Sunday, April 24, 2011

భగవాన్ పుట్టపర్తి సత్యసాయి బాబా---ఏ సేవ సేయగ




ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగేను 
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ

సెల వీయ మని నిన్ను నిరతము వెడితే
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి     //ఏ సేవ సేయగ   //


అల్లంత దురాన  అగుపించి
మా ఉల్లము రంజిల్ల భాషించి
మనసులలో మరి,మరి-మరిమరి
మరిమరివేడినా
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి
//ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే

ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని
ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని 
మరిమరి వేడినాచిరు నవ్వుతో నీవు
 మరపించేదవు సాయి ఏ సేవ సెయగాఆ


మరపించేదవు స్వామి
//ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //
     
     స్వామి మన మధ్యన ఇక పైన ఒక అనుభూతిగా ,ఒక ఆత్మా జ్ఞానం గా, ఒక ప్రేమ గా ఒక భజనగా ఒక భావం గా మిగిలి పోతారు. దేహి గా ఆయన మనలోనే,మనతోనే సదా నిలిచి ఉంటారు. భగవాన్  కి  ఈ పాట అంజలిగా, అర్ఘ్యం గా, భజనగా , పూజ గా ఎల్లప్పుడూ మిగిలి పోవాలని నా ఆశ. స్వామీ నా పాట లో సదా కనిపించు, వినిపించు,  ఒక పువ్వుగా దీన్ని స్వీకరించు.

2 comments:

Anonymous said...

నకిలీ కణిక వ్యవస్థ ఒక సమర్ధుడైన ఏజెంటును కోల్పోయింది. ఇటువంటి ఏజెంటును తయారు చేసుకోవడానికి వారికి చాలా సమయం పడుతుంది

Krishna said...

మీరు ధన్యజీవులండి.