Sunday, August 1, 2010

సుమతి శతకం- నాన్నగారు.

 ప్రొద్దుటే ఎందుకో నాన్నగారు జ్ఞాపం వచ్చారు. 

భోజనాలు అవగానే అయన వెనకే వరండా లో అటు, ఇటు తిరుగుతూ, 

ఆయన చెప్తున్న  సుమతీ శతకం లోని పద్యాల్ని వల్లిస్తూ నిద్ర రాగానే వెళ్లి 

పడుకోడం ఇంక తడి ఆరని మధుర జ్ఞాపకం. ఈ కాలంలో పిల్లకి కూడా 

కేవలం టీవీ  కాకుండా  ఇలాంటి మధురమైన జ్ఞాపకాల్ని పంచగలమా/  


పద్యం:     అక్కరకురాని  చుట్టము ,

మ్రొక్కిన  వరమీనివేల్పు , మొహరమున  దా 

నెక్కిన  బారని    గుఱ్ఱము ,

గ్రక్కున  విడువంగవలయు   గదరా  సుమతీ //

 
తన  కోపమే  తన  శత్రువు
  
తన   శాంతమే   తనకు  రక్ష , దయ  చుట్టంబౌ 

తన  సంతోషమే  స్వర్గము 

తన  దుక్ఖమే  నరకమండ్రు , తధ్యము  సుమతీ //

తలనుండు   విషము  ఫణికిని 

వెలయంగా  తోకనుండు  వృశ్చికమునకున్  
       
తల  తోక  యనకనుండును 

ఖలునకు  నిలువెల్ల  విషముగదరా  సుమతీ //



కనకపు  సింహాసమున 

శునకము  గూర్చుండబెట్టి  శుభ  లగ్నమునన్  

దొనరగ    బట్టము  గట్టిన  

వెనుకటి  గుణమేల  మాను  వినరా  సుమతీ //



అడిగిన  జీతం  బియ్యని 

మిడిమేలపు  దొరను  గొల్చి  మిడుకుట  కంటెన్ 

వడిగల  యెద్దుల  గట్టుక 

మడి  దున్నక  బ్రతుకవచ్చు  మహిలో  సుమతీ //

ఎప్పుడు  సంపద  గలిగిన
 
అప్పుడు  బంధువులు  వత్హు  రది   యెట్లన్నన్ 

దెప్పలుగ చెరువు  నిండిన  

గప్పలు  పదివేలు  చేరుగదరా  సుమతీ //


ఉపకారికి  నుపకారము
విపరీతము  గాదు  సేయు  వివరింపంగా
నపకారికి  నుపకారము                                                                   Goto Top
నెపమెన్నక  సేయువాడు  నేర్పరి  సుమతీ

సరసము  విరసము    కొరకే
పరిపూర్ణ  సుఖంబు   లధిక  భాదల  కొరకే
పెరుగుట  విరుగుట  కొరకే
ధర  తగ్గుట    హెచ్చు  కొరకే  తధ్యము  సుమతీ

చీమలు  పెట్టిన  పుట్టలు
పాముల  కిరవైనయట్లు  పామరుడుధగన్
హేమంభు  గూడ  బెట్టిన
భువీసుల  పాలు  జేరు   భువిలో  సుమతీ

వినదగు   నెవ్వరు   చెప్పిన
వినినంతనే  వేగపడక   వివరిమ్పతగున్
గని  కల్ల  నిజము   దెలిసిన
మనుజుడెపో  నీతిపరుడు  మహిలో  సుమతీ

బలవంతుడ  నాకేమని
బలువురతో  నిగ్రహించి  పలుకుట   మేలా ?
బలవంతమైన  సర్పము
చలిచీమల  చేతజిక్కి  చావదె  సుమతీ

పిలువని    పనులకు  బోవుట ,
గలయని  సతి  రాతియు , రాజు  గానని   కొలువున్
బిలువని  పేరంటంబును ,
వలవని  చెలిమియును  జేయ  వలదుర  సుమతీ

నవ్వకుమీ  సభలోపల
నవ్వకుమీ  తల్లితండ్రి  నాధులతోడన్
నవ్వకుమీ  పరసతులతో
నవ్వకుమీ  విప్రవరుల  నయమిది  సుమతీ

కూరిమి  గల  దినములలో 
నేరములెన్నడును  గలుగ  నేరవు   మరి  యా
కూరిమి  విరసంబైనను
నేరములే  తోచుచుండు  నిక్కము  సుమతీ   
                                     





1 comment:

Unknown said...

మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te