పల్లవి
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ని శ్రీ పాదమే శరణు
చరణం
కమలాసతీ ముఖ కమల కమల హితా ,కమల ప్రియా కమలేక్షణా
కమలాసన హిత గరుడగమన శ్రీ,కమల నాభ నీ పద కమలమే శరణు //శ్రీమన్నారాయణ //
పరమయోగి జన భాగధేయ శ్రీ పరమపురుషా పరాత్పరా
పరమాత్మా,పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు //శ్రీమన్నారాయణ//
1 comment:
చాలా మంచి కీర్తన. నేను రోజూ వింటూంటాను... ధ్యాంక్యూ ఫర్ షేరింగ్...
Post a Comment