రంజిల్ల భాషించి
మనసులలో మరి,మరి-మరిమరి
మరిమరివేడినా
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని
ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని

మరిమరివేడినాచిరు నవ్వుతో నీవు

మరపించేదవు స్వామి                //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //

      
     స్వామి మన మధ్యన ఇక పైన ఒక అనుభూతిగా ,ఒక ఆత్మా జ్ఞానం గా, ఒక ప్రేమ గా ఒక భజనగా ఒక భావం గా మిగిలి పోతారు. దేహి గా ఆయన మనలోనే,మనతోనే సదా నిలిచి ఉంటారు. భగవాన్  కి  ఈ పాట అంజలిగా, అర్ఘ్యం గా, భజనగా , పూజ గా ఎల్లప్పుడూ మిగిలి పోవాలని నా ఆశ. స్వామీ నా పాట లో సదా కనిపించు, వినిపించు,  ఒక పువ్వుగా దీన్ని స్వీకరించు.

1 comment:

Krishna said...

భక్తి ఎంత పొంగుతే మరి మీ మనసు అంత పరవశిస్తుంది!!! మీ పాట అద్భుతంగ ఉంది. మీ సాయి ఎక్కడో లేరు. మీలోనే ఉన్నారు. దేహంతో మాత్రమే లేరు. మీరు మీలోకి మీ మనసు పొరల్లోకి మునిగి చూడండి. తిరిగి దర్శించగలరు. :-)