Friday, February 26, 2010

పుట్టపర్తి సత్యసాయి బాబా---ఏ సేవ సేయగ

 
     కొన్నేళ్ళ క్రితం సంక్రాంతి సందర్భం గా కాస్త ప్రశాంతత  కావాలనిపించి, ఒక పది రోజుల పాటు ప్రశాంత నిలయానికి వెళ్ళాను. నాకు ఒక పధ్ధతి లో పూజలు చేయడం కాని, ఉపవాసాలు చేయడం కానీ రాదు. ఒంటరిగా కళ్ళు మూసుకుని ప్రార్ధించడం  తప్ప. భయమేసినప్పుడు, మొండిగా నాతొ రమ్మని .మారాము చేస్తాను, నాకు ఇంతవరకు  , కష్టమనిపించి, మనసారా వేడుకుంటే దేవుడు సహాయమే చేసాడు. 
    మాములుగా ఒక మంచి సినిమా చూస్తేనే స్నేహితులతోటి, ఇంట్లో వాళ్ళతోటి మరి,మరి  చర్చించు కుంటామే , అలాంటిది, ఈ  సృష్టి కి మూలమైన ,సమాజాన్ని,తను ఉన్నానన్న ఒకే ఒక్క భావన  తో అదుపులో ఉంచుతున్న (నమ్మకం ఉన్నవాళ్ళకి)  ఆ దేవుడు, మనకి ఏ భావన కలిగించినా పంచుకోవడం లో అభ్యంతరం లేదనిపించింది.


   భక్తు లందరితో బాటే నేను కూడా సాయిబాబా దర్శనం కోసం హాలు లో కూర్చున్నాను. అర గంట అయినాక స్వామి మెల్లిగా హాలు లోకి రావటం . అందరితో బాటే నేను కూడా స్వామి ఆశీర్వాదం కోసం ఆత్ర్తగా చూస్తున్నాను. రెండు క్షణాలు ఐతే  స్వామి  నా  తల మిద చేయి పెట్టి ఆశిర్వదిన్చేవారే, 

     ప్రాప్తాన్ని నమ్ముతాన్నేను. లిప్త లో స్వామి నన్ను పట్టించుకోకుండా నే వేరే వాళ్ళకేసి చూస్తూ, ముందుకు వెళ్ళిపోయారు. ఆ క్షణం లో నా మనసులో కలిగిన బాదే,ఒక పాటగా ప్రవహించింది. నాలో నేనే ఎప్పుడు పాడుకుంటూ ఉండే దాన్ని.


   నిన్న మా ఇంటికి స్నేహితులు  వచారు. . సరదాగా   కాసేపు గడిచినాక అందరు ఆటలు,పాటలు అయినాక నన్ను కూడా పాడమన్నారు.  ఎందుకో స్వామి మిద పాడాలని అనిపించి ఈ పాట పాడాను  .అంటే అందరు చాలా బాగుంది అన్నారు. మా సోనీ ఐతే  పబ్లికైజ్జ్ చేయాలిసినంత బాగుంది అంటూనే  పాట  రాసుకుంది . అందరికి అందుబాటులో ఉంటుందని ఇవ్వాళా బ్లాగ్ లో వ్రాస్తున్నాను. 


ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ

సెల వీయ మని నిన్ను నిరతము వెడితే
చిరు నవ్వుతో నీవు మరపించేడవు స్వామి     //ఏ సేవ సేయగ   //


అల్లంత దురాన  అగుపించి
మా ఉల్లము రంజిల్ల భాషించి
మనసులలో మరి,మరి-మరిమరి
మరిమరివేడినా
చిరు నవ్వుతో నీవు మరపించేడవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే

ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని
ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని 
మరిమరివేడినాచిరు నవ్వుతో నీవు
మరపించేడవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //
     
     స్వామి మన మధ్యన ఇక పైన ఒక అనుభూతిగా ,ఒక ఆత్మా జ్ఞానం గా, ఒక ప్రేమ గా ఒక భజనగా ఒక భావం గా మిగిలి పోతారు. దేహి గా ఆయన మనలోనే,మనతోనే సదా నిలిచి ఉంటారు.  







ఎగురవే ఝెండా


ఎగుఎగురవే ఎగురవే ఎగురవే ఝెండా
ఎగురవే ముచ్చటగ మువ్వన్నె ఝెండా
ఎరుపు నీలో నిలిచి కలిమి మాలో నిలిపె
కలిమి బలిమి తోటి కలిసిమెలిసుంటాము //ఎగురవే //

తెలుపు నీలో నిలిచి శాంతి మాకందించె
శాంతి కాముకులమై శాంతి నిలిపేము
శాంతితో కాంతి తో దివ్వెలై వెలిగేము//యెగురవే//

హరిత వర్ణము నీదు ఆత్మ విలసిల్ల
సస్య శ్యామలమైన నవజగతి మీదిగా
జగమెల్ల హరితమై జనమెల్ల నవత
నవ ప్రభంజనమై నవ మహోదయ మీయ /యెగురవే//

ధర్మ చక్రము నీదు హ్రదయమై ఒప్పార
జనత జాగ్రతి తోడ జగమంత విప్పార
ఎరుపు తో పసుపు తో హరితశ్యామలము తో
ఢర్మచక్రము దాల్చి ధరణి నెలగ ఎపుడు /యెగురవే//
( యీ పాట రచన సుసర్ల జయభారతి.)
 

స్వేఛ్ఛా జీవి

ఆకాశం లో యెగిరే       
 
విహంగాన్ని నేను
దేన్ని యెవరాపదలచినా
నా పయనం ఆగదు.

పారిపోతున్న సూరీణ్ణి
వెంటాడే రాత్రినీ
బంధించలేనినాడు

గుండెగడియారపు చప్పుళ్ళు
ఆగిపోయినా
గోడ గడియారపు బాహువులు
కాలాన్ని బంధిస్తాయి

అప్పుడూ నేను ఎగురుతూనే ఉంటాను
సూర్యునికి దగ్గరగా- వేడిలో
చంద్రునికి దగ్గరగా- శిశిరపు వొడిలో

గలగల పారే సెలయేటిని
ఆనకట్టలు ఆపినా
అంతెత్తునుంచి దుమికే
జలపాతపు నాలుకల్ని
గ్రీష్మం మింగేసినా

పాత బానిసత్వాలు రాలిపోయి
క్రొత్త నిరాశా నిస్పృహలు చేరువైనా
నిరంతరం ఎగురుతూనే ఉంటాన్నేను

దేనికీ క్రుంగిపోవద్దనీ
దేనికిలొంగిపోవద్దనీ

సందేశపు ఝండా పట్టుకుని
చైతన్యాన్ని బోధిస్తూ
స్వేఛ్ఛగా రెప రెప లాడుతుంటాన్నెను.

Thursday, February 25, 2010

ఈ రోజు ఏం జరిందంటే

       నేను ఈ మధ్యకాలం లో బాధ్యత లన్నీపూర్తి చేసుకోడం వల్లనేమో చాలా తీరిక సమయం దొరుకుతోంది. అంది నా వేలువిడిచిన చెల్లి 

       ఈ మధ్యనేఅది  కూతురికి, కొడుక్కీ కూడా వెంటవెంట నే పెళ్ళిళ్ళు చేసి , కొడుకుని అమెరికా కీ, కూతుర్ని అత్తవారి యింటికి  పంపించాక   ఏం తోచక ఒక సారి కలుద్దామని నా దగ్గరకి   వచ్చింది.
      సాధారణం నేను ఇంటిదగ్గర వాళ్లకి కలవడం అరుదు. ఒంట్లో బాగా లేక సెలవ లో ఉండడం వల్లా కలిసి వెళ్దామని వచిన్డది.  ఈ మధ్యన ఎమీ విశేషాలే లేవే మాట్లాడు కోవడానికి  ఏమి తోచట్లేదు అంటూ .
        మాటల మధ్యలో మా సంభాషణ గోరుమిటి లు  తయారుచేయటం గురించి మళ్ళింది. అప్పుడే వచ్చిన మా చెల్లి,    గోరుమిటి లు ఎలా చేస్తారూ ? నాకు అవ్వి చాలా ఇష్టం అంది.
      దానికి అదివెంటనే దాంట్లో ఏముంది, ఇప్పుడే చేద్దాం అంది. మొత్తానికి మా చెల్లి కోరికా,  గోరుమిటి లు అన్న పేరు అప్పుడే కొత్తగా విన్న నాకు అదేంటో చూడాలన్న ఆశా కలిసి వెంటనే పని మొదలుపెట్టాం .
       గోరుమిటి లు తయారు చేయడం చివర్లో ఉండగానే తెలంగాణా సకినాలవైపు మా సంభాషణ మళ్ళింది.
      అక్కడే ఆడించి ఉన్న సకినాల పిండి పని కూడా నేర్పించాలనే ధ్యాస లో ఆ పిండి లో నువ్వులు, వాము వేసి, కలిపి, ఓపిగ్గా బట్ట పరిచి చుట్టారు. కాసేపైనాక అవి ఆరినాయని నిర్ధారించుకుని మరుగుతున్న  నూనె లో సకినాలు వేయించటం మొదలెట్టేరు. ఇంతలో ఎవరో వస్తే నేను ఒక నిమిషం బయటకి వచ్హాను .
     ఇంతలో వంటింట్లోంచి  చిన్న సైజు పేలుళ్లు వినిపించాయి. వెళ్లి చూద్దును కదా మా చెల్లి, తనూ కూడా వంటింటి గుమ్మం బయటకెళ్ళి నించున్నారు.
    ఏం సంగతని అడిగి, నేను కూడా ట్రై చేస్తానని చెప్పి రెండు సకినాలని నూనెలో వేసి, అవి వేగాగానే గర్వం గా చుడండి, మీరూ వేసారు, నెనూ అంటుండగానే థపీ థపీ మన్టూ  నా మొహమ్మీదకి రెండుసకినాలు పేలి, మొహం, మూతి ,రెండు చెతులూ వగైరా బొబ్బలేక్కినై. ఒక ఉరి కధ సినిమా లో నారాయణ రావు ,వాసుదేవ రావు ల జోకు గుర్తుకు వచ్చింది. .

           అయ్యయ్యో నేను వచ్చి నీకెంత పని జరిగిందే అంటూ  వెళ్ళేదాకా వాపోతూనె ఉందది
రాత్రి పదకుండు గంటలకనుకుంటాను అమెరికానించి ఫోన్ వచ్చింది నాకు. విషయం ఏమంటే నా మొహమ్మిది బొబ్బలు ఎలా ఉన్నాయా అని పరామర్శ. నా కజిన్ కి బోలెడన్ని విశేషాలే కొన్ని రోజుల పాటు.
 మా యింటి వంట సంగతేమో కానీ నా మొహం మమూలుగ  అవడానికి ఎంత టైం పడుతుందో ఏమో. దాని కష్టంపెట్టానని  నేను బాధ పడితే,   నాకు జరిగిన దానికి అది బాధ పడ్డం. వెరసి  బాదే    సౌఖ్యమనే భావన తో ఎవరింటికి వారు .ఇదండి  సంగతి.

          మొత్తానికి నేనిప్పుడు వెరీ బిజీ...................ఫోన్లె ఫోన్లు  

తేడా !

లైలా మజ్ఞూల్ని చుళ్ళేదెవరూ

అనార్కలీ ,సలీంలనూ చుళ్ళేదెవరూ

వాళ్ళని గూర్చి

గొప్పలు చెప్పె వీళ్ళే

మనల్ని చూసి

కళ్ళలో నిప్పులు పోసుకున్నారు

వాళ్లని పొగిడిన నోళ్ళ తో

మనల్ని ఆడిపోసుకున్నారు

వాళ్ళ దీ మనదీ

రెండూ ప్రేమలే ?

పోతే

మన ప్రేమకి వీళ్ళే
సమాధి కడుతున్నారు ???

Wednesday, February 24, 2010

ఆత్మాభిమానం

         
        నాకెందుకో ఈ రోజు నా చిన్నతనం లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. బహుశ అప్పుడు నేను మూడు లేక  నాలుగో తరగతి  చదువుతూ ఉన్నాననుకుంట.


         మా నాయినమ్మ గారి తద్దినానికని మా మేనత్తలు, బాబాయి లు, వాళ పిల్లలు  వచ్చారు. బహుశ    సంవస్సరీకాలనుకుంటా.  కొత్తగా కలిసిన అత్తల పిల్లలు. మేము, ఇంకేముంది ఆటలు, పాటలు . తద్దినం కాబట్టి పిల్లలనెవరినీ ఆ చాయలకి కూడా రానివ్వలేదు. పెద్దవాళ్ళు తమతమ పనుల్లో తీరిక లేకుండా ఉంటె పిల్లలు తమ ఆటల్లో మునిగిపోయాం.  భోజననికింకా చాలా టైం ఉండటం వల్లా ప్రోద్దున్నేప్పుడో తిన్న చద్దింనం ఆటల్లో అరిగిపోవడం వల్లా ఆకలి గుర్తుకు వచ్చి అందరం ఎం తిందామా అని ఎదురు చూస్తున్నాం .


     ఇంతలో మా అత్తయ్య కూతురు పళ్ళెం లో బాగా పండిన టమాటాలు కొన్ని పట్టుకుని వచ్చింది. . నేను, మా చిన్నాక్క, మా వదిన ముగ్గురము  కూచుని టమాటా ముక్కలు తరుగుతుంటే ఆశగా చూస్తున్నాను. ముక్కలు తరగటం పూర్తి అయింది   పంపకాల దగ్గరకి వచ్చేవరకు వాళ్ళిద్దరికీ  ఆరేసి ముక్కలు, నాకు నాలుగు ముక్కలు ఇచ్చారు.  నాకు  బాధ మొదలయ్యింది. వాళ్ళు పెద్దవాళ్ళు కనక నాకే ఎక్కువ ఇవ్వాలని నా అభిప్రాయం . చిన్నదాన్ని కదా, తమరీకిద్దరికీ  సమంగా రావాలని వాళ్ళ ఆలోచన. మొత్తానికి నన్ను వాళ్ళు చిన్నబుచ్చడం  నచ్చని నేను, ఆత్మాభిమానం  అడ్డు వచ్చి , వాళ్ళు నన్ను చిన్నబుచ్చడం అన్న దాన్ని భరించలేని నేను, కడుపులో ఎలకలు పరిగెడుతున్నా నాకేం వద్దనేసాను
  
         అదే చాలనుకున్న  మా వాల్లిద్దరూ గబా గబా  లగించేస్తుంటే, కావాలని మనసు  లాగుతున్న, ఆత్మాభిమానం కోసం, వదిలేసుకున్నా . కానీ ఇన్నేళ్ళు అయినా నా కు ఆ సంఘటన ఇంకా మెదులుతూనె ఉంది.  ఎర్రటి టమాటా ముక్కలు, దాని మిద చల్లిన పంచదార  కడుపులో ఆకలి  ఇవ్వెవీ నా ఆత్మాభిమానాన్ని రాజీపడనివ్వలేదు.
       

Saturday, February 13, 2010

తెలుసుకొనవె చెలీ, మాత్రమే కాదు చేలికాండ్లు కూడా వెరసి వ్యాఖ్యానించటం అనేపని చేసేవాళ్ళు అందరికి

జ్ఞాన వృద్ధులే వృద్ధులు కాని వయోవృద్ధులైనంత మాత్రాన వారు వృద్ధులు కారు .
ఎదుటి వాళ్లని ఆ ముసిల్ది, ముసలోడు అని కామెంట్ చేసేవాళ్ళు దాని అర్థం తెలుసుకుని
వ్యాఖ్యానించటం మంచిదని అనిపించటం లెదూ?

Tuesday, February 9, 2010

మనిషి

మనిషి
ఈ చలికి తట్టుకోలేక రాళ్ళు
మంచుదుప్పటే
కప్పుకున్నై

ఈ వాన ఉధ్రుతి చూచి
ప్రతితరువూ
ఆనందంతో
తలలూస్తొంది
ఈ ఎండ వేడికి తాళలేక
పురుగు, పుట్రా సైతం
సమైక్యంగా దాగి
చల్లని సాయంకాలనికై
ఎదురు చూస్తున్నై

స్వార్థపు దుప్పటీ కప్పుకుని
కుటిలపు ఆలొచనలతో
క్రుతిమపు చల్లదనంలో
విక్రుత మైన ఊహలలో
చల్లని సాయంత్రాన్ని సైతం
మరిచే పొయాడు మనిషి


జయభారతి సుసర్ల

Sunday, February 7, 2010

జనం లో మనం

జనం లో మనం
జనం లో మనం

యెన్నాళ్ళనుంచో
నిన్ను చూడాలనే ఆశ

యీ దినం నిన్ను
చూడగలిగాననే త్రుప్తి

రేపు నిన్నువీడి
మనలేనెమో అన్న భయం

వీటిమధ్య
కొట్టుమిట్టాడుతున్నాం మనం

Friday, February 5, 2010

ఒక్క క్షణం
గాలి ఆగిపోతే
ఉక్కిరిబిక్కిరయ్యే మనిషీ
నేను గాలినై
వీచకుండా ఆగిపోతాను.

ఒక్క క్షణం
వెలుగు లేనిదే నిలవలేని మనిషీ
నేను వెలుగునై
భరించలేని వేడి ని ప్రసరిస్తాను
వెలుతురు మ్రింగేస్తాను

ఒక్క క్షణం ప్రేమ లేందే
బ్రతకలేక తల్లడిల్లే
పిచ్చి మనిషీ
నేను ప్రేమనై
నీకు దురమౌతాను

అప్పుడు గాని
నీ నోరు ముతబడుతుంది
అనుభవం తోటైనా
బాధ విలువ తెలుస్తుంది
మరో మనిషిని బ్రతికిస్తుంది.

జనం లో మనం

జనం లో మనం

యెన్నాళ్ళనుంచో
నిన్ను చూడాలనే ఆశ

యీ దినం నిన్ను
చూడగలిగాననే త్రుప్తి

రేపు నిన్నువీడి
మనలేనెమో అన్న భయం

వీటిమధ్య
కొట్టుమిట్టాడుతున్నాం మనం
Posted by jaya bharathi ram at 11:09 AM 0 comments Links to this post

Tuesday, February 2, 2010

దారుణం

చిన్నారి వైష్ణవి దారుణ హత్య సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఒక ఉదంతం

. కూతురి మరణం తెలిసి ప్రాణాలు వదిలిన ప్రభాకర్ ఇంకామానవ సంబంధాలకి జీవం ఉందని రుజువు చేసుకున్న తండ్రి
. .
ఇవ్వన్నీ ప్రక్కన పెడితే ప్రతీ మగవాడూ వివాహంచేసుకునే ముందు బాగా ఆలోచించి, కష్టమైనా ఏదైనా ఒకే భార్యతోనే అని నిర్ణయించుకునే పెళ్లి చేసుకోవాలి. తర్వాతి పరిణామాలకి అతడ్ని నమ్మి వచ్చినమరొక మనిషిi జీవితాన్ని సమస్యల వలయం లోకి నెట్టివేసేహక్కు ఎవరిచ్చారు

పెద్దల ఆస్తి పాస్తుల గొడవలేవి పిల్లలకి తెలీదు. అభం,శుభం తెలిఇని పిల్ల పేరుమీద ఆస్తి పెట్టి ఆపిల్లకి బ్రతుకే లేకుండా చేసారు.
తప్పెవరిది
ఏది ఏమైనా ఇలాంటి నరహన్తకుల్ని ఏమి చేయాలి?