Monday, July 27, 2015

చిన్న పిల్లలకి హారతి


మా చిన్న తనం లో చిన్న పిల్లకి పుట్టిన రోజు వచ్చిందీ అంటే , పెంద్రాళే నిద్ర లేపి , తలంటి పోసి , కొత్త బట్టలు వేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమనే   వాళ్లు. ఆ తర్వాత వీలుని బట్టి గుడికి తీసెకెళ్లె వాళ్లు
సాయంత్రం కాగానే ఇరుగు, పొరుగు వాళ్లని పేరంటానికి పిలిచి ,పుట్టిన రోజు పెళ్లికొడుకు/పిల్ల లకి పీట వేసి, కూచొబెట్టి ,మున్దుమంగళ హారతి ఇచ్చి, వచ్చిన పేరంటాళ్ళు దీవించి  చక్కగా మంగళ హారతులు పాడి దీర్ఘాయువు ,సకల సంపదలు కలిగి, సద్గుణాలతో వర్ధిల్లాలని దీవించే వాళ్లు తదనంతరం ఆ పైన వసంతం నీళ్లతో దిష్టి తీసే వాళ్లు.
వచ్చిన వాళ్లకి పండు, తాం బూలము ఇచ్చి సాదరం గా సాగనంపెవాళ్లు
మచ్చు కి ఒక పాట ఇదిగో


పల్లవి ::కర్పూరా హారతిదే ,కమలజదళ నాయన నీకు
సుందర సుకుమార గాత్ర  నందకుమారా
చరణం ::గోపీ కా హృదయ లోల గోపాల బాల నీదు
             ప్రాపూ కోరీనవాడ  రాపేల చేసెదవు
             శ్రీ లోలా వాదమేల  శ్రితజన పరిపాల నీదు
             జాలమటుల చేయనేల బాల గోపాలా ఓఓఓ ..
     2      పచ్చాలా హారతులూ పణతూలం దరు  గూడి  
            పంకాజ నాభ నీకు పొంగూచు నిచ్చెదరూ
           పతితా పావాన గాత్ర ,పాలకడలి శయన గోకుల
           బృందావన సంచార, నంద కుమారా ఓఓఓ .
   3      నవనీతా చోర నీదు అతులీతా ప్రేమ తోడ
           సతతామూ బ్రోవుమాని చాలాగ వేడెదమూ
            కమలాక్షా  నే నిచ్చు కర్పూరా హారతూలు
           కరుణించీ గైకొనూమా కనికారమ్ము తో 

1 comment:

Unknown said...

Life is a way your tag line amazing.
మరిన్ని కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు కొసం చదవండి Spice Andhra News