Monday, February 13, 2012

డాక్టర్ చక్రవర్తి గానం ఘంటసాల రచన శ్రీ శ్రీ

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో // మనసు//

ఆశలు తీరని ఆవేశములో..ఆశయాలలో.. ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో ,తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో
నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ ,నీకోసమే  కన్నీరు రు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే, తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో
చెలిమియె కరువై వలపే అరుదై ,చెదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే ,తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో


మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో

No comments: