Wednesday, November 10, 2010

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

         
           యీమధ్యనె కాదు, ఎన్నాళ్ళనుంచో నేను త్రుటిలో తప్పించుకున్న ప్రమాదాల్లో ఉమ్మించుకోవడం అన్నది ఒకటి.(చిన్నప్పుడు నాకు ఆ అనుభవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళింట్లోనే  కూచుని  మా పక్కింటి బువ్వమ్మ పాను  వేసుకుని నన్ను పవిత్రం చేసి, మాఫ్కరో బేటా అని బాధ పడటం నాకింకా గుర్తే. కాని నా బాధ ఆవిడ బాధ కంటే మించి పోయింది,) వినడానికి సాధారణంగా అనిపించినా దీని బారిన పడ్డవాళ్ళ అవస్థ అంత ఇంతా కాదు మరి. ఎలాగంటారా చూడండి.
          అతి పెద్ద ప్రమాద కనిపించేది C.B.S బస్స్టాండ్  లో .(దూర  దూరాలకి వెళ్ళడానికి  ఎంతొ శ్రమపడి శుభ్రం  గా తయారు అయి బస్ స్టాండు కి చేరుకుంటాం. బస్సు కి, బస్సు కి మధ్యన కొద్దిగా జాగా ఉంటుంది కదా అక్కడికి చేరేప్పడికి ప్రతి రోజు ప్రయాణించే వాళ్ళకైతేనేఁ  , ఆఫీసు పనుల మీద వెళ్ళే వాళ్ళ కైతే నేఁ పరిగెత్తికెళ్ళి    బస్సు చివరి నిముషం లో   ఎక్కే  వాళ్ళ కైతేనేం, )సరిగ్గా అక్కడే. అటో పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా
  1)  మనకంటే ముందే బస్సు ఎక్కి కూర్చున్న వాళ్లకి  ఆ క్షణం లోనే బస్సు లోంచి ఉమ్మేయడమో, నీళ్ళు పారబోయడమో ,   
చంటి పిల్లల తల్లులు అయితే చిన్నపిల్లలా ఇస్సి కూడా నిర్దాక్షిణ్యంగా తీసి కిటికీ లోంచే కాదు, ఎక్కేవాళ్ళ మొహం మీద పడుతుందన్న ఇంగిత జ్ఞా నం కూడా లేకుండ విసిరేస్తుంటారు. 
   2)  తాము  పీలుస్తున్న సిగరెట్ ని ఆర్పకుండా విసిరేసే వాళ్ళు, పాన్ తింటూ జోరుగా , స్టయిల్ గా , సరిగ్గా లోపలి వస్తున్నా వాళ్లని పావనం చేసేట్టు ఉమ్మేసే వాళ్ళు ,
   ఇలా చెప్పుకుంటూ బోతే నాకో జానపదం గుర్తుకు వస్తుంది.
   ఏం జేతునమ్మో  , ఏడ బోదునమ్మో, ఏం జేతునమ్మో  , ఏడ బోదునమ్మోఅంటూ గ్రామాల్లో పాడుకునే పాట అది.
     ఇప్పుడు బస్సుఎక్కేవాళ్ళు   పాడాల్సి వచ్చేలాగుంది.
ఇక రెండవ డేంజర్ జోన్ ఆగి ఉన్న ఆటోలు, కార్ల  మధ్యనించి దాటాల్సి రావడం.
          బేరం లేకుండ ఖాలీ గా ఆగి ఉన్న ఆటోలో  ఆటోవాలా తో బాటు ఒక స్నేహితుడు కూచుని, కబుర్లు చెప్పుకుంటూ , నోట్లో ఏముంటుందో తెలియదు  కానీ  తుపుక్ తుపుక్ న వచ్చే, పోయే వాళ్లని గమనించ కుండా నే ఉమ్మేస్తూ ఉంటారు. ఇదేంటని అడిగితె మర్యాద ఉన్న వాడైతే పొరపాటు అయిందని   అంటాడు, లేని వాడు ఉధరసే రాస్తా నహీ హై క్యా . యహీ రాస్తా హై అనిఎదురు ప్రశ్న వేస్తాడు. 
       ఇక ఆ వాహానాలు ఆగిఉన్నచొట  నడవడానికి రానంతగా పాన్ తిని , గుట్కా తిని ఉమ్మేసిన ఉమ్ములు అసహ్యం  గా కనిపిస్తుంటాయి. అడుగు తిసి అడుగు వేయలేక, పొరపాటున కాలు చెప్పు లేకుండ  కనక నేల తాకితే కడుక్కోలేక, వామ్మో....నరకం అంతే ఎక్కడో  లేదని అనిపిస్తుంది.
    ౩) ముచ్చటగా మూడవ చోటు ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య  శాలలు వగైరాలు. 
 
       ఆఫీసులలోను, హాస్పిటల్స్ లోను మెట్లు ఎక్కుతుంటే ప్రతీ మూలనా ఉన్న ఉమ్ముల మచ్చలు చూస్తుంటే అసలు మనంఏ యుగం లో ఉన్నామో అనిపిస్తుంది.
         రక రకాలైన జబ్బులతో  ఉన్న వాళ్లని చూడడానికి వెళ్తే, వెళ్ళిన వాళ్లకి కూడా జబ్బుకు అంటుకునే లాగ ఉంటుంది ఆ వాతావరణం .
      ఇలాంటివి పోవడానికి ఏదో చేయాలి. మార్పు రావాలి. మనుషుల్లో మార్పు రావాలి. మనం చేస్తున్నది పొరపాటు కాదు, ఘోరమైన తప్పు అని ప్రతిఒక్కరు గ్రహించాలి. గ్రహించేలా మనందరం ప్రయత్నించాలి. ఏమంటారు ?

           ఆటో   వాడికి ,చదువు  రానివాడికి , నా  గోడు  చదివే  తెలివితేటలూ  లేవు . చదువుకున్న  కొందరు  కూడా  ఇలాగె  చేస్తున్నారు .  అలా   ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్. Educate da people  as our primary responsiability.

6 comments:

chanukya said...

We are living among many uncivilized city dwellers

ravindranath macherla said...

మీరు ఈ రోజు రాశారు కదా, పాన్ పరాగ్ లు నమిలి వీధులకి, గోడలకి రంగులు వేసేవాళ్ల గురంచి.... నిజమేనండి, మిగతా ప్రాంతాల్లో పోలిస్తే, ఈ చెత్త సంస్కృతి హైద్రబాద్ లో ఎక్కువే కాదు, అక్కడ నుండే మిగతా చోట్లకి వ్యాప్తి చెందుతుంది అని నా అభిప్రాయం....హైద్రాబాద్ లో వుండే ఒక వర్గం వారికి మరియు నార్త్ ఇండియన్స్ కి భోజనం చేయగానే పాన్ తినే అలవాటు కాస్త ఇలా పాన్ పరాగ్ ల వరకు వచ్చింది....ఈ విషయంలో మన కోస్తా వాళ్లు చాలా బెటర్.....నేను హైద్రాబాద్ లో ఉండగా ఎపుడైనా కొన్ని ప్రభుత్వ భవనాలు, మైత్రివనం దగ్గర కి వెళ్లినపుడు కార్నర్ లు అసహ్యంగా కనిపించేవి....
హైద్రాబాద్ లో ఎవడైనా తప్పు చేసిన వాడిని మందలిద్దామన్నా, "ఏమైనా అంటే పని చూసుకో, నీకేంటి నష్టం అంటారు" అని ఎదురు వాడే మనకి క్లాస్ ఇస్తాడు......రాంగ్ డైరెక్షన్ లో వచ్చేవాడిని ఏమి అనకూడదు, సిగ్నల్స్ జంప్ చేసేవాళ్ళని ఏమి అనకూడదు, అసలు ఆటో లన్ని రోడ్డు మద్యలో ఆపుతారు ఏంటొ మరి.....( ESI, Erra gadda దగ్గర చూడాలి..).... గొడవ పెద్దది అయితే ఈ వెదవ ని సపోర్ట్ చేయడానికి వాడి వెదవ బ్యాచ్ వస్తారు... (అందుకే నాకు హైద్రాబాద్ అంటే ఇష్టం లేదు...)

Saahitya Abhimaani said...

భగవంతుడు సృష్టించిన జంతువుల్లో మనిషి మాత్రమే "ఉమ్మేయటం" అనే అసహ్యపు అలవాటును చేసుకున్నది. ప్రతి చెత్తా తినటం, నోట్ళొ ఏదో ఆశుధ్ధం పెట్టుకుని దవడలు ఆడిస్తూ, ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయటం ఒక జాడ్యంగా పరిణమించింది చాలామందికి. ఎక్కడ చూసిన సరే ఉమ్మి మరకలు, ఏ మెట్లమీద చూసినా మూలలన్నీ అట్టలు కట్టుకుపోయి అసహ్యంగా కనపడటం. అలా ఉమ్మటానికి సిగ్గు ఎలా ఉండదో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటువంటి తుంటరులు ఎక్కువైపోయారు. కలికాలం మహిమ కాకపోతే అట్లాంటివాళ్ళని అధిక్షేపిస్తే, వాళ్ళకే సమర్ధన వస్తోంది. అసలు ప్రభుత్వానికి ఉండాలి బుధ్ధి. ఎక్స్సైజు ఆదాయమో, అమ్మకపు పన్ను ఆదాయమో వస్తోందని ప్రజల ఆరోగ్యం ఏమౌతుంది లేదా సమాజం మీద ఈ వస్తువు ప్రభావం ఏమిటి అన్న ఇంగితం లేకుండా, ప్రతి చెత్త వస్తువునూ తయారు చెయ్యటానికి అనుమతి ఇవ్వటమే ఇటువంటి దరిద్రాలన్నిటికి మూలం.

ఈ ఉమ్మేయడం అనే జాడ్యం అది "చెడ్డ అలవాటు" అన్నవాడిని ఏదో అంగారక గ్రహం మీదనుంచి వచ్చినవాడిని చూసినట్టుండే రోజులు వచ్చాయి. ఇటువంటి చెత్త అలవాట్లు లేనివాళ్ళు చెయ్యగలిగినది ఏమీ ఉన్నట్టుగా కనపడటంలేదు. ఎప్పుడు చూసినా ఒక పదిమంది వస్తాదులను వెంటపెట్టుకుని అదేపనిగా తిరుగుతూ, ఈ ఉమ్మెత్తలగాళ్ళను చితక తన్నటం మొదలుపెడితే గాని గుణం కనపడదు. కాని ఆపని చేస్తే అరాచకం అంటారు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు వచ్చి విల విల లాడిపోతారు. కొన్నేళ్ళక్రితం హైదరాబాదులో రోడ్డుమీద మూత్ర విసర్జన చేసేవాళ్ళని నిలువరించటానికి ఒక విన్నూత్న శిక్ష అమలు పరచటానికి రంగం సిధ్ధం చేశారు. అదేమిటంటే, అలా చేసే వాళ్ళమీద ఒక యంత్రంతో రంగు చిమ్మటం. అంటే వాడు ఇంటికెళ్ళి ఆ గుడ్డలు మార్చుకుని స్నానం చేసి రావలన్న మాట. కాని సమాజం మీద ఎంతో శ్రధ్ధ కలిగిన కొంతమంది "గుంపు" వత్తిడికి వంగి మునిసిపాలిటీవారు ఆ పని మానుకున్నారు, కొన్న యంత్రాలను మూలపడేశారు. అది సమాజంలో ఈ "చెత్తగాళ్ళ" పవరు. ఆంగ్లంలో ఒక మాట చెపుతూ ఉంటారు, దానికి తెలుగు సమానం ఏమో తెలియదు, "Misplaced Sympathy", ఈ మాటమటుకు మన సమాజంలో అక్షర సత్యం. చెత్తగాళ్ళ మీద మనకున్నంత అనవసరమైన జాలి, అసలు జాలిపడాల్సిన చోట లేదు. మొత్తం మొత్తానికి ఇదే మూల కారణం

bloggerbharathi said...

ప్రతిస్పందించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు . ప్రతిస్పందించని వాళ్లకి కూడా . వాళ్ళు ఆలోచిస్తున్నందుకు


భారతిరాం

preethi said...

chala chakkaga chepparandi bharati garu.. nijanga ee alavatu tarataralanunchi vastundi.. chinnapilladi mundu tallidandrulu ee pani chesina alane cheyalani vaadu anukuntadu.. mana samajanni maname paadu chesukuntunnamu.. inkokariki neetulu cheppemundu manamu em chestunnamanedi kuda alochinchali.. edo porapaatu anukuntamo.. leka chinna vishayame kada ani anukuntamoo.. daani prabhavam mana chuttu unde chinna pillala meeda entavaraku padutundo ane vishayanni gamaninchali..

Ravindranath machatla garu cheppinattlu mana hyderabad lo ee paan alavaatu chala chiraku ga untundi... okkariki kuda kaneesa gyanam undadu.. traffic rules paatiste prati okkaru cheravalasina samayaniki cheravalasina chotiki cherutarane buddhi eppudu vastundo????

SwaroopSusarla said...
This comment has been removed by the author.