Wednesday, September 29, 2010

గుండెలు పిండివేసే సన్నివేశం

                ఆయేషా మీరా హత్యకేసు లో శిక్ష పడింది సత్యం బాబుకా,అతని తల్లిమరియమ్మకా ?    తప్పెవరిదో~శిక్ష మాత్రం పేదవాడికి. 

             డబ్బుంటే ఏమైనామనకి అనుకూలంగా మార్చుకో వచ్చు.
 
         చిన్నప్పుడుఒకచిన్న పెన్సిలుముక్క ఎక్కడేనా దొరికింది అని ఇంటికి పట్టుకుని వస్తేలక్ష యక్ష ప్రశ్నలువేసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్లని విచారించి తిరిగివాళ్ల వస్తువు వాళ్లకితిరిగి చేర్చే దాకా ఒప్పుకునేవాళ్ళు కాదు ఆనాడు పెద్దవాళ్ళు.
              
              మరి ఈ నాడు ప్రపంచం అందరు చెబుతున్న వాస్తవాన్నిన్యాయదేవత  కళ్ళకి  గంతలు కట్టి  మరీ  , అమాయకుడికి శిక్షవేసారు. 

     ఆతల్లి ఉపిరి కళ్ళలో పెట్టుకుని,  గడపాల్సిన  భవిష్యత్తు అంధకారం ఔతుంటే ఆతల్లి రోదన అరణ్య రోదన ఎప్పటికి కాకూడదు.

              మాతృమూర్తి రోదనభారత దేశంలో ఎన్నటికి ఒక వేదమంత్రమై 

న్యాయానికి ,బాసటగానిలవాలని కోరుకుంటున్నాను.  
                  
               సర్వే   జనాః  సుఖినొ:    భవంతు: 

3 comments:

కృష్ణప్రియ said...

అవును

పరిమళం said...

ఈ కేసులో ఇద్దరు తల్లులకూ న్యాయం జరగలేదు.ప్చ్ ...ఈ కోర్టులూ , చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ...ఇవేవీ వారికి న్యాయం చేయలేకపోయాయి.కనీసం హైకోర్టులోనైనా న్యాయం జరుగుతుందేమో చూడాలి.
సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యే విషయాలు ఏవీ కోర్టు దృష్టికి రాలేదో ఏమో ఇండియన్ పీనల్ కోడ్ లోని లోపాలకు ఇదో ఉదాహరణ!

శరత్ కాలమ్ said...

అభియోగ వివరాలు చూస్తుంటేనే చాలా సందేహాలు వచ్చాయి నాకు. జడ్జికి ఎందుకు రాలేదబ్బా?

1. ఆయేశాను పిండి రుబ్బే రాయితో తల చితక్కొట్టినప్పుడు పక్కనే పడుకున్న ఇద్దరు అమ్మాయిలకు ఎందుకు మెలకువ రాలేదు?

2. పోనీ శవాన్ని ఆ గది నుండి బాత్ రూము దాక లాక్కెళుతున్నప్పుడయినా ఆ అమ్మాయిలకు మెలకువ రావాలి కదా.

3. బలాత్కారం అయిపోయాక తీరిగ్గా మళ్ళీ ఆయేశా గదిలోకి వచ్చి డబ్బులు, ఫోటోలు తీసుకొని వెళ్ళాడంట. కనీసం అప్పుడయినా మెలకువ రాకుండా అంత మొద్దు నిద్ర ఎలా పోయారో ఆ పక్కనే పడుకున్న అమ్మాయిలు!

ఈ పై పనులన్నీ అంత నిశ్శబ్దంగా సత్యం చేసేడంటే నమ్మలేకుండా వున్నాను.