Friday, January 17, 2014

ఏడూ కొండలా సామీ ఎందూకు న్నావయ్యా

ఈ మధ్యన పండగో పబ్బమో , లేదా మనసు పుట్టి స్వామి దర్శనం చెసుకుo దా మనో  అనుకునే సామన్య భక్తుల సంఖ్య క్రమెపీ పడిపోయే పరిణామాలు మనం చూస్తూనే న్నాం. చాల రోజుల క్రితం ఒక సారి   శ్రీరామ నవమి కి అనుకుంటా వెంకటే శ్వర స్వామి దర్శనం చేసుకుందామని తిరుమలకి వెళ్ళాం. ప్రత్యెక దర్శనం కోసం నిర్దేశించిన మొత్తాన్నీ చెల్లించి రశీదు పుచ్చుకుని ఆలయ అధికార్లు నిర్దేశించిన వరుస లో వెళ్లి నిలుచున్నాం . వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు దర్శనం గంట  లోగానే అవ్వాలి . కొద్ది సెపైతె మేము అస్సలు మండపం లోకి అడుగు పెడతామని అనుకున్తునామో లేదో , క్షణం లోగా నే మమ్మల్ని ఆపేసి, ఆవలకి నెట్టేసి, v.i.p దర్శనం అని చెబుతూ  దాదాపు వంద, రెండు వందల మందిని గుళ్ళోకి పంపించారు
వాళ్ళ వెనుకే మాకు కొద్ది జాగా దొరికి  మేము కూడా లోపలి ప్రవేశించాం . వచ్చిన వాళ్ళలో ఒకావిడ నాకు కాస్త ముఖ పరిచయం . అదే చనువు తో ఎంత టికెట్ తీసుకున్నారు అని అడిగితె, అందు కావిడ అదేమీ లేదు, అక్కడ వాళ్ళ బంధువు ఒకాయన పని చేస్తున్నాడు . ఆ యనే తీసుకోచాడు, ఇప్పుడే వస్తున్నాం అని చెప్పిo ది
డబ్బులు కట్టి, ఉదయం నించీ q  లో అలిసిపోయిన మాకు చాల బాధ వెసిన్ది. అలాంటప్పుడు, పిల్ల,మేకా తో  వచ్చి, ధర్మదర్శినమ్ కోసం , మెట్లెక్కి గోవిందనామ స్మరణ తో గుడిని చేరుకున్న భక్తుల మనోభావాలు చెప్పకనే చెప్పవచ్చు . 2010 లో అనుకుంటా , ఉత్తరద్వార దర్శనం చేసుకుందామని, మా కుటుంబం, కొత్తగా పెళ్ళైన మా అమ్మాయి, అల్లుడు, వాళ్ళ కుటుంబం కలిసి మల్లి వెళ్ళాం ఈసారి కొండ మీదకి కుడా వెళ్ళలేక పోయాం  . అందుకే రాను నెనీ పురికీ, నీవే రా నా దరికీ అని చెప్పి  పెట్టి, తిరుమల వెళ్ళడం మానుకున్నాం
   మల్లీ ఈ మధ్యన వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల మీద కేసులు పెట్టారన్న వార్త చూస్తుంటే , ఏడు కొండల్ని V .I .P  లకి వదిలేసి ఆ వెంకటేశ్వరస్వామి   ఇంకెక్కదెనా ప్రకట మైతే బావుండును అనిపించిoది .
                భక్తుల బాధలని ఆసరా గా తీసుకుని, కొత్త, కొత్త నాయకులూ పుట్టుకొస్తున్నారు కలి కాలం అంటే  ఇదే నేమో



2 comments:

Anonymous said...

డబ్బులుకట్టి గంటలో దర్శనం చేసుకొనివద్దాం అనుకోవడం కూడా అవినీతేకదండీ. దర్శనం త్వరగా అవడానికి కొందరు డబ్బులువాడుతారు మరికొందరు అధికారం వాడుతారు. తేడా అంతేకదా!

Zilebi said...


శ్రీ రామనవమీ కి కొండ కెళితే ఎట్లా అండి మరి !

మంగళ వారాల్లో వెళ్ళండి ఖాళీ గా ఉంటారు స్వామీ వారు

జిలేబి