Wednesday, September 29, 2010

ఇంక మౌనం నా వల్ల కాదు

             బయటకి విజయగర్వంతో వేగిపొతూ 
            మనసులో వెక్కి, వెక్కి  ఏడుస్తున్నా.
           నీ  మనసుకి వెన్నెలలా కనిపించే నా మనసు, 
          నాలో అమావాస్య నింపి నన్నేడిపిస్తుంది. 
         నేను నడిపించినప్పుడే నా వాళ్ళు మ\రి నన్ను నడిపించేది ఎవరు?   
         గుండెని మొండి చేసుకుని, కలలనీ, కన్నీళ్ళని  
        కసిగా ఆవలకి తరిమేస్తూ,
నా ఆశలని, ఆలొచనలనీ,ఆనందాలని మీలో  చూసుకుంటూ ,
నా మీద లోకం చల్లుతున్న నిందలని, విసిరేస్తున్న వ్యామొహాలనీ బండబారిపోయినట్టు భరిస్తూ, 
తెలివిలేని   సమయాల్లో తల వంచుతూ,
ఎవరికీ కనపడని చీకటిలో,కలలని  వెలివేస్తూ,కన్నీళ్ళను త్రాగేస్తూ .
ఎందుకో తెలియదు.ఒంటరిగా ఉన్నాననో,ఓడిపోయాననో,పోరాడే ఓపిక లేకనో.
ఎవరి కోసమో తెలియదు.
లిప్త  పాటులో ప్రారంభమైన నా ఈ కన్నీళ్ళు
నదులై,  సుడి  గుండాలై   సంద్రాలై, తుఫానులై 
నన్నే ఆక్రమిస్తున్నై ఎందుకిలా జరుగుతోందో 


సహస్ర చ్చేదనలైనా ఈ ఆక్రోశాన్ని మించి బాధించవు. 
నా కోసమా?నా వాళ్ళు అనే వారి కోసమా?
నా కలలు,కోరికల కోసమా?
ఈ లోకంలో శోకం ఒక అనివార్యమైన అవస్థ. . 

ఉబికి ఉబికి చెలిమెలోఉట లాగా  వస్తుంది. 
తెలియకుండానే     ఇంకి పోతోంది .
 నాది స్వార్ధమా ,నిష్కామమా ఎదైతెనేంటి,
 ఇక నిష్క్రమించడమే నయం. 
పరాయీకరణ చెందిన ఆప్యాయతలు
మాతృ ప్రేమని  సైతం వెక్కిరిస్తుంటే   
మోసాలని భరించలేని మనసు 
మళ్ళి  మళ్ళి మోసగించబడుతోంది 
నా వేలే నా కళ్ళని  మళ్ళి మళ్ళి  పొడుస్తోంది. 
మౌనంగా కాకుండా నేను  గుండెలవిసేలా రోదిస్తున్నాను
ఇంక మౌనం నా వల్ల కాదుమరి.
.

3 comments:

jaahnavi said...

చాల కాలం మీ బ్లాగు కి విశ్రాంతి ఇచ్చినట్టున్నారు. మీరు తిరిగి వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం. ఏదో సొల్లు కాకుండా ఉపయోగకరాన్ గ, అనుభూతి చెందేలా, ఆలోచించేలా వ్రాస్తున్నారు. మీ అంతర్మధనం నన్ను ఆలోచింప చేస్తోంది.

Padmarpita said...

Good!

Valli said...

Good One.