Monday, July 6, 2020

మూడు దశాబ్దాలజివిత అనుభవాలు

               మూడు దశాబ్దాల జివిత అనుభవాలు చిన్నప్పటి నుంచి అడపా దడపా జరిగిన సంఘటనలు, నా ప్రతిస్పందనలు ఈ బ్లాగు లో వ్రాస్తూనె సాధ్యమైనంత వరకు కొందరికైనా ఉపయోగ పడేలాగా దీన్ని రూపు దిద్దాలని నా ప్రయత్నం . 
    నిజంచెప్పాలంటేఆఫీసుకివెళ్తేమాతోబాటుచేరినచాలామంది సహోద్యోగులు పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరినికలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం. మరియు  ప్రయత్నం . బ్లాగు ద్వారా
  అందరికి సంబంధించిన సంగతులు అయినా పంచుకోవచ్చు
          ఉద్యోగం లో చేరడం అనేది నెనెప్పుడూ  ఆలోచించలేదు.అసలు విశ్లేషించుకుంటే నన్ను నేనుఏవిషయం లో కూడా ఒక గోలు పెట్టుకుని ,ఏదో కష్ట పడి దాన్ని సాధించానని చెప్పడానికి  ఏమి లేదు. రోజులు
గడుస్తున్నై, వాటితో బాటే అవకాశాలూ వచాయి. గుంపులో గోవింద లాగ అన్దరూ ఏమి చేస్తే ,మనం కూడా వారితో కలిసిపోయి అదే పని చేయడమే.
 మనసులో యిదేలాగా, అదెలాగ అని ఎన్నో ప్రశ్నలు వచెవెఇ. కాని వాటికి  ఓపికగా సమాదానాలిచే తిరికపెద్దవాళ్ళకిలేదు,అలాగని మనం అడిగేసామా అంటే అంత సిను అస్సలు లేదు.కల్లెర్రజుసి చూసే పెద్దవాళ్ళని ప్రశ్నించే దమ్ము నాకు ఆ రోజుల్లో లేదు.కానీ కో కొల్లలుగా వస్తున్నా ప్రశ్నల్ని నాలో నేనే ప్రశించుకుని, చాలాకాలం వరకు ఒక ప్రశ్న గానే మిగిలిపోయన్నేను.
ఎందుకని అడిగినా, విమర్శించినా నాదగ్గర సమాధానం లేదు. నేను 10th exams వ్రాసాక ఇంటరు లో జేరేప్రహసనం తమాషాగా ఉండింది. అది తర్వాత చెప్తా.  
                                               *     *       *      *     *    *     *
         సరిగ్గా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే వ్రాసా ననుకుంటా. ఏమ్ప్లయిమేంట్ ఆఫీసు కి వెళ్లి 10th   పూర్తికాగానేఏమ్ప్లోయి మెంటు కార్డు అప్పట్లో ఒకఅవసరం గా భావించే వాళ్ళు.అందరిలాగే నేను కూడా కార్డుతిసుకున్నా. అందులో సితమ్మగారని మాకు , మా కుటుం బానికి తెలిసిన ఆవిడ పని చేస్తూ ఉండేవారు.వెళ్ళగానే  procedure అంతా చెప్పి వెంటనే కార్డు చేతికి ఇచ్చి పoపించారావిడ . ఆ క్షణం లో ఏదోసాధించేసినట్లు ఒక ఫీలింగు . అప్పట్లో దాన్ని క్రమం తప్పకుండా రెన్యువల్ చేయించుకోవాలి . అల్లాగేచేసేవాళ్ళం. దాంతో బాటే టైపు నేర్చుకోవడం కూడా ఒకటి . నేను, మా చిన్నక్క,పెద్దక్క ప్రతినిత్యము టైపు కివెళ్ళేవాళ్ళం.
         
              దీంతో బాటే ఇక్కడ చెప్పాలిసిన ముఖ్యులు కి.శే. వేణుగోపాల రావు గారు. ఆయన్ని గురించిచెప్పకపోతే నా తెలివితేటలకి అహంకారాన్ని జత చేసినదాన్నవుతాను. నా యీ జీవితం స్వార్జితం తో, ఎవరిమీదా ఆధారపడకుండా సాగుతోందంటే ఇదంతావేణుగోపాల రావు గారు మాకు పెట్టిన విద్యా దానం వల్లనే అనడం ఎంత మాత్రం సందేహం లేదు. బొటాబొటీ
సంపాదనతో మా కుటుంబంలో దాదాపు పది మందిని పోషించవలసిన బాధ్యత మా నాన్నగారిది. అలాంటప్పుడుఇంతమందికి ఖర్చు  పెట్టి చదువు చెప్పించాలంటే అయే పని కాదు. అలాంటి టైములోనేవేణుగోపాల రావు గారు మాకు పరిచయ మయ్యారు.

         మేముండే కాంపౌండ్ లోనే వాళ్ళు కూడా అద్దెకుండే వాళ్ళు. లలిత కళలన్నా, పిల్లల కార్యక్రమాలన్నఆయనకి చాలా ఇష్టం. అప్పుడే మా కంపౌండు లో నవజీవన బాలానంద సంఘం అన్నదాన్నొక దాన్ని నా
స్నేహితుడు, కిషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తే దానికి   వేణుగోపాల రావు గారు సలహాలు, కార్యక్రమాల నిర్వహణ కిమాట సాయము చేస్తుండేవారు. నేను   10th  చదువుతూ చిన్న, చిన్నగా గేయాలు, నాటకాలు, పాటలు
వ్రాస్తుండే  దాన్ని. ఈ సందర్భం లో నేను స్వార్ధం అన్న ఒక నాటిక రాసి, కిషన్ మా ఇంటికి వస్తే చూపించాను. అది చూసి కిషన్ ,దీన్ని నవంబెర్ లో మన బాలల కార్యక్రమాల్లో వేద్దామని చెప్పి ఆ పనికుపక్రమించాడు. 

  అప్పుడే వేణుగోపాల రావు గారు యమలోకంలో కరప్షన్ అన్న ఒక నాటకం వ్రాసి పిల్లలన్దరితోను కలిసి ఆనాటకాన్ని వేయించాడు. దాన్లో ప్రదీప్, ఆనంద్(ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో పని చేస్తున్నాడు),విద్యాసాగర్,మధు
మొదలైనవాళ్ళు పాత్రలు పోషించారు. అద్భుతమైన ఆ నాటకాన్ని ఎప్ప్పటికి మర్చిపోలేము. దాని తర్వాతేచాలాకాలానికి ఎన్.టి రామారావు గారూ నటించిన యమ దొంగ సినిమా వచ్చింది.ఇప్పుడు ఆ  కిషను లేడు,, వేణుగోపాల రావు గారు లేరు. 
   మిగతావాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. కొంతమంది అపుడప్పుడు పలకరిస్తూఉంటె కొంత మంది ఎక్కడున్నారో తెలిదు. గుండేరావు మమయ్యగారి ఇంటి అరుగు మీద మా నాటకాలప్రదర్శన జరుగుతూ ఉండేది. ఆ వేదిక మాకిచ్చినందుకు మా బాలానంద సంఘం  తరఫున ఆయనకీ మేము గౌరవం గా ఏదో బిరుదు బ్బహుష కళా కిరీటి అనో మరేదో  కూడా మా సంఘం తరఫున ఇచ్చినట్లు జ్ఞాపకం.

2 comments:

Tanu Collections said...
This comment has been removed by a blog administrator.
Tanu Collections said...

namskaram bhrathi garu....
dayachesi apartham chesukokunda nenu rasindi chadavandi....
mee blog modatisari choosanu....mee blog chadivekante mundu mee photo choosi ascharyapoyanu..endukante nenu preminchi aradinchina na PANDU and meeru iddaru okela vundatam choosi aschryam kaligindi....tanu nannu vadili aa devidini cheri sarigga 20 months kavostundi....
mee photo tanaki chala daggraga vundatam to naku malli tanani choosinatle anipinchindi....
dayachesi tappuga bhavinchakandi...endukante nenu bahusa mee abbai vayasu leda antakante takkuve kavochu....
meeku a bhagavantudu sampurna ayurarogyalu ivvalani manasara korukuntu

mee abhimani
raveendra nath