అలరులు కురియగ నాడెనదే
అలకల కులుకుల అలమేల్మంగా
అరవిరి సొబగుల అతివలు మెచ్చగ
అర తెర మరుగునా నాడెనదే
వరుసగ పూర్వదు వాలపుతిరుపుల
హరి గరగింపుచుఅలమేల్మంగా
మట్టపు మలపుల మట్టెల కెలకుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిటు చిమ్ముచు అలమేల్మంగా
చిందుల పాటల సిరిపొలయాటల
అందెల మ్రోతల ఆడె నదే
కందువ తిరు వేంకట పతి మెచ్చగ
అందపు తిరుపులఅలమేల్మంగా
No comments:
Post a Comment