Sunday, September 18, 2011

నా తెలంగాణా కోటి రతనాల వీణ( నాగేటి సాల్లల్ల)

                                           నందిని సిద్దారెడ్డి గారి పాట

 పల్లవి         నాగేటి   సాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా, 
                 నవ్వేటి బతుకుల్ల ,నా తెలంగాణా నా తెలంగాణా
                 పారేటి నీల్లల్ల పానాదులల్ల , పూసేటి పూలల్ల, పునాసలల్ల ,
                 కొంగు సాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా, 
                 పాలు తాపిన తల్లి నా తెలంగాణా.నా తెలంగాణా 
చరణం   ౧. తంగేడు పువ్వుల్లు, తంబాలమంతా , 
                 తీరొక్క రంగుల్లతీర్చినాపువ్వు , 
                 బంగారు చీరలు బాజారులన్నీ 
                బతుకమ్మ పండుగా నా తెలంగాణా  నా తెలంగాణా,
               బంతి పువ్వుల తోట నా తెలంగాణా నా తెలంగాణా
 చరణం ౨. కొత్తా బట్టలు కట్టి కొటీ ముచ్చట్లు ,
               పాలా పిట్టల జుసీ పడుచు సప్పట్లు , 
               జొన్నాకర్రల జెండా జోరున్నదేమి
               అలై బలై తీసే నా తెలంగాణా , నా తెలంగాణా
               జమ్మి ఉంచిన ఆర్తి నా తెలంగాణా నా తెలంగాణా ..
చరణం ౩ .మోటా గొట్టిన రాత్రి మొగీనా పాటా ,
              తాడూబెనిన తండ్రి తలుపులున్నప్పు ,
              కల్లముడ్చిన అవ్వా కలలొనీ గింజా , 
              ఆరుగాలం చెమటా , నా తెలంగాణా నా తెలంగాణా 
             ఆకలి దప్పుల మంటా నా తెలంగాణా నా తెలంగాణా 
చరణం౪. ఏరు  గాచే తల్లీ ఉరిమి జూడంగా, 
              బువ్వాలేని తల్లీ బోనామొండింది,
              సేను కొచ్చిన పురుగు సెరిగీ పోసింది ,
             బోనాలా పండుగా నా తెలంగాణా నా తెలంగాణా, 
             శివ సత్తులా ఆట నా తెలంగాణా నా తెలంగాణా 
చరణం 5 బురుజు గోడల పొగరు మెడలు వంచంగా ,  
              గుట్లల్ల సెట్లల  , గోగు(పుంటి) పువ్వుల్ల , 
              సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల ,
               పానామిచ్చిన వీరా కధలూ పాడంగా,
              గోరువొంకల(తూ ర్పున పొడిచే)పొద్దు ,నా తెలంగాణా నా తెలంగాణా 
              గోరింకలా(పాలాపిట్టల ) సభలు నా తెలంగాణా నా తెలంగాణా 
 

2 comments:

Anonymous said...

ఈ పాటకే కదా "నంది అవార్డు" వచ్చింది.
అద్భుతమైన పాట.
ప్రతీ వాక్యం లో ఎంతో ఆర్ద్రత, ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం, శౌర్యం తొణికిస లాడుతున్నాయి.
ఇంత చిన్న పాటను, ఇంత గొప్ప పాటను పోస్ట్ చేసేటప్పుడు
ఒకటి కి రెండు సార్లు సరి చూసుకుంటే బాగుండేది.
పుసేటి కాదు పూసేటి
అట్లనే ..
తంగేడు
బంతి
జోరున్నదేమి
అలై బలై సవరించండి
నానా లో ఒక నా తీసేయాలి
మరికొన్ని అక్షరాలూ రచయితా కావాలనే రాసారేమో తెలియదు
వాటిని కూడా ఒరిజినల్ తో సరిచూసుకుంటే బాగుంటుంది.
- Prabhakar, Hyderabad

bloggerbharathi said...

ధన్యవాదాలు ప్రభాకర్ గారు , రాత్రి బాగా పొద్దు పోయింది. ప్రొద్దున్నే సరి చేద్దామని వదిలేసా. ఇప్పుడు చూడండి.