Sunday, August 28, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

          నాకు ఉహ తెలిసినప్పటి నించి కూడా మా ఇంట్లో వినాయకుడిని స్వయం గా మట్టి తో తయారు చేసి పూజించడం అలవాటు చేసుకున్నాను నేను. ఏదేన ఒక సారి అలా చేయలేక పొతే ఆ ఏడు మా పండగ మొత్తం అసంతృప్తి గాగడిచిపోయినట్లు అనిపిస్తుంది. పోయిన ఏడాది మా బొజ్జ గణపయ్య ని ఇలా తయారు చేసి పూజ చేసాం . మరి ప్రతి సారీ చేసిన వన్నీ పెట్టలేక పోయాను. ఫోటో తీయక కొన్ని, బ్లాగ్ అప్పట్లో వ్రాయక పోయడం వల్ల అలా అశ్రద్ధ అయిపొయింది. ఇప్పట్నించి మీరు అందరు కూడా మట్టివినాయకుడినే పూజించండే. మరి మీ కు అందరికి 
వినాయక చవితి శుభాకాంక్షలు. 

Wednesday, August 10, 2011

మనసా స్మరామి

                                        కాలక్షే పొ న కర్తవ్యహ
                                        క్షీణ మాయుర్దినేదినే
                                        దేహస్య పతనం వీక్ష్య
                                        కర్తవ్యం హరి కీర్తనం


                                       కరార విందేన  పదారవిందం
                                       ముఖార విందె వినివేశయంతం
                                       వటస్య పత్రస్య పుటే శయానం
                                       బాలం ముకుందం మనసా స్మరామి    


 

Monday, August 1, 2011

          గొల్ల  కలాపం 


శ్లోకం       ;;శ్రీ మీరన్ తన కే ళికాగ్గృహంబునన్ సీతా సమేతుండవై,
                క్షేమంబోప్పగ నిద్ర జెంది కలలో శ్రీరామ రక్షా సమాం

                గొల్లా భామా వచ్చేనూ చల్లో యనీ గొల్లా భామా వచ్చేనూ 
                గొల్లా భామా వచ్చే కొండా సీమలా నుండీ ,
                ఎల్లా లోకము లందు చల్లా లమ్మూ కొనుచూ 
                గొల్లా భామా వచ్చేనూ
గొల్ల భామ: చల్లో యమ్మ చల్ల, పెరుగో యమ్మ పెరుగు, పాలో యమ్మ పాలు 
                
                రామా నామామూ దిద్దుకూ ,తన లోన తానూ 
                నీమాములను దీర్చుకూ , దేవరా కొండా స్వామి నెననీ పల్కూచూ 
                వచ్చేటీ  వే ళా, పండు వెన్నెలా రేలా , పసిడీ దివ్వెలా చాయా 
                దిండీ గణపతీ తోడా , దండాము లిడు కొనూచూ//గొల్ల//
గొల్ల భామ: చల్లో యమ్మ చల్ల, పెరుగో యమ్మ పెరుగు, పాలో యమ్మ పాలు    
అయ్యవారు.: గొల్లలము, గొల్లలము అంటావు , ఎర్ర గొల్లలో, నల్లగొల్లలోవివరముగా చెప్పవే గొల్లభామా 
గొల్ల భామ; ఆ అయ్యవారు, చెబుతాను వినండి 
                 ఎర్ర గొల్లల గాము, ఎపి గొల్లల గామూ , 
                 నల్ల గొల్లల గాము నరుల గాము   
అయ్యవారు,:మరి ఏ గొల్లలో ఎరుక చేసి చెప్పవెవ్ గొల్ల భామా  
గొల్ల భామ;   ఆ అయ్యవారు, చెబుతాను వినండి 
                 జ్ఞానా గొల్ల వారామూ ,సుజ్ఞానము గా తెలియరయ్యా 
                 జ్ఞానా గొల్ల వారామూ, జ్ఞానాజ్ఞాను లాకూ విజ్ఞానమును తెలిపేటి దివ్య
                 జ్ఞానా గొల్ల వారామూ,

అయ్యవారు; చల్ల, చల్ల అంటున్నావు, ఎక్కడి నుండి తెచ్చినావో,
                 మీ చల్ల ప్రాశస్త్య మేమిటో వివరించవే గొల్లభామా, 

గొల్ల భామ; ఆహా అయ్యా వారూ, 

                పెరుగు తరచిరో యమ్మ లారా, ఆ పెద్దలు ముందుగ   
                పెరుగుతరచీరో యమ్మ లారా, పెరుగు తరచిరీ పెద్దలు ముందుగ,
                తరచగ మృదుతర ధ్వని వినిపించగ,


 అయ్యవారు: భలే దానివే గొల్లభామా అంతటి గొప్ప వాళ్ళు 
                   తరచిన చల్ల ఎవరెవరు కొన్నారో,వివరంగా చెప్పవే గొల్ల భామా 

  గొల్ల భామ;;;               ఆ అయ్యవారు, చెబుతాను వినండి. 
                                                                                


                                                                                 సశేషం