Tuesday, January 17, 2017

గ ణ ప తి నవల రచన చిలకమర్తి లక్ష్మీనరసింహం

(1) ఆహాహా మన దేశమునందు జీవ చరిత్రములు లేని లోపమిప్పుడు కనబడుచున్నది.చరిత్ర రచనమునందు మన పూర్వికులకు శ్రద్ధయెంతమాత్రమూ లేకపోవుటచే నొక్క మహా పురుషుని చరిత్రమైన జదివెడు భాగ్యము మనకబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు
మహారాజుల యొక్కయూ,నన్నయ భట్టారక తిక్కన్న సోమయాజి ప్రముఖ మహాకవులయొక్క చరిత్రములు చేకూరనందున మనమంత విచారించవలసిన పని లేదు. కానీ గణపతియొక్క చరిత్రను సంపూర్ణముగ లభింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనే గుడ్డిలో మెల్ల యన్నట్ట్లు కొంత చరిత్రము మనకసంపూర్థిగానైన లభించినందుకు సంతోషించవలయును. సంగ్రహముగ నైన నీ చరిత్రము నా కెట్లు లభించినదో చెప్పెద వినుండు

ఒక నాడు నేనొక మిత్రునింటికి విందారగింప బోతిని. ఆ మిత్రుని ఇంట వివాహము జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులు అనేకులు వచ్చియుండిరి.
ఇప్పటివలెచీట్లుపంపిభోజనమునకుపిలిచెడుఆచారమప్పుడులేదు. పెందలకడనేభోజనముబెట్టునాచార మంతకంటే లేదు. విస్తళ్ళు వేయునప్పడికి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి నాలుగు గడియలు పొద్దు పోయెను. .భొజనము చేసి లేచునప్పటికి కొక్కొరోకో యని కోడి కూసెను.
(2)విస్తళ్ళు వేయక మునుపు ,విస్తళ్ళముందు గూర్చుండిన తరువాతను భోజనము చేయుచు వంటకము లెడనెడ వచ్చులోపలనూ నేను నాలుగు కునుకులు కునికితిని. ఆ నిద్రలో నాకొక స్వప్నము వచ్చెను. ఆ స్వప్నములో విలక్షణమైన ఒక విగ్రహము కనపడెను. కర్కోటకుడు

కఱచిన తర్వాత మారురూపము దాల్చిన నలుడా యితండని యా విగ్రహము చూచి నేను వితర్కించుకొంటిని .వామన రూపుడా యని మఱికొంత సేపనుకొంటిని.అప్పటికి నాకుదోచిన కొన్ని కారణములచేత నేననుకొన్న రెండు రూపములూ కావని నిశ్చయించుకుని యది పిశాచమై యుండవచ్చునని


 భావించి భయపడితిని. ఆ పురుషుడు నా భయముజూచి నవ్వి "భయపడకు భయపడకు నేను నీకు హాని చేయదలచి రాలేదని మీద చేయి వైచి తట్టి వెండియు నిట్లనియె
అయ్యా నేను గణపతిని. కానీ పార్వతీ పరమేశ్వరుల కుమారుడనైన వినాయకుడను కాను.
నా చరిత్ర మిక్కిలి రమణీయమైనది. ఇది మీరాంధ్ర భాషలో రచియింపవలయునని నా కోరిక
నా చరిత్రము మిక్కిలి లోకోపకారము.
ఇది మీరు తప్ప యెవ్వరు రాయజాలరు. సాహిత్య విద్యా చతుర్ముఖులైన విద్వాంసులు లోకమున పెక్కండ్రు కలరు. తర్క వ్యాకరణ శాస్త్ర పండితులగు పండితులు పెక్కండ్రు కలరు. కానీ వారిచేత నా చరిత్రము వ్రాయించుకొనవలెనని నాకు ఇష్టములేదు. వారు నా చరిత్ర వ్రాయందగరు. వారెనంత సేపూ భావాతీతములైన యుత్ప్రేక్షలతో నతిశయోక్తులతో కాలక్షేపము సేయుదురు. వారి ద్రుష్టికి వెన్నెలలు,చందమామలు ,తామరపువ్వులు,కలువపువ్వులు హంసలు చిలుకలు తోటలు కోటలు మేడలు, మిద్దెలు మలయమారుతములు, విరహతాపములు మకరం ప్రవాహము మొదలైనవే వచ్చును.

(3)కానీ నిగర్వమైన నా చరిత్ర వారికి నచ్చదు . అందు చేత గీర్వాణ విద్వాంసులు గీర్వాణము జూచిన నాకు తలపోటు.ఇప్పుడు నా చరిత్రము మీకు జెప్పెదను. విని వ్రాయకపోయిన పక్షమున మీరు కాసీలో గోహత్య జేసినట్ట్లే ప్రయాగ లో బ్రహ్మహత్య సల్పినట్లే. కురుక్షేత్రములో కుక్కను తిన్నట్లే ఇంకనూ మీరు వ్రాయని పక్షమున నేను దయ్యమునై .మిమ్మునూ మీ వంశము వారిని పదునాలుగు తరములవఱకు పట్టుకొని పీకికొని తినియెదను జాగ్రత్త. మీరు వ్రాసిన తరువాత నా చరిత్రము పఠియించిన వారికి పంచమహాపాతకములడంగును. పఠియింపనివారు చెద పురుగులైపిట్టి మఱియొక జన్మమున పుస్తకము తినివేయుదురు అని చెప్పి తన వ్రుత్తాంతము సంగ్రహముగ నాకెరింగించెను


.నాలుగు  కునింకిపాటులతో నాలుగు పావులు చెప్పి సంగ్రహమైన యీ కధ ముగించి నీకేమైన సందేహములున్న నన్నడుగుమని మరిమరి యడిగెను.అడుగుటకు నేను ప్రయత్నముజేసి నోరుతెరువబోవుచుండ వడ్డన బ్రాహ్మణుడు నా చేయిమీద వేడి చారు పోసెను. నేను విస్తరిముందు గూర్చుండి చారెంతసేపటికీ  రాకపోవుటచే గోడకు చేరగిలబడి దొన్నెలో చేయిబెట్టుకొని స్వప్నసుఖములనుభవించుచుండగా మోత బ్రహ్మణుడు నా చేయి గాల్చెను. అందుచేత నాకు మెలకువ వచ్చెను. 
  మరల మజ్జిగ వచ్చునప్పటికి గొంత యాలస్స్యమైనది. కానీ చేతి మంటచే  నిద్ర పట్టినదిగాదు. మరల నిద్రపట్టిన పక్షమున గణపతి నా కలలో మరల గనంబడి నా సందియములన్ తొలగించియుండును.మరియొకసారి అదుగుదమని తలచితినితలంచితిని  గాన నాటికీనేటికీ  మరల అతండు స్వప్నమున గనంబడలేదు.  

భోజనానంతరము నేను  నా గృహంబునకరిగి మంచముపై బండుకొంటిని. కానీ నిద్ర పట్టినదికాదు.భుజించిన వంటకములు త్రేన్పురాదొడంగెనుగణపతి చరిత్రము స్మ్రుతి పధమున
నిలువ జొచ్చెను. అతని మూర్తి నా కన్నుల ఎదుట నిలిచినటులే యుండెను. ఇది నిజముగా స్వప్నమై యుండునా ! నా మనోభ్రమయా అని నేఅను కొంతసేఅపు వితర్కి0చితిని. నిశ్చయముగా స్వప్నమేయని సిద్ధాంతము చేసితిని.కలలోని వృత్తాంతమును నమ్మి గణపతి చరిత్రమును నేను వ్రాయవలసి యుండునా అని నాలో నేనాలోచి౦చుకొ౦టిని వ్రాయుటయేసర్వోత్తమమని నిశ్చయించితిని వ్రాయకపోయిన నాతడు పిశాచమై పీడిన్చునను భయము చే నేనిది రచియించ సమకట్టలేదుసుమీ !ఎందుచేతనన నేను దయ్యములు లేవని వాదించు వారలలో నొకండను.
  అట్లయిన నేల  వ్రాసితిరందురేమో ?స్వప్నమునందొక పురుషుడు కనబడుటయు ,దన చరిత్ర సంక్షేపముగా జెప్పుట యు  నది వ్రాయుమని కోరుటయు ,నది ఎంతో  విచిత్రముగా నుండుటయు మొదటి కారణము .ఆంధ్ర భాషాభిమానము  రెండవ కారణము .భారత,భాగవత,రామాయణాది పురాణములు విని చెవులు తడకలు కట్టిన వారికి వినోదమేదైనను కల్పింపవలయుననునది  మూడవ కారణము . ఆంగ్లేయ భాషాభి వృద్ధి యగుతున్న ఈ దినములలో స్వప్నములలో మనుషులు కనపడుట ,గ్రంధములు వ్రాయమనుట చదువరులనేకులు నమ్మకపోవచ్చు. నమ్మకపోయినా నాకేమి భయము? ఇది యబద్దము  కాదుకదా. మహాకవియగు తిక్కన సోమయాజికి  అతని జనకుండగు కొమ్మన  దండనాధుండును హరిహరనాధుండును స్వప్నమునసాక్షాత్కరించిమహాభారతరచనకుబురికొల్పలేదా ,శ్రీకృష్ణదేవరాయలవారికిశ్రీకాకుళమున ఆంధ్రనాయకస్వామి కలలో  సాక్షాత్కరించి విష్ణుచిత్తియముఅను  నామాంతరం గల యాముక్తమాల్యదను రచియించి తన కంకితమిమ్మని కోరలేదా ? తెలుగు కవులు కావ్య రచనకు ముందు కలలుగనుట సాంప్రదాయసిద్ధము. కాబట్టి మా కలలో నంత వైపరీత్యము ఏమియును లేదు. కల మాట గట్టిపెట్టి కథాకథనం లోనికి దిగియెద 

    





















No comments: