దరిద్ర నారాయణ లోకేశా, దయాపరాయణ ప్రాణేశా !
నిరంతరాశ్రయ మీవే కావా , నిరామయామృత మీవే కావా !
విశీర్ణ వసనధరా లోకేశా వికీర్ణతిమిర హరా ప్రాణేశా !
ప్రశాంత జీవిక వీవేకావా ,నిశాంతదీపిక వీవేకావా!
పరాగభరి తాంగాలోకేశా, విరాగ పద సంగా ప్రాణేశా!
పురాణ మిత్రమ మీవేకావా నిరంజనాత్మవు నీవేకావా!
విశాల నవభారతలోకేశా విశేష దీనాశ్రిత ప్రాణేశా!
అశేష భాగ్యమవీవేకావా అనంత శక్తివి నీవేకావా!
No comments:
Post a Comment