సీతాకల్యాణ వైభోగమే
రామకల్యాణ వైభోగమే
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ పవనేత్ర రమణీయ గాత్ర
భక్త జన పరిపాల భరిత షరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభి రామ సాకేత ధామ
సర్వ లోకాధార సమరైక ధీర
గర్వ మనస దూర కనకాఘ ధీర
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ విధార నత లోకాధార
పరమేశనుత గీత భవ జలధిపోత
తరుణి కుల సంజాత త్యాగరాజనుత
సీతాకల్యాణ వైభోగమే
రామకల్యాణ వైభోగమే
No comments:
Post a Comment