Friday, April 23, 2010

స్వర్గం-నరకం

         
               వామ్మో నేను జచ్చిపోత. సడన్గా బ్రేకు వేసిన ఉపుకి ఒక్కసారిగా 


                 నిద్రలోంచి లేచిన మా మిత్రుడు అన్న మాటలవి.అంతలో మా మరో మిత్రుడుఅందుకుని 
నేను జచ్చిపోతే నరకంకే బోతా. నాకు స్వర్గం ఒద్దెఒద్దు. అన్నాడు. 


          ఎందుకట్ల   , అందరు  స్వర్గంకావాలి అంటారుకదా అన్నాన్నేను. 
       దానికి తనుకాదు మేడం, మనోల్లందరూ నరకం  లనే ఉంటరు. రంభ, ఊర్వశి అందరుఎప్పుడోముసలోళ్ళు అయిపోయిన్రు. 
      నరకంల ఐతే అందరు సినిమా యాక్టర్లుటి .వి వాళ్ళు, మస్తుల ఉంటారు. ఇంకబాధలన్టారా. అవ్విఇక్కడున్న ఉంటై,అక్కడున్న ఉంటై. అదే స్వర్గం అయితే కాలిగుంటది. పొద్దు బోదు అన్నాడు. 

       నాకు అతని మాటలకి కడుపుబ్బానవ్వు వచ్చింది. అతని మాటల్లో నిజంకూడా లేకపోలేదు.

ఏమంటారు ?



        మొన్న ఒక రోజు నేను కొంతమంది మిత్రులతో కలిసికారులో వెడుతుండగా మా మధ్యన ఒక విషయం గురించి చర్చ వచ్చింది   


       ప్రేమలు,   చావులు. ఆ రోజే లైఫ్ స్టైలే భవనం మీదనిన్చి దుంకి చనిపోయిన జంట గురించి మాట్లాడుకుంటుండగా మా లో ఉన్న ఒకమిత్రుడు పిల్లకి కౌన్సిల్లింగ్ ఇవ్వవలసిన అవసరం గురించి మాట్లాడాడు.
      మరో మిత్రుడు తనదైన భాషలో చెంపకు బెట్టినాలుగుచాప్పరిజ్ఞ్చి చెవులు ముఉస్తే ఇదంతా ఉండనే ఉండదు .
      మనమే పిల్లల్ల్ని నాజూక్  జేస్తున్నాం మనల్ని మన పెద్దోళ్ళు ఏంకౌన్సిల్ జేసినరు, మనమంతా అట్లనే జచ్చినమా అన్నాడు.
      నాకెందుకో .నిజంగానే మనం పిల్లల్ల్ని అతి నాజూకు చెస్తూ, భయపదుతూమన సంపాదన అంతా వాళ్ళ చదువులకి వెక్చిస్తూ , మనదంటూ ఎమీ లేకుండ,అంతా వాళ్ళే అన్న భావన పెన్చుకున్తూ, వాళ్లని మనమే అల తయారుచేస్తున్నామేమో అనిపించింది .
             పిల్లలకి మంచి, చెడు అవసరాన్ని బట్టి కొద్దిగా మెత్తగా, కొద్దిగా  కఠినంగా వివరిస్తూ, వాళ్ళతో వాళ్లకి ఒక మంచి స్నేహితులలాగా కలిసిపోతేఇలాంటి విషయాలు కొంతవరకైనా మరుగౌతయేమో అనిపించింది. ఏమంటారు  ? 

Tuesday, April 13, 2010

My first speech......at my school...never forget...............

చాలా రోజుల క్రితం ఉద్యోగ రీత్యా నన్ను ఒక  వర్క్ షాప్ కి ఆహ్వానించారు. .  అక్కడ నేనే ముఖ్యఅతిధిని. నేనే మాట్లాడవలసి ఉంది.
అన్దరూ నేనేమి మాట్లాదతానా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వేదిక  మీది కంటే నేను విడిగానే అందరితో కలివిడిగా
కలిసిపోతాను. కొద్దిగా స్నేహ స్వభావం కూడా
         నేను మాట్లాడాలి.  అప్పుడు సందర్భం కాకపోయినా ఒక్క క్షణం నా మనసు నా ఆరో తరగతి లో జరిగినా ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకుంది.
        ఆ రోజు మా స్కూల్ లో ఉపన్యాస పొటీజరుగుతోంది. మా క్లాసు టీచరు నన్ను తప్పనిసరిగా ఆ పొటీ లో పాల్గొనాలని ఆర్డరు వేసారు. బహుశ ప్రతీ సారీ నేను దాన్లో పాల్గొనడానికి ఎగ్గొట్టడం ఆయన గమనించి ఉంటారు. నాలో ఉన్న బెరుకు పోయి నేను కొంతైనా పబ్లిక్ లో మాటాడ్డం తెలుసుకుంటానని కావచ్చు
        అప్పట్లో నేనెంతో నాకే తెలియుడు. నాకెలాంటి ఆశయాలు కానీ, క్రియేటివిటీ కానీ, ఉత్సాహం  గా  దెనికీ   ముందుకి   వెళ్ళడం కానీ లేవు.
     ...i was nothing then
        కానీ నేనొక్క  విషయం మాత్రం చెప్పగలను నేను మొత్తానికి అంతర్ముఖిని నని  దాన్ని మా టీచరు గమనించి ఆ రోజు నా కా శిక్ష వేశారేమో   
        ఇంక     తప్పించుకోలేనని తెలుసుకుని ఒక కాగితం మీద నాకు తెలిసిన మూడు ముక్కలు వ్రాసుకుని వాళ్ళంతా వణుకుతుంటే నన్నెప్పుడు పిలుస్తారో, ఈ గండం ఎప్పుడు గట్టేక్కుతుందో అని అనుకున్టూ కూచున్నాను. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.    ఇంతలో నన్ను స్టేజి మీదకి పిలిచారు. నేనెక్కడికి పారిపోతానో అన్నట్టు మా సారూ నా వెంటే ఉంది నన్ను స్టేజి మిదకి పంపించి  ఎదురుకుండా కుర్చీ లో కూర్చున్నారు.  .నాకింకా జ్ఞాపకం ఉంది. నేనేం మాట్లాడానో నాకే తెలియదు    .  నాలో నేనే

గొణుక్కుని  బ్రతుకుజివుడా అని  బయట పడ్డాను. మా మాస్టారు నన్ను చూసిన చూపు నేనింకా మరిచిపోలేను. అయ్యో అన్నట్టు  నా ఆలోచనలలో పడి నే నేక్కడున్ననన్నదే మర్చి పోయాను
         ఆ రోజు మహిళా సాధికారత గురించి , వాళ్ళ జీవన ప్రణాళిక ఏ రకంగా వేసుకో వాలి, తమ పనులని ఏ విధం గా ముందుకి తీసికెల్లలి.
దానికోసం సమావేశాలకి హాజరు అయి తమ తమ సమస్యలని సమావేశాలలో ఎలా చర్చించు కోవాలి , తమ బాధ్యతని తామే తీసుకున్తూ, తమ హక్కులని తామే ఎలా సాధించుకోవాలి ,    .... నాలో నేను మునిగిపోయి, సబ్జెక్టు లో మున్దుకెదుతూ, నన్ను తదేకంగా గమనిస్తున్న ఒక ఆవిడని చూసాను.
మాట్లాడం ముగించి నేను కుచోగానే నన్ను ఆవిడ నాతొ మాట్లాడానికి నా ప్రక్కకే వచ్చి కూచున్నారు. తనని తను   మండల ప్రెసిడెంటు గా పరిచయం చేసుకున్నారు,  ఆవిడ కి మారుగా ఆవిడ భర్తగారు మండలం లో సమావేశంలో ఆమె స్తానంలో కూచుని మాట్లాడుతున్నాడు.  .
         తనకున్న కొన్ని సందేహాలని అదుగుతూ ఆవిదన్న మాట మేడం నేను మండలానికి ప్రెసిడెంట్ ను. మా ఆయనేమో నన్నేమి పట్టించుకోకుండా అన్ని పనులు ఆయనే చేయబట్టే. పైసలకాడ ఎమన్నా ఐతే మాట పోదా , తానె ప్రెసిడెంట్ లాకా చేస్తాడు. . ఆయనని నేనెట్ల ఆపాలేనో తెలుస్త లేదు ..దాదాపు కన్నీళ్ళ పర్యన్తమౌతూ చెప్పిందామె.
       నిఇకు నువ్వు అన్ని విశ్యాలూ తెలుసుకో. ప్రజలోకి వెళ్లి మండల ప్రెసిడెంట్ అని పిలిచినప్పుడు నేనే అని నిలబడి నిఇకు తెలిసిన రెండు ముక్కలే చెప్పి అందరి సలహాలు కోరుతున్నని చెప్పు.
నిన్ను నువ్వు నిరుపించుకో , తెలిసినంతవరకే అని కాకుండా  ఇంకా తెలుసుకునే ఆత్రుత కలిగిఉండు.
అంతే కాకుండా ని భార్తమిద ప్రేమకలిగి ఉంటూ భార్యగా ని బాధ్యత నెరవెరుస్తూ, బయటకేల్తే నీ  వ్రుత్తి  లో తన  స్తానమెంతో  తెలిసేట్టు చెప్పు.   చేబుతునే ఆమె మొఖంలో కలిగిన మార్పుని గమనించాన్నేను. ఆమె ఆలోచించడం ప్రారంభించింది. ఆ తరవాత మళ్ళి మరో మిటింగు కి ఆ మండలానికి నేను వెళ్ళినపుడు అసలైన మండల మహిళా ప్రెసిడెంటుగారు అద్భుతమైన ఉపన్యాసం  ఇస్తుంటే నాకెంతో ఆనందమేసింది. వావ్ మనల్ని మనమే  inspire చేసుకోవాలి .
 చేపకి  యిదడం  ఎవరు  నేర్పించారు ?  నీళ్లలోకి తోస్తే    యీత    అదే వస్తుంది.

Sunday, April 11, 2010

ఒంటరి తనం .


              చిన్నప్పుడు బడికి వెళ్ళేప్పుడు చదువు, ఆటలు, హోమ్ వర్కు  దీనితొ బాటే నన్ను అస్తమానమూ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఆదేశించే తోబుట్టువులు, వెరసి నాకెప్పుడు ఒంటరి తనం తెలీలెదు. అల్లా  ఆనే కంటే ఒంటరితనం అంటే ఏంటో తెలియదంటే కర్రేక్టేమో

            కాస్త పెద్ద అయినాక పెద్ద క్లాసు, పెద్ద చదువు, బయటకేల్తే పెద్దవాళ్ళు చెప్పినట్లే తల వంచుకుని నా పనేదో నేను చేసుకుని రావడమే తప్ప ఎక్కువ, తక్కువ స్నేహాల్లేవు. అయినా ఒంటరి తనం అంటే ఏంటో అప్పట్లో నాకు తెలిదు
 .
          కాలేజి రోజులకి వచ్చాక మెల్లి, మెల్లిగా వాస్తవానికి దగ్గరగా జీవన ప్రయాణం మొదలయింది. . దాన్ని కాలేజి చదివించారు, నన్ను లేవెంత్ తోటే ఆపేశారు.  నిష్కల్మశమైన రక్తసంభందాల మధ్యన చిన్న వెలితి తో ఒంటరితనమంటే ఏంటో అర్ధమవ  సాగింద

          ఎలేవెంత్,కి,ఇంటర్ కి కాలేజి అన్న ఒకే ఒక నేమ్ చేన్జి  నాకు , నా తోడబుట్టిన వాళ్లకి మధ్యన దూరాన్ని పెంచింది.
నాకు ఎందుకో అర్ధం కాలేదు. కానీ ఏదో మార్పు మాత్రం అర్ధ,మయ్యింది.
          కాలేజికి వెళ్ళేప్పుడు మా ఇంట్లో నాకు చెప్పిన ఆంక్షలు వింటే , చదువు లేకుంటే మానె, వదిలేద్దాం అనిపించేది. కానీ నా లక్ష్యం ఒక్కటే బాగా చదువుకోవాలి, కుటుంబానికి ఆసరాగా నిలవాలి.
          కొన్ని సార్లు ప్రాక్టికల్స్  ఉన్నప్పుడు బాగా ఆలస్యం అయేది. ఆ తరవాతి కధ చెప్పకనే  అర్ధం చేసుకో గలరు చదువరులు
ఆ చదువు అవగానే మరేదో పెద్ద
చదువుకి వెళ్ళాలని  ఆశ. అది నేరవేరదని నాకు తెలిసినా ఆశ.
          అప్పుడే  డీ . యస్సీ . ముగ్గురం తోబుట్టువులం హాజర్ అయితే చివరగా నేనే ఎన్నుకో బడ్డాను.
          ఒక్క  సోదరి వ్రాత పరిక్షలోపొతే, మరొక సోదరి ఇంటర్వ్యూ లో పోయింది
       అప్పుడు వినాలి కామెంట్స్ వాడు మొఖాలు చూసి బొట్టు పెట్టాడు. లేకుంటే నాకూ వచ్చేది ఉద్యోగం . ఇది విన్నాక నేను మొదటిసారి మహా వంటరిగా అయినట్లనిపించింది.
       ఇప్పుడు అన్దరూ తమ, తమ కుటుంబాలతో హాయిగానే ఉన్నారు.
       నేను మాత్రం నా కుటుంబాన్ని ఒంటరిగా లాక్కు వస్తూనె ఉన్నాను. ఆ చదువు నా అత్తవారి ఇంటిని నిలబెట్టడానికి, నా జీవితం లో పిల్లల్ని పోషించి పైకి తీసుకురావడానికీ ఉపయోగపడింది.
        అందరు నా వెంటే వస్తున్నారు. హోదా పెరిగింది.
       నా ఒంటరితనం మాత్రం మరింత పెరిగింది. 

      మనసుల మధ్య దూరాలతో
      .ఎప్పుడూ ఇంత డబ్బు పంపించు, అంత డబ్బుపంపించు అంటారు గాని, ఎలా ఉన్నావ్, అని ఒక్కరు కూడా అడగరు అంటు కంట నిళ్ళు పెట్టుకుంటున్న స్నేహితురాల్ని చూసి, చాలా కాలం తర్వాత మనసు విప్పి చెప్పుకునేందుకు నేను దొరికానని అది బాధ పడుతుంటే  ఆ ఒంటరి తనానికి జవాబుగా ఆమె  కళ్ళనించి రెండు కన్నీటి చుక్కలు కింద పడి ఇంకిపోయాయి.
నేననుకున్నాను, నేను ఒంటరిని కాదు.
         

Saturday, April 10, 2010

సాగే జీవన రాగం


చాలా రోజులతర్వాత నాబ్లాగు లో ఏదైనా రాద్దామని కూర్చున్నాను.
ఎండలు మండి  పోతున్నై అంటే   అందరు నవ్వుతారు. ఇదెమీ చెప్పాల్సిన విషయం కాదె అనుకుంటారు కూడా  
       కర్ఫ్యూ  వల్ల జనాలు ఎంత బాధ పడుతున్నారో అంటే కర్ఫ్యూ పెట్టడమే (సామాన్యజనాన్ని)    బాధ పెట్టడానికే కదా దాన్లో ప్రత్యేకించి అనుకోడానికి ఏముంది అంటారేమో
 కానీ నేనేదైనా చెప్పాలి.
       అన్నట్టు గర్భిణీ స్త్రీలని కానుపుకు కూడా అనుమతి ఇవ్వనంత తప్పు వాళ్ళేమి చేసారో, ఈ మగాళ్ళకి నొప్పులోచ్చి ఆ నొప్పలతో  ఒక్కడంటే ఒక్కడు బాధ పడ్డా కర్ఫ్యూకాదు దానమ్మ ఉన్నాఆ ఆడమనిషిని ఆసుపత్రిలో జేర్చడానికి అ పోలిసోల్లె సహాయమందించే    వాల్లేమో  .
         మళ్ళి సాయపడ్డ వాళల్లోకూడా మీడియా పొటీ . మాచానేల్ గొప్ప చూసారా, ప్రసవ వేదన పడుతుంటే ముందుండి  హాస్పిటల్ కి
పంపించాం . మేమెంత ముందున్నామో  చూసారా ? తాము చేసామని 
 చెప్పుకున్టూనె  , అవతల వాళ్ళు ఏం చేయలేదో, తామెంత గొప్పో హయిగా చెప్పుకుంటూ,మా చానెల్ చేసిన పని మీకు నచ్చిందా . మీకు  నచ్చితే ----అని టైపు చేసి స్పేస్ ఇచ్చి గొప్ప మీ చానేలే అని వ్రాసి గోవిందా గోవిందా అన్న సెల్ నెంబర్ కి మెసేజ్ చేయండి --మర్చిపోకండి ----ఇలా సాగిపోతోంది ఒక చానెల్ గోల.


    ఆ మహతీ... ప్రముఖ బొంగారాలాడే తార మానియా పెళ్ళంట కదా . వాళ్ళింటి ముందు  ఇప్పుడు ఎంతమంది జనాలున్నారు,
హడావుడి ఎలా ఉంది  వివరాలు చెప్పండి ...తూఊఊఊఊఊఊఉఇ  హలో.....హలో    మహతి  నామాటలు వినిపిస్తున్నాయా

      ఇంతలో అవతల్నిచి హలో బాబీ నేనిప్పుడు,  ఇప్పుడేంటి ఇవ్వాళ ఉదయం నిన్చీబొంగారాలాడే తార మానియా ఇంటిముందే ఉన్నాను వాళ్ళింట్లో అందరు హాయిగా తిని, తాగి డాన్స్ చెస్తూ సంతోషంగానే ఉన్నారు. మన మీడియా వాళ్ళు తప్ప అందఋ  హాయిగా  , వాళ్ళ వాళ్ళఇళ్ళల్లో నిద్రపోతున్నారు, అంతే  కాదు, పరిక్షల  కారణం గా వాళ్ళ వాళ్ళ పిల్లని చదివిన్చుకున్తూ జనాలందరూ కూడా వాళ్ళ, వాళ్ళ ఇళ్ళల్లో   
ప్రశాంతంగా ఉన్నారు.దరిద్రం అంటుకున్నట్లు , మన మీడియా వాళ్ళు మాత్రమె బొంగారాలాడే తార మానియాఇంటిముందు పడిగాపులు గాస్తున్నారు. ఇప్పుడు సమయం రాత్రి సుమారు పన్నెండు గంటలయింది, ఇప్పుడు మానియా ,వాళ్ళ అమ్మగారు కలిసి ఎటో వెళ్తున్నారు, మా పరిశోధనలో మన క్లూస్  టీమ్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళు రెస్ట్ రూం కి వెళ్తున్నట్లు తెలిసింది,     
ఇంతలో స్టూడియో నించి న్యూస్ రీడరు ఆ.. మహతీ, ఇప్పుడే వాళ్ళ పెరటి దోవ నుంచి మన ఛానల్ కి ఎక్స్  క్లుసివ్   గా  వార్త లం దిం చ టానికి  మన మురళి లైన్ లో ఉన్నారు మరి ఆ వార్త లేంటో చూద్దం  లైన్ కట్   ఇలా సాగుతూ ఉంటుంది ఎక్స్  క్లుసివ్ వార్తలని అందించే తపన. ఇది ఎవరికీ ఏ రకంగా ఉపయోగమో ఆ చానల్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ బాధలన్నీ పడలేక దేవుడు ముందు చూపుతొ రాయి అయి పోయాడు గనక.
     మన మేమైపోతామో, ముందు, ముందు పిచాసుపత్రులకి ఎంత గిరాకీ వస్తుందో చేప్పక్కరలేదనుకుంటా. ఇది సాగే జిఇవన రా   ఆఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గం  
ఇలాంటి పొగడ్తలు , స్వోత్కార్షలు వింటున్నా, చూస్తున్నానాకో కధ జ్ఞాపకం వస్తుంది. మహా భారతం లో   అభిమన్యుణ్ణి ప్రత్యర్ధులు   పద్మవ్యూహం లో సంహరించినప్పుడు , తానూ లేని  సమయం లో, తనకుమారుణ్నిఒంటరిని చేసిప్రత్యర్ధులు చంపుతుంటే , ఇంతమంది పెద్దనాన్నలు, చిన్నాన్నలు ఉండి కూడా తన తనకుమారుణ్నికాపాడ లేక పోయిందుకు నిందించిన అర్జునుడు ఆవేశం తగ్గినాక తన తప్పు తెలుసుకునిపశ్చాత్తాపంతో  , కృష్ణా , వాసుదేవా 
 ఆవేశంలో పెద్దంతరం, చిన్నంతరం మర్చిపోయి , పుత్ర శోకం తో నా అగ్రజులను, తమ్ములను అనరాని మాటలన్నాను , నా యీ తప్పుకి ఏదైనాప్రాయచిత్తం    సెలవియ్యమని వేడుకున్నాడు. దానికి సమాధానం గా వాసుదేవుడు ఈ విధంగా తరుణోపాయం చెప్పాడు. 
    అర్జునా , చెబుతాను, విను. ఎవరైనా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్లి, నిన్ను అలసిపోయే దాకా పోగిడించుకో  . ఆ పొగడ్త లే నీకు ప్రాయచిత్తం. అని సెల విస్తాడు. 
          మరి మన చానల్స్ కి మనల్ని ఇంత బాధ పెడుతున్నందుకు  ప్రాయచిత్తమే లేదా,  అయినాపశ్చాత్తాప పడ్డ  వాళ్ళకే కదా ప్రాయచిత్తం......................................

Thursday, April 8, 2010

ఈరోజు టీవీ లో వార్తలలో చెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.

kalividi@googlegroups.com         
   ఒకటికి ఆరు రెట్లు ఇస్తామనిఇరవైఏడు కోట్లు రూపాయలు వసులు చేసి ఆ సొమ్ముని షేర్లలో పెట్టి, నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న తల్లి, తండ్రులు, విస్తుపోయి, మైండుపాడైపోయి  వెర్రి చూపులు చూస్తున్నా వారి కొడుకు,  ఈరోజు టీవీ లో వార్తలలోచెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.


     కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగటానికి   సూత్రమనీ చెప్పి,

నిజాయితీ తో  పిల్లలని పెంచటం మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన నీతి.

      మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా? 

ఒకసారి వళ్ళు జలదరించింది. 

      పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక 

నడవడానికి   బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి 

అత్యాషలు తలకి ఎక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ  ఎక్కడం 

లో ఉన్న మానసిక ప్రశాంతతని  తెలియజేయాలి. . వాళ్ళు దారి తప్పి ,

అత్యాశకి పోయి తప్పు చేస్తున్నట్లనిపిస్తే హెచ్చరించాలి.

     అలాంటిది పెద్దలే పప్పులో కాలేస్తే కుటుంబమే పాడైపొలెదూ ? వాళ్లకి 

సంబంధించిన కుటుoబీకులు    బ్రతికినన్ని రోజులు వేలెత్తి  చూపించు కుంటూ

ఎలా బ్రతకాలి ,  ఎలా బ్రతకాలి

    మన ఆనందం, అత్యాశ మన తర,తరాల లనీ ఇలా వెలి చుపులకి 

బలి చేయడం సమంజసమేనా

     ఎందుకిలా జరుగుతోంది? 

    మనం తినేది ఒక్క ముద్దా కట్టేది ఒక్క బట్టా

మన కోసమే ఐతే ఇంత సంపాదన , ఇంతమంచి  చదువు చదివి , మంచి 

ఉద్యోగం చేస్తే  చాలదా /

మనిషి ఆయువు వంద సంవస్తరాలై తే దాన్లో  యాభై  ఏళ్ళు నిద్ర పోవడానికే 

సరిపోతుంది. దాదాపు పది ఏళ్ళ వయసు దాకా పెద్దల పెంపకం లోనే జరిగి 

పోతుంది.
       అంటే మొత్తం అరవై ఏళ్ళ బ్రతుకు ఉట్టిగానే వెళ్ళిపోతుంది. మిగిలిన నలభై

ఏళ్ళ బ్రతుకులో  మంచి చదువు,   కొంచం ప్రేమ, కొంచం డబ్బు చాలవా ?

     ప్రతి ఒక్కళ్ళు ఒక అంబానియో , బిర్లా నో, ఒక రతన్ టాటా నో కావాలని 

ఆశ. అంటే కాదు వాళ్ళలాగా హై క్లాసు బ్రతుకు గడపాలని ఆశ. వాళ్ళలాగా 

పది మందిని బ్రతించాలని కాకుండా ముంచాలని , తద్వారా తాము 

కార్లలో,తిరుగుతూ, ఖరీదైన జీవితం గడపాలనీ  వెంపర్లాట  ఎందుకిదంతా

తా దూరసందు లేదు, మెడకోడొలని    మన బ్రతుకు,మనం బ్రతకడానికి, 

ఇంతమంది జివితాలతో ఆడుకోవడం అవసరమా

ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఉంది.

రూపాయి కి ఆరు అనగానే  డబ్బుఇచ్చిన వాళ్లకి  బుద్ధి లేదు  .

ఇది నా వ్యక్తిగతమైన బాధ మాత్రమె. అందరు నాతొ ఎకిభావించాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది.