Sunday, April 11, 2010

ఒంటరి తనం .


              చిన్నప్పుడు బడికి వెళ్ళేప్పుడు చదువు, ఆటలు, హోమ్ వర్కు  దీనితొ బాటే నన్ను అస్తమానమూ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఆదేశించే తోబుట్టువులు, వెరసి నాకెప్పుడు ఒంటరి తనం తెలీలెదు. అల్లా  ఆనే కంటే ఒంటరితనం అంటే ఏంటో తెలియదంటే కర్రేక్టేమో

            కాస్త పెద్ద అయినాక పెద్ద క్లాసు, పెద్ద చదువు, బయటకేల్తే పెద్దవాళ్ళు చెప్పినట్లే తల వంచుకుని నా పనేదో నేను చేసుకుని రావడమే తప్ప ఎక్కువ, తక్కువ స్నేహాల్లేవు. అయినా ఒంటరి తనం అంటే ఏంటో అప్పట్లో నాకు తెలిదు
 .
          కాలేజి రోజులకి వచ్చాక మెల్లి, మెల్లిగా వాస్తవానికి దగ్గరగా జీవన ప్రయాణం మొదలయింది. . దాన్ని కాలేజి చదివించారు, నన్ను లేవెంత్ తోటే ఆపేశారు.  నిష్కల్మశమైన రక్తసంభందాల మధ్యన చిన్న వెలితి తో ఒంటరితనమంటే ఏంటో అర్ధమవ  సాగింద

          ఎలేవెంత్,కి,ఇంటర్ కి కాలేజి అన్న ఒకే ఒక నేమ్ చేన్జి  నాకు , నా తోడబుట్టిన వాళ్లకి మధ్యన దూరాన్ని పెంచింది.
నాకు ఎందుకో అర్ధం కాలేదు. కానీ ఏదో మార్పు మాత్రం అర్ధ,మయ్యింది.
          కాలేజికి వెళ్ళేప్పుడు మా ఇంట్లో నాకు చెప్పిన ఆంక్షలు వింటే , చదువు లేకుంటే మానె, వదిలేద్దాం అనిపించేది. కానీ నా లక్ష్యం ఒక్కటే బాగా చదువుకోవాలి, కుటుంబానికి ఆసరాగా నిలవాలి.
          కొన్ని సార్లు ప్రాక్టికల్స్  ఉన్నప్పుడు బాగా ఆలస్యం అయేది. ఆ తరవాతి కధ చెప్పకనే  అర్ధం చేసుకో గలరు చదువరులు
ఆ చదువు అవగానే మరేదో పెద్ద
చదువుకి వెళ్ళాలని  ఆశ. అది నేరవేరదని నాకు తెలిసినా ఆశ.
          అప్పుడే  డీ . యస్సీ . ముగ్గురం తోబుట్టువులం హాజర్ అయితే చివరగా నేనే ఎన్నుకో బడ్డాను.
          ఒక్క  సోదరి వ్రాత పరిక్షలోపొతే, మరొక సోదరి ఇంటర్వ్యూ లో పోయింది
       అప్పుడు వినాలి కామెంట్స్ వాడు మొఖాలు చూసి బొట్టు పెట్టాడు. లేకుంటే నాకూ వచ్చేది ఉద్యోగం . ఇది విన్నాక నేను మొదటిసారి మహా వంటరిగా అయినట్లనిపించింది.
       ఇప్పుడు అన్దరూ తమ, తమ కుటుంబాలతో హాయిగానే ఉన్నారు.
       నేను మాత్రం నా కుటుంబాన్ని ఒంటరిగా లాక్కు వస్తూనె ఉన్నాను. ఆ చదువు నా అత్తవారి ఇంటిని నిలబెట్టడానికి, నా జీవితం లో పిల్లల్ని పోషించి పైకి తీసుకురావడానికీ ఉపయోగపడింది.
        అందరు నా వెంటే వస్తున్నారు. హోదా పెరిగింది.
       నా ఒంటరితనం మాత్రం మరింత పెరిగింది. 

      మనసుల మధ్య దూరాలతో
      .ఎప్పుడూ ఇంత డబ్బు పంపించు, అంత డబ్బుపంపించు అంటారు గాని, ఎలా ఉన్నావ్, అని ఒక్కరు కూడా అడగరు అంటు కంట నిళ్ళు పెట్టుకుంటున్న స్నేహితురాల్ని చూసి, చాలా కాలం తర్వాత మనసు విప్పి చెప్పుకునేందుకు నేను దొరికానని అది బాధ పడుతుంటే  ఆ ఒంటరి తనానికి జవాబుగా ఆమె  కళ్ళనించి రెండు కన్నీటి చుక్కలు కింద పడి ఇంకిపోయాయి.
నేననుకున్నాను, నేను ఒంటరిని కాదు.
         

4 comments:

Sai Praveen said...

అక్షరాల సైజు కొంచెం పెంచండి. చదవడానికి ఇబ్బందిగా ఉంది.

Sravya V said...

ఈ పోస్టు చదవగానే మనసంతా ఒక్కసారి గా ఏలాగో అయింది ! ప్రతి ఒక్కరికి ఈ బాధ ఏదో ఒక సమయం గా కలుగుతుంది కాకపొతే ఆ తరచుదనం లో తేడా ఉండచ్చేమో ఖచ్చితం గా మీరు ఒంటరి కాదు.

Tanu Collections said...

మనసుకి హత్తుకునేల చెప్పారు....
నిజమే అందరికి మన వల్ల లభించే ప్రయొజనాలు కావలి కాని మనం అక్కరలేదు....
ఎదైన అవసరం వుంతే తప్ప మనం గుర్తుకు రాము....
ఎపుదిఎన ఎవరైన ఫొనె చేసరంటె, వాల్లకి ఎదో పని పడిందన్నమాట మనతో

Tanu Collections said...

మనసుకి హత్తుకునేల చెప్పారు....
నిజమే అందరికి మన వల్ల లభించే ప్రయొజనాలు కావలి కాని మనం అక్కరలేదు....
ఎదైన అవసరం వుంతే తప్ప మనం గుర్తుకు రాము....
ఎపుదిఎన ఎవరైన ఫొనె చేసరంటె, వాల్లకి ఎదో పని పడిందన్నమాట మనతో