కృష్ణాష్టమి త్వరలో వస్తోంది. నంద గోప బాలుడి జననాన్ని గురించిన ఈ పాట ఆ రోజు పూజ చేసుకున్నాక కృష్ణుడ్ని ఉయ్యాలలో వేసి ఉయ్యాలా పాట ఇది పాడుకుంటే , ఎంతో బాగుంటుంది. ప్రయత్నించి చుడండి. లాలిపాట వరసే.
రామ రఘురామ లాలీ ,మాపాలి సీతా సమేత లాలీ
హరిరామ రామలాలీ ,అని ఇట్లు జనులు పాడేరు లాలీ//రామ//
కంసుణ్ణి సంహరింపా , సద్గురుడు అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భంబునా క్రిష్నావతారమై జన్మించెనూ//రామ//
యేడు రాత్రులు పగలునూ ,తానొక్క రాత్రిగా జేసెనపుడూ
ఆదివారముపూటనూ శ్రావణా మాసమున జన్మించెనూ// రామ //
తలతొను జననమైతే ,తనకు బహు మోసంబు వచ్చుననుచూ ,
యెదురుకాళ్ళనుబుట్టెనూ, యెడుగురుదాదులనుతాజంపెనూ//రామ//
నెత్తురై ఉండి చాలా , తానపుదు క్యావు,క్యవున యెడ్చెనూ
నన్నేల యెత్తుకొవే నా తల్లి యెల మాట్లడవమ్మా// ,రామ //
వేణీళ్ళు లెక నేనూ ,,యీ రీతి యున్నాను కన్నతండ్రి
నిన్నెట్లు యెత్తుకొందూ ,,నీవొక్క నిముషమ్మ్ము తాళ్మన్నా//రామ//
గంగ ను ప్రార్ధించెనూ ,,జలనిధులు గంగ ఉప్పొంగెనపుడూ ,
గంగానదీ యందునా దేవకీ జలకంబులాడె తానూ //,రామ//
తడి వస్త్రములు విడిచియూ ,తానపుడు పొడి వస్త్రములు గట్టెనూ
పొత్తిళ్ళమీద నపుడూ బాలుడిని పవళ్ళింప జెసిరపుడూ//రామ //
కామధేనువప్పుడూ మాధవుడు మదిలొన దలచగానూ,
పాలవర్షము కురిసెనూ ఆ తల్లి బాలునీ పై చల్లెనూ //రామ//
ఇక నైన ఎత్తుకొవే ,,ఓతల్లి దేవకీ వందనంబూ
కానిబాలుని రీతినా ఉన్నాను ,కన్నతల్లీ ఎత్తుకో //రామ //
తనరెండు హస్తములచే, బాలుణ్ణి చక్కగా ఎత్తుకొనీ /
అడ్ద్దాల లపై వేసుకు , ఆ బాలు చక్కదనమును చూచెనూ// రామ//
వసుదేవు పుత్రుడమ్మా యీ బిడ్డ వైకుంథ వాసుడమ్మా
పరమా పవిత్రుడమ్మా ,యీ బిడ్డ భక్తజన లొలుడమ్మా
నవనీత చోరుడమ్మా యీ బిడ్డ నందగొపాలుడమ్మా //
శత కమల నేత్రుడమ్మా యీ బిడ్డ లక్ష్మీ నివాసుడమ్మా// రామ //
నీ పుణ్య మాయె కొడుకా,,ఇంకొక్క నిముషమ్ము పవళించరా
అదుగదుగొ జొగివాడూ ,వస్తాడు నా తండ్రి పవళించరా//రామ//
జొగే ల వచ్చునమ్మా, నళినాక్షి జొగి నన్నెరుగునమ్మా
జొగి మందుల సంచులూ యీ వేళ నా చంక నుండగానూ// రామ//
నా పుణ్య మాయె కొడుకా//ఇంకొక్క నిముషమ్ము పవళించరా
అల్లదిగొ పాము వచ్చే నా తండ్రి గొపాల పవళించరా //రామ//
పాము నా కిందనమ్మా,శేషు డు పానుపై ఉండగానూ
పామెమి చెయునమ్మా,నళినాక్షి పాము నన్నెరుగునమ్మా /రామ//
నా పుణ్య మాయె కొడుకా, ఇంకొక్క నిముషమ్ము పవళించరా
నీ మామ కంసుండునిన్ ,తెమ్మనీ అడుగ వస్తాడు తండ్రీ/రామ//
మామ కంసుండును, తెమ్మనీ అడుగ వస్తెను తల్లీ
కరుణతొ అందివ్వవే , దూరమున నిలుచుండి చూడవమ్మా//రామ//
నా పేరు కృష్ణుడైతే,నా కాళ్ళ శంఖు, చక్రములు గలవూ,
మా మమ కంసుణ్ని నే, నిముషములొ వధియింతు చూడవమ్మా//రామ//
శిరసునా చింతామణీ, ఓ తల్లి నాలుకన నక్షత్రమూ,
పండ్లను పరుషవెదీ ,చెదొయి శంఖచక్రములు గలవూ/రామ //
వీపునా వింజామరం //ఓ తల్లి బొడ్డునా పారిజాతం/
అరికాళ్ళ దామెరలును ,ఓ తల్లి అన్ని కలిగున్నవమ్మా//రామ //
గిర్మజి పురమందునానెలకొన్న గొవింద రాజు నపుడూ
కరుణించి రక్షించునూ ,తా ఇష్ట కామ్యార్ధముల నిచ్చునూ //రామ //
1 comment:
నాకు భజనలలో రాముడి భజనలంటే అమితమైన ప్రేమ. అనుకోకుండా రాముడు కృష్ణుడు ఒకేసారి దర్శనమిప్పించారు. వెతికినా దొరకని కొన్ని ఇలా అనుకోకుండానే కంటపడతాయేంటో బహుషా అదే మాయ లేదా లీల అనుకుంటా..
ధన్యవాదాలు
Post a Comment