పడుకున్నానే గానీ నాకెందుకో మనసులో మనసు లేదు.
ఎందుకని నన్నునేనే ప్రశ్నించుకుంటే నేను హాయిగానే ఉన్ననుకదా మరి ఇలా ఎందుకు ,
ఆత్మవంచన చేసుకోవటం అలవాటు లేదు. ఉన్నదున్నట్టుకుండబద్దలుకొట్టినట్టు మనసుని తెరిచి పరిచేయటమే తెలుసునాకు. అదీ ఈ రోజు మరీ .
ఒక్కసారి దాదాపు ముప్ఫై ,నలభై ఏళ్ళ క్రిందటి రోజులు జ్ఞాపకం వచ్చాయి.
మంచం మీద పడుకుని హాయిగా నిద్ర పోక ఇప్పుడు నిజాలేందుకు ,నిద్ర పాడు చేసుకోవడానికి గాక , స్వగతం ఒకసారి చెప్పిచూసింది .అసలు విషయానికి వద్దాం.
నా బాల్యం లో మాది పెద్ద కుటుంబమే. పగలంతా అందరమూ బడికి వెళ్లి వచ్చాక , నాలుగు గంటలౌతునే ఇంటికి రాగానే కాళ్ళు మొహం కడుక్కుని, స్కూల్ డ్రెస్ మార్చుకుని , అమ్మ పెట్టిన తినుబండారం ఏదో ఒకటి తిని, గబగబా ఆడుకుందుకు వెళ్ళేవాళ్ళం .
సరిగ్గా ఆరు గంటలు అవుతుండగానే ఇంట్లోంచి, అక్కో, అమ్మో ఒక అలారం ఇంకా చాలు, ఇంట్లోకి రమ్మని హుకుం వినిపించేది. కిమ్మనకుండా వెళ్ళిపోయి, దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు మరోసారి శుభ్రం చేసుకుని, హోంవర్కు ముందు వేసుకుని ప్రారంభించే వాళ్ళం .
సరిగ్గా ఒక గంట, మహా అయితే ఒకటిన్నర గంటలో హోమ వర్కు ముగించుకుని, పుస్తకాలు ముందేసుకుని, చదవడం మొదలెట్టేవాళ్ళం.
అన్నట్టు ఇక్కడో విషయం చెప్పాలి. సరిగా సంధ్యా సమయం కాగానే ఆరు ఆరున్నర దాకా మాకు పండగేమరి. అక్క దీపాలవేళ కాగానే అన్దరూ పుస్తకాలు కాసేపుప్రక్కనపెట్టన్దర్రా సంధ్యాసమయంలో చదవ కోడదు అని చెప్పగానే , అందరం సరస్వతీ నమస్తుభ్యం , యాకుందేందు తుశారహారధవళా లాంటి శ్లోకాలు చదువుకునే వాళ్ళం. మళ్లి వెంటనే చదువులోకి పునః ప్రవేశం.
ఎనిమిదిన్నర ఔతుంటే కడుపులో ఎలకలు తిరగడం మొదలయ్యేది,కానీ మా అమ్మ ,తింటే నిద్ర పోతారంటు మరో అరగంట మా చదువు పొడిగించి, ఇంతలో నాన్న గారు రాగానే అందరం భోజనాలకి ఉపక్రమించే వాళ్ళం . భోజనాలు కాగానే అందరం వసారాలో పక్కలు వేసుకుని, ఆ రోజు మా నాన్న చెప్పెవిశేశాలు వింటూ , శ్రీ సూక్తం, శబ్దమంజరి,అమరం నాన్న చెబుతుంటే వల్లె వేస్తూ ,మాకువచ్చిన సందేహాలు అడుగుతూ ,రకరకాల విషయాలని ఒకళ్ళ తరవాత వరసబెట్టి చెప్పుకుంటూ అలానే ఎప్పుడో నిద్రలోకి జారుకునే వాళ్ళం .
మళ్లీ తెల్లవారుజ్హామునే మా నాన్నగారి పిలుపులతో, కాస్త లేటైతే రేడి యో లో వచ్చే సుప్రభాతం తోటో ,ఇంకా కొద్ది లేట్ అయితే భక్తీ రంజని తోటో అలా మళ్లీ మా ప్రభాతం మొదలయ్యేది.
ఇప్పుడు మేమున్నట్టే అప్పుడూ మా అమ్మా, నాన్నా ఇప్పడి మా వయసు వాళ్ళే. మాలాంటి పెద్ద ఫామిలీస్ మాత్రమే కాక అప్పట్లో కుడా ఒకరిద్దరు పిల్లలున్న కుటుంబాలు కుడా మా చుట్టుప్రక్కన ఉండేవి.అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మా వయసులో ఉన్నవాళ్ళే. మరి వాళ్ళు కూడా సంతోషం గా ఉండే వాళ్ళే. అప్పట్లో మా పెద్ద వాళ్ళ సమస్యంతా డబ్బు మాత్రమే. అయినా జీవించే వాళ్ళు. మనసులోంచి ఎంతో సంతోషం, ఎంతోహాయి.
ఇప్పుడు వాళ్ళ వయసులో ఉన్నమేముమాత్రం వాళ్ళకంటే డబ్బు ఉండి,మెరుగైన వసతులు ఉండి, మెత్తని పరుపుల మీద పడుక్కుంటూ కూడా ఈ నిద్ర లేకపోవడం ఏంటి? ఈ బ్రతకడం ఏంటి
చదువుల వెంపర్లాట లో ఎం నేర్చుకుంటున్నాం , తెలుగుని ఆంగ్లంలో మాట్లాడుతున్న పిల్లలతో కనీసం అమ్మ, నాన్న అని పిలిపించు కోవటం కూడా నేరమని భావించే పరాయీకరణ ప్రభావం లో ,
తెలవారకుండానే బలవంతంగా లేపికుర్చోబెట్టి ,వాళ తో బండెడు ఇంటిపని ముందురోజు చేయగా మిగిలిన దాన్ని పూర్తీ చేయించి, స్నానం సరిగ్గా కాకుండానే వాళ్ళ మొహాన బండెడు పుస్తకాల సన్చీ తో బాటు
ప్రోద్దున్నకి, మధ్యాన్నానికీ సాయన్ట్రానికీ డబ్బాలు కట్టి ఇచ్చి, మళ్లీ ఇంటికి రాకుండానే, హోంవర్కు రుద్దడం,
వండడానికి బద్దకించి బయటినించి నానా గడ్డితెప్పించి పెట్టి, ఎంతో పని చేసిఅలిసిపోయినట్టు మనని మనమే సెల్ఫ్ పిటి తో ఓదార్చు కుంటూ ఎందుకిలా బ్రతికేస్తున్నాం? వాళ్లకి ఎం సంస్కారం నేర్పిస్తున్నాం?వాళ్ళని వాళ్ళు కోల్పోవడంలో మన బాధ్యత ఎంత?
సమాధానం ఉన్నాచెప్పడానికి ఇష్టపడని ఇగో తో ఇలా బ్రతికేస్తున్న తరం మనది.
అలా విలువలు తెలుసుకోని పెంపకంలో, పెద్దవాళ్లందరూకూడా అందరు ఉన్నాఅనాదలు అవుతున్నారంటే స్వయంక్రుతాపరాధమే. అనిపిస్తోంది.
వయసు మళ్లినాక గానీ మనం కోల్పోయిన నిజమైన సంపద ఏంటో తెలుసుకోలేక పోతున్నాం.
భారతీయ సంస్క్రుతి లో ఎక్కడా కుడా తలి తండ్రుల్ని బాధ్యతా రాహిత్యంగా వదిలివేసిన పిలలని గురించి ఎక్కడా ఉన్నట్టు అనిపించదు. ఒకప్పుడు మన జీవితం ఇప్పుడు నాజీవితం గానూ , ఒకప్పటి మన కుటుంబం ఇప్పుడు నా కుటుంబం గానూ బహు వచనాల్ని మరిచిపోయి ,ఏకాకులుగా బ్రతికేయదానికే మొగ్గు చూపుతున్నాం
ఇప్పుడు ఒక్క ప్రక్క మీద పడుకుంటే రూల్స్ ఒప్పుకోవు, పిల్లలకి ఒక వేరే గది కావాలి,ఒక కుటుంబం లో ఉన్నా ,నాయినమ్మ, అమ్మమ్మ అన్న వాళ్లకి ప్రాధాన్యత మసక బారి పోయింది ,
వాళ్ళు పిల్లలకి ఏదేనాచెప్పాలని అనుకున్నా ఆ స్వతంత్రం గతం లో లాగా లేదు. అప్పట్లో తాత తంతాడు, నానమ్మ తిడుతుంది అన్న మాటలే మాయమోపోయినై. నా పిల్లలని అనడానికి మీరెవరు అనే పభుద్దులు కూడా లేకపోలేదు .
మసక బారిపోతున్న మానవ సంబంధాలకి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాల్సిందే.
కొన్ని చోట్ల తల్లి తప్పైతే ,మరి కొన్నిచోట్ల పిల్ల తప్పు, దిశా నిర్దేశం చేసే పెద్ద వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలలో స్త్రీ పురుష తేడా లేకుండా ఆధునికత పేరిట వెర్రివేషాలు వేస్తుంటే ఏది నేర్చుకోవచ్చో ఏది కూడదో తెలుసుకో లేని పిల్లలు సంస్కారం అన్న పదాన్ని ఏ పదకోశం లో వెతుక్కోవాలో ?
మాయమై పోతున్న డమ్మా, మనిషన్నవాడు ..............
No comments:
Post a Comment