Monday, August 1, 2011

          గొల్ల  కలాపం 


శ్లోకం       ;;శ్రీ మీరన్ తన కే ళికాగ్గృహంబునన్ సీతా సమేతుండవై,
                క్షేమంబోప్పగ నిద్ర జెంది కలలో శ్రీరామ రక్షా సమాం

                గొల్లా భామా వచ్చేనూ చల్లో యనీ గొల్లా భామా వచ్చేనూ 
                గొల్లా భామా వచ్చే కొండా సీమలా నుండీ ,
                ఎల్లా లోకము లందు చల్లా లమ్మూ కొనుచూ 
                గొల్లా భామా వచ్చేనూ
గొల్ల భామ: చల్లో యమ్మ చల్ల, పెరుగో యమ్మ పెరుగు, పాలో యమ్మ పాలు 
                
                రామా నామామూ దిద్దుకూ ,తన లోన తానూ 
                నీమాములను దీర్చుకూ , దేవరా కొండా స్వామి నెననీ పల్కూచూ 
                వచ్చేటీ  వే ళా, పండు వెన్నెలా రేలా , పసిడీ దివ్వెలా చాయా 
                దిండీ గణపతీ తోడా , దండాము లిడు కొనూచూ//గొల్ల//
గొల్ల భామ: చల్లో యమ్మ చల్ల, పెరుగో యమ్మ పెరుగు, పాలో యమ్మ పాలు    
అయ్యవారు.: గొల్లలము, గొల్లలము అంటావు , ఎర్ర గొల్లలో, నల్లగొల్లలోవివరముగా చెప్పవే గొల్లభామా 
గొల్ల భామ; ఆ అయ్యవారు, చెబుతాను వినండి 
                 ఎర్ర గొల్లల గాము, ఎపి గొల్లల గామూ , 
                 నల్ల గొల్లల గాము నరుల గాము   
అయ్యవారు,:మరి ఏ గొల్లలో ఎరుక చేసి చెప్పవెవ్ గొల్ల భామా  
గొల్ల భామ;   ఆ అయ్యవారు, చెబుతాను వినండి 
                 జ్ఞానా గొల్ల వారామూ ,సుజ్ఞానము గా తెలియరయ్యా 
                 జ్ఞానా గొల్ల వారామూ, జ్ఞానాజ్ఞాను లాకూ విజ్ఞానమును తెలిపేటి దివ్య
                 జ్ఞానా గొల్ల వారామూ,

అయ్యవారు; చల్ల, చల్ల అంటున్నావు, ఎక్కడి నుండి తెచ్చినావో,
                 మీ చల్ల ప్రాశస్త్య మేమిటో వివరించవే గొల్లభామా, 

గొల్ల భామ; ఆహా అయ్యా వారూ, 

                పెరుగు తరచిరో యమ్మ లారా, ఆ పెద్దలు ముందుగ   
                పెరుగుతరచీరో యమ్మ లారా, పెరుగు తరచిరీ పెద్దలు ముందుగ,
                తరచగ మృదుతర ధ్వని వినిపించగ,


 అయ్యవారు: భలే దానివే గొల్లభామా అంతటి గొప్ప వాళ్ళు 
                   తరచిన చల్ల ఎవరెవరు కొన్నారో,వివరంగా చెప్పవే గొల్ల భామా 

  గొల్ల భామ;;;               ఆ అయ్యవారు, చెబుతాను వినండి. 
                                                                                


                                                                                 సశేషం

No comments: