Monday, September 27, 2010

ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ.

       ఇంట్లో  పని చేసుకుంటూ మా అమ్మ ఎప్పుడు ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి     బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ. అంటూ పాడుకుంటూ ఉండేది.
        ఆ వయసులో ఆ పాటలోని భావానికి అర్ధం తెలిసేది కాదు. ఒక్కొక్క సారి అయితే అబ్బ ఆపమ్మా, ఆ పాట ఏంటి, వేరే ఏమైనా పాడవచ్చు కదా అంటూ అడిగి వేరే పాటలు ఆవిడతో పాడించుకునే దాన్ని. ఆవిడ గొల్లకలాపం బాగా పాడేవారు.  
       నాకు యాభైయ్యేళ్ళుదాటాక కానీ మా అమ్మ పాడిన  పాటకి అర్ధం అనుభవంలోకి రాలేదు. 
       నాకు తెలిసి నా కుటుంబం గురించి కొద్ది, కొద్ది గా జ్ఞాపకాలు నాకు  నాలుగేళ్ళప్పుడు హోలీ పండగకి రంగులు చల్లుకున్నాక   స్నానాలు  కానిచ్చి మెడలో  పంచదార చిలకల దండలు వేసి అందరిని నిలబెట్టి తీయించిన ఫోటి బహుశ నాకు కొద్దిగా జ్ఞాపకం లీలగా మెదులుతున్నట్టుంటుంది. అప్పటికి మా ఇంట్లో బుచప్ప ,యాదగిరి నాన్నగారి దగ్గర వైద్యం నేర్చుకోడానికి వచ్చి ఇంట్లోనే ఉండేవారు. 
      ఆ తర్వాత నాకు కొద్దిగా తెలివి వచ్చినాక మా ఇంట్లో అందరికి వంటిమీద పుళ్లు వచ్చి, దానికి మా అమ్మ బంతిపూల రసంతో చేసిన మందు రాస్తుంటే మంట పుట్టి గెంతులేయడం నాకు బాగానే గుర్తుంది. 
      కోమటి ప్రభులింగం ఇంట్లో అద్దెకుండే వాళ్ళం. అబ్బుస్తోరు బువ్వమ్మ వాళ్ళు  మా ఇంట్లో పాల డబ్బా అయిపోతే హైదరాబాద్ నించి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు.   ముత్యలవాళ్ళ ఇంట్లో వెంకటరత్నంగారు ,భారత్ టాకీస్ దగ్గిర సాల్మన్  గారూ , హనుమాన్ టాకీస్ దగ్గర శాస్త్రి బాబా గారువాళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంట్లో పండగ సందడే ఉండేది. 
ఇంట్లో పనంతా చేసుకుని ఎప్పుడేనా అమ్మ నన్నుకానీ, మా అక్కవాల్లని కానీ తీసుకుని వారానికి కనీ వీలున్నప్పుడు కానీ పైన చెప్పిన వాళ్ళింటికి వెళ్తుండేది. వాళ్ళు కూడా అలాగే వస్తుందే వాళ్ళు  .   
    సాల్మన్ గారి  భార్య సత్య వేదమ్మ టీచరు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ముద్దు చేసిన తీపి గుర్తులు నాకింకా జ్ఞాపకం ఉన్నాయి. 1991తరవాత నేను వాళ్ళింట్లో మూడేళ్ళు అద్దేకున్నాను. ఆ రోజుల్లో కూడా పాత జ్ఞాపకాలని ఎప్పుడు నెమరు వేసుకునే వాళ్ళం.
       ప్రొద్దున్నే కాఫీ  వేళకి వెంకటరత్నంగారి ఇంటి నించి డాక్టరు గారూ కాఫిలు అయినాయా అంటూ ఒక బ్రేకుఫాస్ట్ కేక వినిపించేది. అది పలకరింపు కోసమని ఆలస్స్యంగా అర్ధం అయింది నాకు. మానవ సంబంధాలని ఒకసారి వల్లే వేసుకోవడానికి ఇలాంటి బాల్యాన్ని నెమరు వేసుకోవడం ఎంతైనా అవసరం.  
     ఇంటిపక్కన నర్సుబాయి, జాండ్ర అవ్వ  కూడా అమ్మకి స్నేహితులే. ఫలానా  వాళ్ళే స్నేహితులుండాలి అన్న  నియమాలేవీ లేకుండా అందరితోను కలివిడిగానే ఉండేది అమ్మ. అప్పట్లో మా అత్తయ్యలు, బాబాయిలు, బంధువులు కూడా వస్తూ, పోతూ, సంబంధ, బాంధవ్యాలు చాలా బాగుండేవి. మా ఇంట్లో రాఘవేంద్ర అనే అతను వారాలు చేసు కుంటూ మా ఇంట్లో ఉండి  చదువుకునే వాడు.    
ఒకసారి మా ఇంటికి కుటుంబి బావ వచ్చాడు, వీళ్ళంతా కలిసి సీత ఫలాలు తేవడానికి గుట్టకి వెళ్లి సాయంత్రం దాకా హాయిగా తిరిగి బోలెడన్ని కాయలు, పళ్ళు కోసుకుని తిరుగుముఖం పట్టారు . నేలిగిపోయిన పళ్ళని పెశం, పాశం
అంటూ వాళ్ళు ఆ రోజు అనుకున్న మాటలు మా ఇంట్లో ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా తలచుకుంటాం. ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఒక్క రోజులో అయిపోయేవా .......మళ్ళి మనసు గతంలోకి పరిగెత్తి ముందుకి నేట్టినప్పుడు మరిన్ని జ్ఞాపకాలతో మీ ముందుంటాను. 





1 comment:

Valli said...

బాగున్నాయి అత్తా నీ జ్ఞాపకాలు.