Monday, November 8, 2010

జాతకం



             ఆ మధ్యన ఒక రోజు బాగా తిరిగి, తిరిగి అలసిపోయి సరిగా నిద్ర లేక ,మర్నాడు చాల ముఖ్యమైన visitor world bank నించి వస్తున్నందువల్ల చాలా హడావిడిగా ఉన్నాం. హాల్లో  స్వాగత గీతాలు ప్రాక్టిసు చేస్తున్నారు కొందరు. వచ్చే అతిధులకి స్వాగతం
చెప్పడానికి. 


           ఇంతలో ఒక నల్ల డ్రెస్సులో ఉన్న ఒక అతను పొడవాటి గడ్డం ,సుమారుగా డెబ్భై ఏళ్ళ వయసు ఉండవచ్చు, అలా నా టేబుల్ ముందు నించి వెళ్తూ నా  కొలీగు కి చేయి చూసి జాతకం చెప్పాడు. సహజన్ గా జాతకం చెప్పేవాల్లంటే అందరికి కొంత ఉత్షాహం ఉంటుంది కనక నేను అతన్నే పరిశీలిస్తూ కూర్చున్నాను. ఇంతలో నా మరో స్నేహితురాలు వస్తే అతను తనకి కూడా జాతకం చెప్పాడు. వివరాలన్నీ వ్రాసి, ఒక కవరు అడిగి తీసుకుని, తను మనతో చెప్పివ్రయించిన కాగితాన్ని మడిచి ఆ కవరులో ఉంచి మన చేతికి ఇచ్చి వెల్ల బోతుంటే నాకు కూడా ఎందుకో చేప్పిన్చుకోవలనిపించింది. విపరీతమైన పని వత్తిడి, ప్రయాణం చేసిన అలసట నాకేమాత్రం ఆ సమయం లో కనిపించలేదు.


      
       నా చేయి చూసి అతను ఏమేమో చెప్పాడు. చివరగా నేను ఏ సంవస్తరం లో    దేవుడి దగ్గరికి పోతానో కూడా చెప్పాడు.
          అయితే అతడు చెప్పిన విషయాలు రెండు అక్షర సత్యాలు గా నా జీవితం లో జరిగాయి. మరి ఆయన తన అనుభవం లోంచి కలిగిన జ్ఞానం తో ఊహిన్క్ష్చి చెప్పాడో లేక నిజం గానే జాతకం చెప్పారో తెలీదు. అందుకని ఇక మూడో  సంగతి నిజం ఔతోందో లేదో మాత్రం ఎదురు చూడాల్సిందే.


               ఇది జరిగి దాదాపు పది హేడు ఏళ్ళు అయింది. మొన్న నా స్నేహితురాలు కలిసినప్పుడు ఈ  ప్రస్తావన తెచ్చాన్నేను. మర్చిపోయినా కొద్దిగా గుర్తు చేసుకుని తను కూడా అంది నిజమే అతను ఎలా చెప్పాడో నాకు అలాగే జరిగింది అని,
           మొదట నేను చెప్పిన మా మొదటి కోలేగు కి అతని భార్య  అతనికంటే ముందు చనిపోతుంది అని చెప్పాడు అతను.
       నిజమే, అదే నిజమైతే ఈ పాటికి ఆవిడ ఉండి ఉండదు. తెలుసుకోవాలి. అదే నిజమైతే నా గమ్యం నేను కూడా నిర్దేశిన్చుకున్నట్టే.


            ముఖ్యంగా మాకు కలిగిన అనుభవం ఏంటంటే మాకు జాతకం చెప్పిన అతను పది నిముషాల తరవాత వెతికితే మళ్ళి కనిపించలేదు. ఇంతవరకు కూడా అతను ఎక్క్దినిన్చివచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. 


         మా దగ్గర అతని కేవలం యాభై ఒక్క రూపాయి అది మేము బలవంత పెడితే తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది మాకు. ఇది జరిగి సుమారు పదిహేడు ఏళ్ళు అయింది.ఇది మూఢ నమ్మకమో, జరిగినా సంఘటనలవల్ల కలిగిన నమ్మకమో ఏదైతేనేం జరిగిందది. జరగబోఎదేమిటొ 

1 comment:

Anonymous said...

Funny