Wednesday, March 1, 2017

కూనలమ్మ పదాలు


కూనలమ్మ పదాలు
....ఆరుద్ర

సర్వజనులకు శాంతి,స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మా  !

ఈ పదమ్ముల క్లుప్తి ,ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి ,ఓ కూనలమ్మా !

సామ్యవాద పథమ్ము ,సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము  ,ఓ కూనలమ్మ !

అరుణబింబము రీతి ,అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి ,ఓ కూనలమ్మా !

సర్వజనులకు శాంతి ,స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి  ,ఓ కూనలమ్మా !

ఈ పదమ్ముల క్లుప్తి ,ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి ,ఓ కూనలమ్మా !

తెలివితేటల తాడు ,తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు  ,ఓ కూనలమ్మా !

ఇజము నెరిగిన వాడు ,నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు ,ఓ కూనలమ్మా !

స్టాలినిస్టు చరిత్ర ,సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర , ఓ   కూనలమ్మా !

మధ్యతరగతి గేస్తు ,మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు , ఓకూనలమ్మా !

దహనకాండల కొరివి ,తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి , ఓ కూనలమ్మా !

కూరుచుండిన కొమ్మ ,కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ ,ఓకూనలమ్మా !

కష్టజీవుల కొంప ,కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప ,ఓకూనలమ్మా !

జనుల ప్రేముడి సొమ్ము ,క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము ,ఓకూనలమ్మా !

మధువు మైకము నిచ్చు ,వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు ,ఓకూనలమ్మా !

హరుడు అధికుడు కాడు ,నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు ,ఓకూనలమ్మా !

సుదతిపాలిట భర్త ,మొదట వలపుల హర్త
పిదప కర్మకు కర్త ,ఓకూనలమ్మా !

చివరి ప్రాసల నాభి ,చిత్రమైన పఠాభి
కావ్యసుధట షరాభి ,ఓకూనలమ్మా !

తీర్చినట్టి బకాయి ,తెచ్చిపెట్టును హాయి
అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మా !

నిజము నిలువని నీడ నీతి యన్నది చూడ
గాజు పెంకుల గోడ ఓకూనలమ్మా !

చెప్పి దేవుని పేరు చెడుపు చేసెడివారు
ఏల సుఖపడతారు ఓకూనలమ్మా !

ఈశుడంతటివాడు ఇల్లరికమున్నాడు
పెండ్లయిన మరునాడు ఓకూనలమ్మా !

మరియెకరి చెడు తేది మనకు నేడు ఉగాది
పంచాంగమొక సోది ఓకూనలమ్మా !

జనులు గొర్రెలమంద జగతి వేసెడు నింద
జమకట్టు స్తుతి క్రింద ఓకూనలమ్మా !

ఉడుకు రచనల యందు ఎడద మెదడుల విందు
లేటు గోపీచందుఓ కూనలమ్మా !

ఇరకు కార్యపు గదులు ఇరుకు గోడల బదులు
మేలు వెన్నెల పొదలు ఓకూనలమ్మా !

కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు ఓకూనలమ్మా !

పరుల తెగడుట వల్ల బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల ఓకూనలమ్మా !

కోపాగ్నులకు వృద్ధి కుత్సితాలకు రద్ది
లేమి చంపు సుబుద్ధి ఓకూనలమ్మా !

అతివ పలుకే చాలు అందు వేనకువేలు
మొలచు నానార్థాలు ఓకూనలమ్మా !

చెక్కు చెదరని వక్త చేదు నిజము ప్రయోక్త
చంపబడును ప్రవక్త ఓకూనలమ్మా !

ఎంకి పాటల దారి ఎడద గుర్రపు స్వారి
చేయులే నండూరి ఓకూనలమ్మా !

ఆలు మగల లడాయి అంత మొందిన రేయి
అనుమానపు హాయి ఓకూనలమ్మా !

బ్రూటు కేసిన ఓటు బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటుఓకూనలమ్మా !

రాజముద్రికె మొహరు ప్రజల నేతయె నెహురు
స్వేచ్ఛ పేరే యుహురుఓకూనలమ్మా !

జనులు నమ్మెడివరకు కనులు తెరవని వరకు
వెలుగు నకిలీ సరకుఓకూనలమ్మా !

పాత సీసాలందు నూతనత్వపు మందు
నింపితే ఏమందు?ఓకూనలమ్మా !

అయిదు రోజులు వేస్టు అగుట కెయ్యది బెస్టుఝ
చూడుము క్రికెట్‌ టెస్టు ఓకూనలమ్మా !

'అతడు - ఆమె'ల ఫైటు అతివ ఛాన్సులు బ్రైటు
ఆడదెపుడూ రైటు ఓకూనలమ్మా  !

No comments: