Friday, September 30, 2011

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు బతుకియ్యి ఉయ్యాలో 

నాగుల   పంచమి   ఉయ్యాలో
నేనోక్కపోద్దుంటి  ఉయ్యాలో

మా  ఇంట్లఅందరు  ఉయ్యాలో
 దశిమొక్కపోద్ద మ్మ  ఉయ్యాలో

పసుపు బెట్టి  నీలు   పోసి  ఉయ్యాలో
పట్టు  వొల్లె  గట్టి  ఉయ్యాలో

పట్టు  మొగ్గల  రవికె  ఉయ్యాలో
పేయి  నిండా  తొడిగి  ఉయ్యాలో

వొప్పిన  పేలాలు  ఉయ్యాలో
ఒడినిండ పోసుకొని  ఉయ్యాలో

చిలకల  జెలి  చెంబు  ఉయ్యాలో
చేత  పట్టుకొని  ఉయ్యాలో 

పోయిరే అమ్మల్లు   ఉయ్యాలో 
పుట్ట  న పాలుబొయ్య   ఉయ్యాలో

పుట్ట  నోమితినమ్మ  ఉయ్యాలో 
పుట్టింటి  సలువకు  ఉయ్యాలో  

అరుగు  నోమితినమ్మ  ఉయ్యాలో 
అన్నల ఆయుసుకు  ఉయ్యాలో

చవితి పండుగ జేస్తి ఉయ్యాలో 
కడుపు సలువ కొరకు  ఉయ్యాలో                          

ఉసిరి   చెట్టు  కింద  ఉయ్యాలో 
బుసకొట్టే ఒక పాము  ఉయ్యాలో

ఆ  పాము ననుజూసి   ఉయ్యాలో
పడగ లేపిందమ్మఉయ్యాలో

పడగ   ఎత్తకు  నాగ  ఉయ్యాలో 
పగవోల్లమే   కాము   ఉయ్యాలో

ఆ  పాము  నను   జూసి    ఉయ్యాలో  
గుడ్లు  తిప్పింది  ఉయ్యాలో 

గుడ్లు  తిప్పకు  నాగ  ఉయ్యాలో  
గోడ్డుదానిని కాను  ఉయ్యాలో

ఆ  పాము  నను  జూసి    ఉయ్యాలో 
నడుము  తిప్పింది  ఉయ్యాలో

నడుము  తిప్పకు  నాగ  ఉయ్యాలో
నడిపి  చెల్లెను నేను   ఉయ్యాలో

ఆ  పాము  నను  జూసి  ఉయ్యాలో 
తోక  తిప్పింది  ఉయ్యాలో

తోక  తిప్పకు  నాగ   ఉయ్యాలో  
తోటి సెల్లెను నేను     ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు బతుకియ్యి ఉయ్యాలో

బతుకమ్మ పాటలు



ఒక్కొక్కఅక్షింతలుగౌరమ్మ 
ఒక్కమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి 
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి 
దొంగలతోఏమందునెగౌరమ్మ
దొరలతోఏమందునే 
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపేరంటాల్లమే //ఓక్కొక్క//
                                                                                           
రెండేసిఅక్షింతలుగౌరమ్మ
రెండుమల్లెసారెలు
నినుతలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి 
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతో ఏమందునే
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాలపేరంటాల్లమే //ఓక్కొక్క//
మూడేసిఅక్షింతలుగౌరమ్మ
మూడుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దె లెక్కిరి 
ఏడుమిద్దెల సందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏమందునేగౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారామేగౌరమ్మ
బాల పేరంటాల్లమే //ఓక్కొక్క//
                                                                                           
నాలుగేసిఅక్షింతలు గౌరమ్మ
నాలుగుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏమందునేగౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపెరంటాల్లమే  //ఓక్కొక్క//
                                                                              

ఐదేసిఅక్షింతలుగౌరమ్మ
అయిదుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి 
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాలపెరంటాల్లమే //ఓక్కొక్క//
                                                                                               
ఆరేసిఅక్షింతలుగౌరమ్మ
ఆరుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి 
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాల పెరంటాల్లమే  //ఓక్కొక్క// 
                                          
ఏడేసి అక్షింతలుగౌరమ్మ
ఏడుమల్లెసారెలు
నినుతలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలే మో దాగిరి
దొంగలతోఏమందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపేరంటాల్లమే  //ఓక్కొక్క// 
                                                                                                 
ఎనిమిదేసి అక్షింతలుగౌరమ్మ
ఎనిమిదిమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి 
ఏడుమిద్దెలసందున గౌరమ్మ
దొంగలేమో దాగిరి
దొంగలతో ఏమందునే గౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాల పేరంటాల్లమే         
తొమ్మిదేసిఅక్షింతలుగౌరమ్మ
తొమ్మిదిమల్లెసారెలు
నిను తలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడు మిద్దె లెక్కిరి 
ఏడుమిద్దెల సందున గౌరమ్మ
దొంగలేమో దాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాలపెరంటాల్లమే     
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాలపేరంటాల్లమే 
బంట్లక్కవయ్యారమే  గౌరమ్మ
బాల  పేరంటాల్లమే  

మీనాక్షి పంచరత్నం







ఉద్యద్భాను  సహస్రకోటి  సదృశాం, కేయూర  హారోజ్వలాం
బిం బో ష్టీ౦ స్మిత దంత పంక్తి రుచిరాం , పీతాంబ రాలంక్రుతాం 
విష్ణుబ్రహ్మ సురేంద్ర సేవిత పదాం  తత్వ స్వరుపాం శివాం
మీనాక్షీం   ప్రణతోస్మి  సంతతమహం ,కారుణ్య  వారానిధిం .



ముక్తాహారలసత్  కిరీటరుచిరాం , పూర్ణేందు  వక్త్ర  ప్రభాం  ,
సిన్జన్  నూపుర కింకిణీ మణిధరాం   , పద్మప్రభా  భాసురం  ,
సర్వాభీష్టఫల ప్రదాం    గిరి  సుతాం   , వాణి  రమా    సేవితాం ,
మీనాక్షీం   ప్రణతోస్మి  సంతతమహం ,కారుణ్య  వారానిధిం .




శ్రీ విద్యాంశివవామభాగ నిలయం,హ్రీంకార  మంత్రోజ్వలాం,
శ్రీ  చక్రాంకిత  బిందు  మధ్య  వసతిం , శ్రీమత్  సభా నాయికాం    ,
శ్రీమత్ షణ్ముఖ    విఘ్న రాజ  జననీం ,శ్రీమత్ జగన్  మోహినీం ,
మీనాక్షీం    ప్రణతోస్మి  సంతతమహం ,కారుణ్య  వారానిధిం.



శ్రిమత్ సుందరనాయికాం,భయ హరాం , జ్ఞాన  ప్రదాం  నిర్మలాం ,
శ్యామాభాం  కమలాసనార్చిత పదాం ,నారాయణస్యానుజాం   , 
వీణా  వేణు    మ్రుదంగ వాద్య   రసికాం ,నానావిధామంబికాం 
మీనాక్షీం    ప్రణతోస్మి  సంతతమహం ,కారుణ్య  వారానిధిం.



నానా యోగి  మునీంద్ర హృత్సువసతీం ,  నానార్థ  సిద్ధి ప్రదాం,
నానా పుష్పవిరాజితాంఘ్రి యుగళం , నారయణె  నార్చితాం   ,
నాదబ్రహ్మయీమ్   పరాత్పరతరాం ,   నానార్థ    తత్వాత్మికాం  
మీనాక్షీం    ప్రణతోస్మి  సంతతమహం ,కారుణ్య  వారానిధిం.




నాన్నగారు,ఎప్పుడు ఈ స్తోత్రం చదువుతూ ఉండేవారు,
అమ్మేమో తన పని   చేసుకుంటూనే  పాడుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరూ మా మనసుల్లో ప్రతి రొజూ మెదులుతూనే ఉంటారు. పాట రూపం లో, పరమాత్మ స్తోత్రాల రూపంలో 



Friday, September 23, 2011

మన స్వతంత్ర భారత

 మన స్వతంత్ర భారత కేతనమ్ము నెత్తి నడువరా 
 కటి బిగించి రిపు ధాటిని కాలరాచి నిలువరా
ఆర్ధిక సమతా ఘంటికా అల్లదిగో మ్రోగేరా 
 అందరామొక కుటుంబమై ఆనందము కనవలేరా 
  మాట సమైక్యతా నినాదమే మనకు బలమురా 
 గత చరిత్ర తలచి జగదిగాంతము నేడు  కనుమురా 
 ఉదయోజ్వాల భాస్కర కిరణోదంచితమ్ము రా    
నభం భువన మానవాభ్యుదయ  విజయమదే మనకు శుభం 
మన స్వతంత్ర భారత కేతనమ్ము నెత్తి నడువరా

Sunday, September 18, 2011

నా తెలంగాణా కోటి రతనాల వీణ( నాగేటి సాల్లల్ల)

                                           నందిని సిద్దారెడ్డి గారి పాట

 పల్లవి         నాగేటి   సాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా, 
                 నవ్వేటి బతుకుల్ల ,నా తెలంగాణా నా తెలంగాణా
                 పారేటి నీల్లల్ల పానాదులల్ల , పూసేటి పూలల్ల, పునాసలల్ల ,
                 కొంగు సాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా, 
                 పాలు తాపిన తల్లి నా తెలంగాణా.నా తెలంగాణా 
చరణం   ౧. తంగేడు పువ్వుల్లు, తంబాలమంతా , 
                 తీరొక్క రంగుల్లతీర్చినాపువ్వు , 
                 బంగారు చీరలు బాజారులన్నీ 
                బతుకమ్మ పండుగా నా తెలంగాణా  నా తెలంగాణా,
               బంతి పువ్వుల తోట నా తెలంగాణా నా తెలంగాణా
 చరణం ౨. కొత్తా బట్టలు కట్టి కొటీ ముచ్చట్లు ,
               పాలా పిట్టల జుసీ పడుచు సప్పట్లు , 
               జొన్నాకర్రల జెండా జోరున్నదేమి
               అలై బలై తీసే నా తెలంగాణా , నా తెలంగాణా
               జమ్మి ఉంచిన ఆర్తి నా తెలంగాణా నా తెలంగాణా ..
చరణం ౩ .మోటా గొట్టిన రాత్రి మొగీనా పాటా ,
              తాడూబెనిన తండ్రి తలుపులున్నప్పు ,
              కల్లముడ్చిన అవ్వా కలలొనీ గింజా , 
              ఆరుగాలం చెమటా , నా తెలంగాణా నా తెలంగాణా 
             ఆకలి దప్పుల మంటా నా తెలంగాణా నా తెలంగాణా 
చరణం౪. ఏరు  గాచే తల్లీ ఉరిమి జూడంగా, 
              బువ్వాలేని తల్లీ బోనామొండింది,
              సేను కొచ్చిన పురుగు సెరిగీ పోసింది ,
             బోనాలా పండుగా నా తెలంగాణా నా తెలంగాణా, 
             శివ సత్తులా ఆట నా తెలంగాణా నా తెలంగాణా 
చరణం 5 బురుజు గోడల పొగరు మెడలు వంచంగా ,  
              గుట్లల్ల సెట్లల  , గోగు(పుంటి) పువ్వుల్ల , 
              సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల ,
               పానామిచ్చిన వీరా కధలూ పాడంగా,
              గోరువొంకల(తూ ర్పున పొడిచే)పొద్దు ,నా తెలంగాణా నా తెలంగాణా 
              గోరింకలా(పాలాపిట్టల ) సభలు నా తెలంగాణా నా తెలంగాణా 
 

Monday, September 12, 2011

at parliament, in tha chamber of sushma swaraj on 2-9-2011

       ఆత్మహత్యలని ఆపాలని , ఆ దిశగా మనుషులలో మనో ధైర్యం, స్థైర్యం నింపాలని ఆదిశగా మా సంస్థ ప్రయత్నంలో భాగమే సుష్మ స్వరాజ్ గారి తో  న్యూ దిల్లి లో ఆవిష్కరింప జేసిన ఆయుష్మాన్ భవ పోస్టర్లు సుష్మ స్వరాజ్ గారి ఎడమ పక్కన శ్రీమతి అరుణ,ఆ    ప్రక్కన జయ భారతి,, కుడి ప్రక్కన రజిత.


జయభారతి