Life has so many flavors. some times we search for a life that is far away. But forget to live the life in our way. for those people this .... "life is a way"
Friday, November 19, 2010
Monday, November 15, 2010
Thursday, November 11, 2010
Wednesday, November 10, 2010
అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్
యీమధ్యనె కాదు, ఎన్నాళ్ళనుంచో నేను త్రుటిలో తప్పించుకున్న ప్రమాదాల్లో ఉమ్మించుకోవడం అన్నది ఒకటి.(చిన్నప్పుడు నాకు ఆ అనుభవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళింట్లోనే కూచుని మా పక్కింటి బువ్వమ్మ పాను వేసుకుని నన్ను పవిత్రం చేసి, మాఫ్కరో బేటా అని బాధ పడటం నాకింకా గుర్తే. కాని నా బాధ ఆవిడ బాధ కంటే మించి పోయింది,) వినడానికి సాధారణంగా అనిపించినా దీని బారిన పడ్డవాళ్ళ అవస్థ అంత ఇంతా కాదు మరి. ఎలాగంటారా చూడండి.
అతి పెద్ద ప్రమాద కనిపించేది C.B.S బస్స్టాండ్ లో .(దూర దూరాలకి వెళ్ళడానికి ఎంతొ శ్రమపడి శుభ్రం గా తయారు అయి బస్ స్టాండు కి చేరుకుంటాం. బస్సు కి, బస్సు కి మధ్యన కొద్దిగా జాగా ఉంటుంది కదా అక్కడికి చేరేప్పడికి ప్రతి రోజు ప్రయాణించే వాళ్ళకైతేనేఁ , ఆఫీసు పనుల మీద వెళ్ళే వాళ్ళ కైతే నేఁ పరిగెత్తికెళ్ళి బస్సు చివరి నిముషం లో ఎక్కే వాళ్ళ కైతేనేం, )సరిగ్గా అక్కడే. అటో పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా
1) మనకంటే ముందే బస్సు ఎక్కి కూర్చున్న వాళ్లకి ఆ క్షణం లోనే బస్సు లోంచి ఉమ్మేయడమో, నీళ్ళు పారబోయడమో ,
చంటి పిల్లల తల్లులు అయితే చిన్నపిల్లలా ఇస్సి కూడా నిర్దాక్షిణ్యంగా తీసి కిటికీ లోంచే కాదు, ఎక్కేవాళ్ళ మొహం మీద పడుతుందన్న ఇంగిత జ్ఞా నం కూడా లేకుండ విసిరేస్తుంటారు.
2) తాము పీలుస్తున్న సిగరెట్ ని ఆర్పకుండా విసిరేసే వాళ్ళు, పాన్ తింటూ జోరుగా , స్టయిల్ గా , సరిగ్గా లోపలి వస్తున్నా వాళ్లని పావనం చేసేట్టు ఉమ్మేసే వాళ్ళు ,
ఇలా చెప్పుకుంటూ బోతే నాకో జానపదం గుర్తుకు వస్తుంది.
ఏం జేతునమ్మో , ఏడ బోదునమ్మో, ఏం జేతునమ్మో , ఏడ బోదునమ్మోఅంటూ గ్రామాల్లో పాడుకునే పాట అది.
ఇప్పుడు బస్సుఎక్కేవాళ్ళు పాడాల్సి వచ్చేలాగుంది.
ఇక రెండవ డేంజర్ జోన్ ఆగి ఉన్న ఆటోలు, కార్ల మధ్యనించి దాటాల్సి రావడం.
బేరం లేకుండ ఖాలీ గా ఆగి ఉన్న ఆటోలో ఆటోవాలా తో బాటు ఒక స్నేహితుడు కూచుని, కబుర్లు చెప్పుకుంటూ , నోట్లో ఏముంటుందో తెలియదు కానీ తుపుక్ తుపుక్ న వచ్చే, పోయే వాళ్లని గమనించ కుండా నే ఉమ్మేస్తూ ఉంటారు. ఇదేంటని అడిగితె మర్యాద ఉన్న వాడైతే పొరపాటు అయిందని అంటాడు, లేని వాడు ఉధరసే రాస్తా నహీ హై క్యా . యహీ రాస్తా హై అనిఎదురు ప్రశ్న వేస్తాడు.
ఇక ఆ వాహానాలు ఆగిఉన్నచొట నడవడానికి రానంతగా పాన్ తిని , గుట్కా తిని ఉమ్మేసిన ఉమ్ములు అసహ్యం గా కనిపిస్తుంటాయి. అడుగు తిసి అడుగు వేయలేక, పొరపాటున కాలు చెప్పు లేకుండ కనక నేల తాకితే కడుక్కోలేక, వామ్మో....నరకం అంతే ఎక్కడో లేదని అనిపిస్తుంది.
౩) ముచ్చటగా మూడవ చోటు ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య శాలలు వగైరాలు.
ఆఫీసులలోను, హాస్పిటల్స్ లోను మెట్లు ఎక్కుతుంటే ప్రతీ మూలనా ఉన్న ఉమ్ముల మచ్చలు చూస్తుంటే అసలు మనంఏ యుగం లో ఉన్నామో అనిపిస్తుంది.
రక రకాలైన జబ్బులతో ఉన్న వాళ్లని చూడడానికి వెళ్తే, వెళ్ళిన వాళ్లకి కూడా జబ్బుకు అంటుకునే లాగ ఉంటుంది ఆ వాతావరణం .
ఇలాంటివి పోవడానికి ఏదో చేయాలి. మార్పు రావాలి. మనుషుల్లో మార్పు రావాలి. మనం చేస్తున్నది పొరపాటు కాదు, ఘోరమైన తప్పు అని ప్రతిఒక్కరు గ్రహించాలి. గ్రహించేలా మనందరం ప్రయత్నించాలి. ఏమంటారు ?
ఆటో వాడికి ,చదువు రానివాడికి , నా గోడు చదివే తెలివితేటలూ లేవు . చదువుకున్న కొందరు కూడా ఇలాగె చేస్తున్నారు . అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్. Educate da people as our primary responsiability.
Monday, November 8, 2010
జాతకం
ఆ మధ్యన ఒక రోజు బాగా తిరిగి, తిరిగి అలసిపోయి సరిగా నిద్ర లేక ,మర్నాడు చాల ముఖ్యమైన visitor world bank నించి వస్తున్నందువల్ల చాలా హడావిడిగా ఉన్నాం. హాల్లో స్వాగత గీతాలు ప్రాక్టిసు చేస్తున్నారు కొందరు. వచ్చే అతిధులకి స్వాగతం
చెప్పడానికి.
ఇంతలో ఒక నల్ల డ్రెస్సులో ఉన్న ఒక అతను పొడవాటి గడ్డం ,సుమారుగా డెబ్భై ఏళ్ళ వయసు ఉండవచ్చు, అలా నా టేబుల్ ముందు నించి వెళ్తూ నా కొలీగు కి చేయి చూసి జాతకం చెప్పాడు. సహజన్ గా జాతకం చెప్పేవాల్లంటే అందరికి కొంత ఉత్షాహం ఉంటుంది కనక నేను అతన్నే పరిశీలిస్తూ కూర్చున్నాను. ఇంతలో నా మరో స్నేహితురాలు వస్తే అతను తనకి కూడా జాతకం చెప్పాడు. వివరాలన్నీ వ్రాసి, ఒక కవరు అడిగి తీసుకుని, తను మనతో చెప్పివ్రయించిన కాగితాన్ని మడిచి ఆ కవరులో ఉంచి మన చేతికి ఇచ్చి వెల్ల బోతుంటే నాకు కూడా ఎందుకో చేప్పిన్చుకోవలనిపించింది. విపరీతమైన పని వత్తిడి, ప్రయాణం చేసిన అలసట నాకేమాత్రం ఆ సమయం లో కనిపించలేదు.
నా చేయి చూసి అతను ఏమేమో చెప్పాడు. చివరగా నేను ఏ సంవస్తరం లో దేవుడి దగ్గరికి పోతానో కూడా చెప్పాడు.
అయితే అతడు చెప్పిన విషయాలు రెండు అక్షర సత్యాలు గా నా జీవితం లో జరిగాయి. మరి ఆయన తన అనుభవం లోంచి కలిగిన జ్ఞానం తో ఊహిన్క్ష్చి చెప్పాడో లేక నిజం గానే జాతకం చెప్పారో తెలీదు. అందుకని ఇక మూడో సంగతి నిజం ఔతోందో లేదో మాత్రం ఎదురు చూడాల్సిందే.
ఇది జరిగి దాదాపు పది హేడు ఏళ్ళు అయింది. మొన్న నా స్నేహితురాలు కలిసినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చాన్నేను. మర్చిపోయినా కొద్దిగా గుర్తు చేసుకుని తను కూడా అంది నిజమే అతను ఎలా చెప్పాడో నాకు అలాగే జరిగింది అని,
మొదట నేను చెప్పిన మా మొదటి కోలేగు కి అతని భార్య అతనికంటే ముందు చనిపోతుంది అని చెప్పాడు అతను.
నిజమే, అదే నిజమైతే ఈ పాటికి ఆవిడ ఉండి ఉండదు. తెలుసుకోవాలి. అదే నిజమైతే నా గమ్యం నేను కూడా నిర్దేశిన్చుకున్నట్టే.
ముఖ్యంగా మాకు కలిగిన అనుభవం ఏంటంటే మాకు జాతకం చెప్పిన అతను పది నిముషాల తరవాత వెతికితే మళ్ళి కనిపించలేదు. ఇంతవరకు కూడా అతను ఎక్క్దినిన్చివచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు.
మా దగ్గర అతని కేవలం యాభై ఒక్క రూపాయి అది మేము బలవంత పెడితే తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది మాకు. ఇది జరిగి సుమారు పదిహేడు ఏళ్ళు అయింది.ఇది మూఢ నమ్మకమో, జరిగినా సంఘటనలవల్ల కలిగిన నమ్మకమో ఏదైతేనేం జరిగిందది. జరగబోఎదేమిటొ
Sunday, November 7, 2010
మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది
మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది పెళ్లి యిన అమ్మాయి ని ఎక్కడున్తున్నావ్ అని అడిగితె మా అత్తవారింట్లో అని సమాధానం ఇస్తుంది. అలాగే పుట్టింట్ i వాళ్ళు కూడా అత్తవారింట్లో ఉన్నదనే చెబుతారు.అలాగే నాన్నగారి ఇల్లు అనరు. అమ్మగారి ఇల్లు అంటారు. మావగారి ఇల్లు అనకుండా అత్తవారిల్లు అనడం, నాన్నగారి ఇల్లు అనకుండా అమ్మగారిల్లు అనడం ఎంతవరకు సమంజసం? ఆడవాళ్ళ డామినేషన్ ఇంటుంటే మరో దగ్గరేమో మళ్ళి సమాన హక్కులు అంటారు. మారి మగవాళ్ళు ఎందుకుపోరాడటం లేదు? బ్రేవో
ఒబామా
ఒబామా వచ్చాడోచ్. మరే ఆయన వానక ఆయన భార్య కూడా వచ్చిందిమరి. ఆయన వచ్చాక ఆవిడ ఎలా రాకుండా ఉంటుంది మరి? వామ్మో వెనకాల మూడు వేల మంది వచ్చారంట . బాబోయి వాళ్ళ చేతుల్లో ఎన్నెన్నో ఉజ్జోగాలున్నయంటా
అమెరికా లో ఉజ్జోగాలుపోగోట్టుకున్న మన భారతీయులకా ?లేకుంటే ఇండియా కి వచ్చి సెటిల్ అయిపోయి హ్యాపీ గా ఉండాలనుకునే అమెరికావాళ్ళక? ఎండితే నేంటి బోల్డన్ని ఉజ్జోగాలు. వామ్మో. ఒబామా వాళ్ళావిడ బడి పిల్లలతో కలిసి డాన్సు చేసిందంతా,.ఎంత ముఖ్యమైన వార్త, ఒబామా కూడా ఒక సెకను వాళ్ళతో కలిసి డాన్సు
సేసినాడoట . ఇంకా ఒబామా ఏమేమి సేసినాడో రేపు సెప్తా.
Friday, November 5, 2010
మహాలక్ష్మి పాట
క్షీర సాగర మందు వెలసినా
శ్రీ మహా వరలక్శ్మివీ
నీదు దరిశన మైన తోడనే
ధన్యులము మే మయితిమీ //క్షీర//
అమ్బనన్ను బ్రొవుమానీ
ఆదరముతో వేడితి
శంభు శాంకరి గౌరీ మాహా
శామ్భవీ కృప చూడుమా.//క్షీర//
విష్ను రాణీ వైన శ్రీధర
లక్ష్మి నీకూ మంగళం
శాశ్వతా పదవిచ్చి మమ్ము
శామ్భవీ కృప చూడుమా.//క్షీర
Thursday, November 4, 2010
Subscribe to:
Posts (Atom)