Wednesday, September 29, 2010

గుండెలు పిండివేసే సన్నివేశం

                ఆయేషా మీరా హత్యకేసు లో శిక్ష పడింది సత్యం బాబుకా,అతని తల్లిమరియమ్మకా ?    తప్పెవరిదో~శిక్ష మాత్రం పేదవాడికి. 

             డబ్బుంటే ఏమైనామనకి అనుకూలంగా మార్చుకో వచ్చు.
 
         చిన్నప్పుడుఒకచిన్న పెన్సిలుముక్క ఎక్కడేనా దొరికింది అని ఇంటికి పట్టుకుని వస్తేలక్ష యక్ష ప్రశ్నలువేసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్లని విచారించి తిరిగివాళ్ల వస్తువు వాళ్లకితిరిగి చేర్చే దాకా ఒప్పుకునేవాళ్ళు కాదు ఆనాడు పెద్దవాళ్ళు.
              
              మరి ఈ నాడు ప్రపంచం అందరు చెబుతున్న వాస్తవాన్నిన్యాయదేవత  కళ్ళకి  గంతలు కట్టి  మరీ  , అమాయకుడికి శిక్షవేసారు. 

     ఆతల్లి ఉపిరి కళ్ళలో పెట్టుకుని,  గడపాల్సిన  భవిష్యత్తు అంధకారం ఔతుంటే ఆతల్లి రోదన అరణ్య రోదన ఎప్పటికి కాకూడదు.

              మాతృమూర్తి రోదనభారత దేశంలో ఎన్నటికి ఒక వేదమంత్రమై 

న్యాయానికి ,బాసటగానిలవాలని కోరుకుంటున్నాను.  
                  
               సర్వే   జనాః  సుఖినొ:    భవంతు: 

ఇంక మౌనం నా వల్ల కాదు

             బయటకి విజయగర్వంతో వేగిపొతూ 
            మనసులో వెక్కి, వెక్కి  ఏడుస్తున్నా.
           నీ  మనసుకి వెన్నెలలా కనిపించే నా మనసు, 
          నాలో అమావాస్య నింపి నన్నేడిపిస్తుంది. 
         నేను నడిపించినప్పుడే నా వాళ్ళు మ\రి నన్ను నడిపించేది ఎవరు?   
         గుండెని మొండి చేసుకుని, కలలనీ, కన్నీళ్ళని  
        కసిగా ఆవలకి తరిమేస్తూ,
నా ఆశలని, ఆలొచనలనీ,ఆనందాలని మీలో  చూసుకుంటూ ,
నా మీద లోకం చల్లుతున్న నిందలని, విసిరేస్తున్న వ్యామొహాలనీ బండబారిపోయినట్టు భరిస్తూ, 
తెలివిలేని   సమయాల్లో తల వంచుతూ,
ఎవరికీ కనపడని చీకటిలో,కలలని  వెలివేస్తూ,కన్నీళ్ళను త్రాగేస్తూ .
ఎందుకో తెలియదు.ఒంటరిగా ఉన్నాననో,ఓడిపోయాననో,పోరాడే ఓపిక లేకనో.
ఎవరి కోసమో తెలియదు.
లిప్త  పాటులో ప్రారంభమైన నా ఈ కన్నీళ్ళు
నదులై,  సుడి  గుండాలై   సంద్రాలై, తుఫానులై 
నన్నే ఆక్రమిస్తున్నై ఎందుకిలా జరుగుతోందో 


సహస్ర చ్చేదనలైనా ఈ ఆక్రోశాన్ని మించి బాధించవు. 
నా కోసమా?నా వాళ్ళు అనే వారి కోసమా?
నా కలలు,కోరికల కోసమా?
ఈ లోకంలో శోకం ఒక అనివార్యమైన అవస్థ. . 

ఉబికి ఉబికి చెలిమెలోఉట లాగా  వస్తుంది. 
తెలియకుండానే     ఇంకి పోతోంది .
 నాది స్వార్ధమా ,నిష్కామమా ఎదైతెనేంటి,
 ఇక నిష్క్రమించడమే నయం. 
పరాయీకరణ చెందిన ఆప్యాయతలు
మాతృ ప్రేమని  సైతం వెక్కిరిస్తుంటే   
మోసాలని భరించలేని మనసు 
మళ్ళి  మళ్ళి మోసగించబడుతోంది 
నా వేలే నా కళ్ళని  మళ్ళి మళ్ళి  పొడుస్తోంది. 
మౌనంగా కాకుండా నేను  గుండెలవిసేలా రోదిస్తున్నాను
ఇంక మౌనం నా వల్ల కాదుమరి.
.

బాల్యం అంతా ఆటగా ,

బాల్యం అంతా ఆటగా ,
మనసే చల్లని మాటగా,
బ్రతుకే పున్నమి బాట గా ,
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడనా...

         అలా పాడుకుంటుంటే ఎందుకో బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగానే మిగలనా    అంటూ అనాలోచితంగా నా నోట్లోనించి వచ్చేసింది . వామ్మో

, ఎంత అదృష్టం కావాలి అలా మిగలడానికి . మళ్ళి జన్మంటూ  ఎత్తితేఅక్షరమై పుట్టి, ఒక మాహమహుని మనసులో చేరి   వారి కలం లోంచిఅధ్బుతమైన పాట గా రూపు దిద్దుకోవాలి. 
              ఎందుకో ఎంతెంతో పిచ్చి,పిచ్చిగా ఆలోచిస్తున్నానేమిటో .
      సరే. యీ జన్మలో పాపాలన్నీ కడతేరి నప్పుడు కదా మరో జన్మ వగైరా.

           చిన్నప్పుడు మన ప్రతి అవసరానికి పెద్ద వాళ్ళే ఆధారం. అప్పుడు మనకి అన్ని పనులు చేయడం అంటే  వాళ్లకేంతో ఆనందం.

     బాల్యం దాటి తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి అడుగుకి తల్లి కళ్ళలో వెలుగు తండ్రి కి భరోసా. పెద్దయాక వీడు నన్ను నడిపిస్తాడనే ధీమా. వెరసి 
బాల్యం అందంగానో  , ఆనందంగానో కొందరికి , పరిస్తితుల్ని బట్టి బాధగా, భారంగా కొందరికి మొత్తానికి కదులుతుంది.
               కాస్త కదిలి తనకు తానుగా నడవడం, మాట్లాడం  వచ్చి రాని మాటలతో మురిపించడం. అలాంటి సమయం లోనే మా నాన్నగారు మాకు దాదాపు మా తోబుట్టువులందరికి      రామః, రామౌ రామాహా,,  అంటూ  శబ్దమంజరి, , యస్స్య జ్ఞాన దయా సిందో అంటూ అమరం , హరిహి ఓం అంటూ ప్రారంభించి శ్రీసూక్తం   ప్రతి రోజు వల్లే వేయించే వారు. అలా వాళ్లకి సమయం కూడా కుదిరేది. నాన్నగారు వైద్యానికి వెళ్లి పోగానే అమ్మ చుట్టూ( వంట అయి కంచంలోకి వచ్చే దాకా )తిరుగుతూ ఆవిడ పాడే 
పాటల్ని మనసునిండా మా ప్రమేయం లేకుండానే నింపుకున్నాం 

   పరిగెత్తుతూ ఆటలాడుతూ తుత్తురు చెట్టు కింద కందిలి  పెట్టుకుని అక్కావాళ్ళు  చదువు కుంటుంటే , వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాలిపడ్డ తుత్తురు పళ్ళని ఏరుకుని తినటం, వాటికోసం అన్నయ్య వాళ్ళ
 చదువుల్ని డిస్టర్బ్ చేసి అమ్మతో తిట్లు తినటం , ఆవిడ తిట్టకుంటే తుత్తురు పళ్ళు రుచిగా నే అనిపించేవే కావుమరి  అలా ఆనందించే వాళ్ళం.

    కొద్దిగా తెలివి వచ్చి బడికి వెళ్ళే వయసు వచ్చేనాటికి మేము ఇల్లు మారి సొంత ఇంటికి వచ్చేసాం. అయినా మా ఇంటిముందు ఇనప బెంచి మీద నించుని హోలిపండగా రోజు మేము తీయించుకున్న ఫోటో మాకు  ఆఇంటిని ఇప్పటికి మా  జ్ఞాపకాల్లోంచి  మరుగు కానివ్వలేదు  .అలాంటి   జ్ఞాపకాలు
మా పిల్లలకి అంత మధురంగా ఉన్నాయా  అసలున్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయా ?అనే 
అనిపిస్తుంది.

      

Monday, September 27, 2010

ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ.

       ఇంట్లో  పని చేసుకుంటూ మా అమ్మ ఎప్పుడు ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి     బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ. అంటూ పాడుకుంటూ ఉండేది.
        ఆ వయసులో ఆ పాటలోని భావానికి అర్ధం తెలిసేది కాదు. ఒక్కొక్క సారి అయితే అబ్బ ఆపమ్మా, ఆ పాట ఏంటి, వేరే ఏమైనా పాడవచ్చు కదా అంటూ అడిగి వేరే పాటలు ఆవిడతో పాడించుకునే దాన్ని. ఆవిడ గొల్లకలాపం బాగా పాడేవారు.  
       నాకు యాభైయ్యేళ్ళుదాటాక కానీ మా అమ్మ పాడిన  పాటకి అర్ధం అనుభవంలోకి రాలేదు. 
       నాకు తెలిసి నా కుటుంబం గురించి కొద్ది, కొద్ది గా జ్ఞాపకాలు నాకు  నాలుగేళ్ళప్పుడు హోలీ పండగకి రంగులు చల్లుకున్నాక   స్నానాలు  కానిచ్చి మెడలో  పంచదార చిలకల దండలు వేసి అందరిని నిలబెట్టి తీయించిన ఫోటి బహుశ నాకు కొద్దిగా జ్ఞాపకం లీలగా మెదులుతున్నట్టుంటుంది. అప్పటికి మా ఇంట్లో బుచప్ప ,యాదగిరి నాన్నగారి దగ్గర వైద్యం నేర్చుకోడానికి వచ్చి ఇంట్లోనే ఉండేవారు. 
      ఆ తర్వాత నాకు కొద్దిగా తెలివి వచ్చినాక మా ఇంట్లో అందరికి వంటిమీద పుళ్లు వచ్చి, దానికి మా అమ్మ బంతిపూల రసంతో చేసిన మందు రాస్తుంటే మంట పుట్టి గెంతులేయడం నాకు బాగానే గుర్తుంది. 
      కోమటి ప్రభులింగం ఇంట్లో అద్దెకుండే వాళ్ళం. అబ్బుస్తోరు బువ్వమ్మ వాళ్ళు  మా ఇంట్లో పాల డబ్బా అయిపోతే హైదరాబాద్ నించి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు.   ముత్యలవాళ్ళ ఇంట్లో వెంకటరత్నంగారు ,భారత్ టాకీస్ దగ్గిర సాల్మన్  గారూ , హనుమాన్ టాకీస్ దగ్గర శాస్త్రి బాబా గారువాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంట్లో పండగ సందడే ఉండేది. 
ఇంట్లో పనంతా చేసుకుని ఎప్పుడేనా అమ్మ నన్నుకానీ, మా అక్కవాల్లని కానీ తీసుకుని వారానికి కనీ వీలున్నప్పుడు కానీ పైన చెప్పిన వాళ్ళింటికి వెళ్తుండేది. వాళ్ళు కూడా అలాగే వస్తుందే వాళ్ళు  .   
    సాల్మన్ గారి  భార్య సత్య వేదమ్మ టీచరు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ముద్దు చేసిన తీపి గుర్తులు నాకింకా జ్ఞాపకం ఉన్నాయి. 1991తరవాత నేను వాళ్ళింట్లో మూడేళ్ళు అద్దేకున్నాను. ఆ రోజుల్లో కూడా పాత జ్ఞాపకాలని ఎప్పుడు నెమరు వేసుకునే వాళ్ళం.
       ప్రొద్దున్నే కాఫీ  వేళకి వెంకటరత్నంగారి ఇంటి నించి డాక్టరు గారూ కాఫిలు అయినాయా అంటూ ఒక బ్రేకుఫాస్ట్ కేక వినిపించేది. అది పలకరింపు కోసమని ఆలస్స్యంగా అర్ధం అయింది నాకు. మానవ సంబంధాలని ఒకసారి వల్లే వేసుకోవడానికి ఇలాంటి బాల్యాన్ని నెమరు వేసుకోవడం ఎంతైనా అవసరం.  
     ఇంటిపక్కన నర్సుబాయి, జాండ్ర అవ్వ  కూడా అమ్మకి స్నేహితులే. ఫలానా  వాళ్ళే స్నేహితులుండాలి అన్న  నియమాలేవీ లేకుండా అందరితోను కలివిడిగానే ఉండేది అమ్మ. అప్పట్లో మా అత్తయ్యలు, బాబాయిలు, బంధువులు కూడా వస్తూ, పోతూ, సంబంధ, బాంధవ్యాలు చాలా బాగుండేవి. మా ఇంట్లో రాఘవేంద్ర అనే అతను వారాలు చేసు కుంటూ మా ఇంట్లో ఉండి  చదువుకునే వాడు.    
ఒకసారి మా ఇంటికి కుటుంబి బావ వచ్చాడు, వీళ్ళంతా కలిసి సీత ఫలాలు తేవడానికి గుట్టకి వెళ్లి సాయంత్రం దాకా హాయిగా తిరిగి బోలెడన్ని కాయలు, పళ్ళు కోసుకుని తిరుగుముఖం పట్టారు . నేలిగిపోయిన పళ్ళని పెశం, పాశం
అంటూ వాళ్ళు ఆ రోజు అనుకున్న మాటలు మా ఇంట్లో ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా తలచుకుంటాం. ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఒక్క రోజులో అయిపోయేవా .......మళ్ళి మనసు గతంలోకి పరిగెత్తి ముందుకి నేట్టినప్పుడు మరిన్ని జ్ఞాపకాలతో మీ ముందుంటాను.