Life is a way
Life has so many flavors. some times we search for a life that is far away. But forget to live the life in our way. for those people this .... "life is a way"
Sunday, January 8, 2023
Monday, July 6, 2020
మూడు దశాబ్దాలజివిత అనుభవాలు
నిజంచెప్పాలంటేఆఫీసుకివెళ్తేమాతోబాటుచేరినచాలామంది సహోద్యోగులు పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరినికలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం. మరియు ప్రయత్నం . ఈ బ్లాగు ద్వారా
అందరికి సంబంధించిన ఏ సంగతులు అయినా పంచుకోవచ్చు
.jpg.bmp)
Monday, May 11, 2020
ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్
చాల రొజుల తర్వాత, ఏదైన ఒక మంచి పుస్తకం చదవాలని నారాయణగూడలో జరుగుతున్న విశాలాంధ్ర బూక్ ఫేర్ కి అదే పనిగా వెళ్ళాను. పుస్తకాలు వెతకడం మొదలెట్టగానే , నా కళ్ళు 'దర్గామిట్ట కథలు ' పుస్తకాన్ని చూసి మెరిసాయీ . ఎప్పట్నుంచో ఆ పుస్తకం చదవమని మా వాడు ప్రత్యీకంగా చెబుతున్నాడు. ఖరీదు చూశాను. 60 రూపాయలు అని ఉంది. అటు,ఇటు తిరగేసి ఒక పుస్తకాన్ని కొన్నాను, దాంతొ బాటె ఇల్లేరమ్మ కథలు వగైర కూడా కొని అర్జెంట్ గా ఇంటికి వచ్హి కాళ్ళైనా కడుక్కోకుండానే మంచం మీద అడ్డంగా పడి చదవటం మొదలెట్టాను.
మొదట్లొనే ఈ కథలన్నీ మా నాయనకి అంటునే మనసులోనించి రాయటం మొదలెట్టాడు ఖదీర్ బాబు. మా నాయన మూట కట్టుకున్నది ఆస్తిని కాదు, స్నేహితులని అని అయన రాసిన మాటలు మా నాయన కి కూడ అక్షరాల వర్తిస్తాయి. అందుకే నాకు బాగా మనసుని తాకిందామాట. నాయినలు కేవలం ఆస్తులే కూర్చడం పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లోకూడా, మా నాయన సంపాదించిన తరగని అస్తిని ఎంతో అపురూపంగా భావిస్తాను నేను., దీంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితదర్పణం.మనసు పంచుకున్నాడు ఖదీర్ బాబు స్పటిక మంత స్వచమైన భావంతో,భాషతో ఒక్కటేంటి, ప్రతి కథ ఒక స్పటికమే. మెరుస్తూ మనకి కనిపిస్తున్న జీవన చిత్రం.
ఫుస్తకం అయిపొయినాక దాని ప్రభావం చాల దినాలు నన్ను వదల్లెదు. ఖదీర్ బాబుకి పేరు పెట్టిన మీసాల సుబ్బరాజు అనుకొని ఉందదు,తన పేరు ఇంత గుర్తు పెట్టుకుంటాడని . ఉర్దు చదవలేక తను మిస్సయిన ఉర్దు సాహిత్యన్ని తలుచుకున్న తీరు చాల బాగుంది. అమ్మతొ బెంచి సినిమా ,మేము మా మేనత్త తో ఎంజాయ్ చెసిన అనుభవాన్నీ గుర్తు చెసింది. దాదాపుగా అయన అనుభవాలన్ని మా జీవిత ఛిత్రాలే. కానీ దాన్ని స్వఛ్హం గా ప్రెజెంట్ చెయగలిగాదు ఖదీర్ బాబు. సంత్రుప్తి గా ఉంది
ఫుస్తకం వనితా విత్తం... అంటుంటారు గా.. జాగ్రత్తగా దాచుకొండి. నేను చదివి పొందిన అనుభూతి మాటలలొ చెప్పాలంటె మల్ళి ఒక పుస్తకం తయరౌతుంది. కానీ నాకంత శక్తి లేదేమో........
Monday, September 4, 2017
Life is a way: ఆది గురువు
Wednesday, March 1, 2017
కూనలమ్మ పదాలు
కూనలమ్మ పదాలు
....ఆరుద్ర
సర్వజనులకు శాంతి,స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మా !
ఈ పదమ్ముల క్లుప్తి ,ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి ,ఓ కూనలమ్మా !
సామ్యవాద పథమ్ము ,సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము ,ఓ కూనలమ్మ !
అరుణబింబము రీతి ,అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి ,ఓ కూనలమ్మా !
సర్వజనులకు శాంతి ,స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి ,ఓ కూనలమ్మా !
ఈ పదమ్ముల క్లుప్తి ,ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి ,ఓ కూనలమ్మా !
తెలివితేటల తాడు ,తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు ,ఓ కూనలమ్మా !
ఇజము నెరిగిన వాడు ,నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు ,ఓ కూనలమ్మా !
స్టాలినిస్టు చరిత్ర ,సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర , ఓ కూనలమ్మా !
మధ్యతరగతి గేస్తు ,మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు , ఓకూనలమ్మా !
దహనకాండల కొరివి ,తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి , ఓ కూనలమ్మా !
కూరుచుండిన కొమ్మ ,కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ ,ఓకూనలమ్మా !
కష్టజీవుల కొంప ,కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప ,ఓకూనలమ్మా !
జనుల ప్రేముడి సొమ్ము ,క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము ,ఓకూనలమ్మా !
మధువు మైకము నిచ్చు ,వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు ,ఓకూనలమ్మా !
హరుడు అధికుడు కాడు ,నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు ,ఓకూనలమ్మా !
సుదతిపాలిట భర్త ,మొదట వలపుల హర్త
పిదప కర్మకు కర్త ,ఓకూనలమ్మా !
చివరి ప్రాసల నాభి ,చిత్రమైన పఠాభి
కావ్యసుధట షరాభి ,ఓకూనలమ్మా !
తీర్చినట్టి బకాయి ,తెచ్చిపెట్టును హాయి
అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మా !
నిజము నిలువని నీడ నీతి యన్నది చూడ
గాజు పెంకుల గోడ ఓకూనలమ్మా !
చెప్పి దేవుని పేరు చెడుపు చేసెడివారు
ఏల సుఖపడతారు ఓకూనలమ్మా !
ఈశుడంతటివాడు ఇల్లరికమున్నాడు
పెండ్లయిన మరునాడు ఓకూనలమ్మా !
మరియెకరి చెడు తేది మనకు నేడు ఉగాది
పంచాంగమొక సోది ఓకూనలమ్మా !
జనులు గొర్రెలమంద జగతి వేసెడు నింద
జమకట్టు స్తుతి క్రింద ఓకూనలమ్మా !
ఉడుకు రచనల యందు ఎడద మెదడుల విందు
లేటు గోపీచందుఓ కూనలమ్మా !
ఇరకు కార్యపు గదులు ఇరుకు గోడల బదులు
మేలు వెన్నెల పొదలు ఓకూనలమ్మా !
కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు ఓకూనలమ్మా !
పరుల తెగడుట వల్ల బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల ఓకూనలమ్మా !
కోపాగ్నులకు వృద్ధి కుత్సితాలకు రద్ది
లేమి చంపు సుబుద్ధి ఓకూనలమ్మా !
అతివ పలుకే చాలు అందు వేనకువేలు
మొలచు నానార్థాలు ఓకూనలమ్మా !
చెక్కు చెదరని వక్త చేదు నిజము ప్రయోక్త
చంపబడును ప్రవక్త ఓకూనలమ్మా !
ఎంకి పాటల దారి ఎడద గుర్రపు స్వారి
చేయులే నండూరి ఓకూనలమ్మా !
ఆలు మగల లడాయి అంత మొందిన రేయి
అనుమానపు హాయి ఓకూనలమ్మా !
బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటుఓకూనలమ్మా !
రాజముద్రికె మొహరు ప్రజల నేతయె నెహురు
స్వేచ్ఛ పేరే యుహురుఓకూనలమ్మా !
జనులు నమ్మెడివరకు కనులు తెరవని వరకు
వెలుగు నకిలీ సరకుఓకూనలమ్మా !
పాత సీసాలందు నూతనత్వపు మందు
నింపితే ఏమందు?ఓకూనలమ్మా !
అయిదు రోజులు వేస్టు అగుట కెయ్యది బెస్టుఝ
చూడుము క్రికెట్ టెస్టు ఓకూనలమ్మా !
'అతడు - ఆమె'ల ఫైటు అతివ ఛాన్సులు బ్రైటు
ఆడదెపుడూ రైటు ఓకూనలమ్మా !
Thursday, February 23, 2017
శివ తాండవం
శివుడూ తాండవమూ చేయూనమ్మా
కైలాసగిరిలో శివుడూ తాండవమూ చేయూనమ్మా.
శివుడుతాండవము చేయుచునిత్యము
అభిదళముగజగదాంబముందల /శివుడు/
భారాతీ వీణా శృతి వాయింప
లయతప్పకుండాబ్రహ్మ
తాళములాగొల్పుచుండ
సారసగతులనుసప్తతాళముల
సారముతప్పక ప్రదోషవేళల//శివుడు/
శివశివా
శివపాదమునుంచనేను
శిలనైనను కారాదా
కైలాసపు స్వామిమరల
కలనైనను రారాదా// శివపాదమునుంచనేను
పూవునైన కాబోనా
పూజకైన నేలేనా
కలతకనులుకరిగిప్రభువు
కభిషేకము కారాదా//శివపాదమునుంచనేను
కంటిపాప గంటవినులు
మింటిదారి నందిదేమొ
ఎదనీచిరుగజ్జమ్రోత
చెవులేమో ఢమరుకమూ//శివపాదమునుంచనేను
వెలుగుదారివినువీధిని
కనులేగునునీకొరకై
మబ్బువెంటమలుపువెంట
మనసులోని పిలుపువెంట
నీవెనీవె మృత్యుంజయా
నిలిచిపోగరారాదా//శివపాదమునుంచనేను
శివశివా
శివశివశివ అనరాదా
శివనామము చేదా2
శివపాదముమీద
నీ శిరసునుంచరాదా2
భవసాగరమీద దుర్భర
వేదన ఏలా//శివ//
కరుణాళుడుకాదాప్రభు
చరణధూళిపడరాదా
హరహరహర అంటేమన
కరువుతీరిపోదా 2
కరిపురుగూ పాముబోయ
మొరలిడగా వినలేదా
కైలాసముదిగివచ్చి
కైవల్యము ఇడలేదా2
మదనాంతపుమీద
నీమనసెన్నడుపోదా
మమకారపుతెరస్వామిని
మనసారాకననీదా2
శివశివశివ అనరాదా
శివశివశివ అనరాదా
శివనామము చేదా2
Tuesday, February 21, 2017
Monday, February 6, 2017
గోవిందం భజ మూఢమతే 2 టైమ్స్
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి దుక్రింకరణే
1,మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం
2.నారీ స్తనభర నాభీదేశం
దృష్త్వా మాగా మోహావేశం
ఏతన్మాంస వసాదివికారం
మనసి విచింతయా వారం వారం
3.నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలం
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం సమస్తం
4.యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే
5.యావత్ పవనో నివసతి దేహే
తావత్ పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే
6.అర్ధమనర్ధం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యం
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః
7.బాల స్తావత్ క్రీడాసక్తః
తరుణ స్తావత్ తరుణీసక్తః
వృద్ధ స్తావత్ చిన్తాసక్తః
పరమే బ్రహ్మణి కోపి న సక్తః
8.కా తే కాన్తా కస్తే పుత్రః
సంసారో అయమతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః
తత్వం చిన్తయ తదిహ భ్రాతః
9.సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తిః
10వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః
11.మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్ కాలః సర్వం
మాయామయమిదం అఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
12.దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః
13.ద్వాదశ మంజరికాభిర శేషః
కథితో వైయా కరణస్యైషః
ఉపదేశో భూద్ విద్యానిపుణైః
శ్రీమచ్చంకర భగవచ్చరణైః
14.కాతే కాన్తా ధన గత చిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా
త్రిజగతి సజ్జన సంగతి రైకా
భవతి భవార్ణవతరణే నౌకా
15.జటిలో ముణ్డే లుంజిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదర నిమిత్తం బహుకృత వేషః
16.అంగం గళితం పలితం ముణ్డం
దశన విహీనం జాతం తుణ్డం
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం
తదపి న ముంచత్యాశా పిణ్డం
17.అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుక సమర్పిత జానుః
కరతల భిక్షస్తరుతల వాసః
తదపి న ముంచత్యాశా పాశః
18. కురుతే గంగా సాగర గమనం
వ్రత పరిపాలనమథవా దానం
జ్ఞాన విహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మ శతేన
19.సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః
సర్వ పరిగ్రహ భోగః త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః
20.యోగరతో వా భోగరతోవా
సంగరతోవా సంగ విహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ
21.భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా
సకృదపి యేన మురారీ సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా
22.పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయాపారే పాహి మురారే
23.రథ్యా చర్పట విరచిత కన్థః
పుణ్యాపుణ్య వివర్జిత పన్థః
యోగీ యోగ నియోజిత చిత్తో
రమతే బాలోన్మత్త వదేవ
24.కస్త్వం కోహం కుత ఆయాతః
కామే జననీ కో మే తాతః
ఇతి పరిభావిత నిజ సంసారః
సర్వం త్యక్త్వా స్వప్న విచారః
25.త్వయి మయి సర్వత్రైకో విష్ణుః
వ్రర్థం కుప్యసి మయ్యసహిష్ణుః
భవ సమ చిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం
26.కామం క్రోధం లోభం మోహం
తక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మ జ్ఞ్నాన విహీనా మూఢాః
తే పచ్యన్తే నరక నిగూఢాః
27.గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీన జనాయ చ విత్తం
28.శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్ సృజ భేదాజ్ఞ్నానం
29.సుఖతః క్రియతే కామాభోగః
పశ్చాద్దన్త సరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం
30.ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారం
జాప్య సమేత సమాధి విధానం
కుర్వ వధానం మహదవధానం
31.గురు చరణామ్భుజ నిర్భర భక్తః
సంసారా దచిరాద్భవ ముక్తః
సేన్దియ మానస నియమా దేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం
32.మూఢః కశ్చిన వైయాకరణో
డుకృణ్కరణాధ్యయన ధురీణః
శ్రీమచ్చంకర భగవచ్చిష్యైః
బోధిత ఆసీచ్చోదిత కరణైః
Wednesday, January 25, 2017
అన్నమాచార్య కీర్తన
వొగినడియాసలు వొద్దనవే ||
చ|| తొల్లిటి కర్మము దొంతల నుండగ |
చెల్లబోయిక జేసేదా |
యెల్ల లోకములు యేలేటి దేవుడ |
వొల్ల నొల్లనిక నొద్దనవే ||
చ|| పోయిన జన్మము పొరుగులనుండగ |
చీయనక యిందు జెలగేదా |
వేయినామముల వెన్నుడమాయలు |
ఓ యయ్య యింక నొద్దనవే ||
చ|| నలి నీనామము నాలికనుండగ |
తలకొని యితరము దడవేదా |
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి |
వొలుకు చంచలము లొద్దనవే ||
అన్న మా చార్య కీర్తన
వే(గైన వేంకటగిరి వెలసిన శిశువు