Monday, March 7, 2011

లలిత గీతం

   
   
    రెల్లు పూల పానుపు పైనా 
    జల్లు జల్లు గా ఎవరో 
    చల్లినారమ్మ వెన్నెల 
    చల్లినారమ్మా   //రెల్లు//2

     మరిగే పాల కడవల పైన 
    నురుగు నురుగులుగా  
    మరగే రాధ మనసు పైనా 
    తరక తరకలుగా ఎవరో
     చల్లినారమ్మ వెన్నెల 
    చల్లినారమ్మా   //రెల్లు//

   కడిమి తోపుల నడిమి దారుల
   ఇసుక బైల మిసిమి దారుల
   రాసి రాసులుగా ఎవరో పోసినారమ్మా  వెన్నెల   
    రెల్లు పూల పానుపు పైనా

No comments: