Saturday, March 13, 2010

జీ- వి -తం

 నెనెప్పుడూ సంతోషంగా ఉంటా((((((((((((((((((((((((((((


 నెనెప్పుడూ సంతోషంగానే ఉంటా


  నెనెప్పుడూ సంతోషంగా ఉండేందుకే ప్రయత్నిస్తా


  ఈ మూడింటి మధ్యన ఉన్న లిప్తమైన తేడా నే  జీ- వి -తం


      చిన్నప్పుడు  చాలీ చాలని సంపాదన ,  కష్టపడుతున్న నాన్నగారిని  చూసి  కోరికలు పెంచుకోక పోవడమే సంతోషం అని తెలుసుకున్నా,  ఇష్టపడ్డ ఏదైనా చూసి, సర్లే పెద్దైనాక  నేను సంపాదించుకుని ఇలాంటిది కొనుక్కుంటా.
....ఆ ఆలోచన వచినప్పుడు నేను సంతోషంగా ఉన్నాను.
   మా పక్కింటి వేదమ్మ ఒకతే కూతురు. వాళ్ళు ఆ అమ్మాయి కి     ''టిక్లీ. '' కొని పెట్టేవాళ్ళు. దాని ఖరీదు మహా ఉంటె రూపాయో, రెండో ఉండేది. దాన్ని చూసి సంతోషించే  వాళ్ళమే  కానీ కావాలని గొడవ చేసేవాళ్ళము కాదు.
మేమేప్పుడూ సంతోషంగా ఉందేవాళ్ళం
 బడికి  వెళ్ళేప్పుడు  బహుశ స్కూలు మూడు  కిలోమిటర్లు ఉంటుందేమో , పుస్తకాల సన్చీ భుజానికి వేసుకుని నడుస్తూ  ప్రార్ధన  సమయానికి  సరిగ్గా చేరుకునే వాళ్ళం.
  మా పక్కింటి కిషను బాగా గారాబం గా పెరగటం వాళ్ల రిక్షా లో వచ్చే వాడు.
మేము మళ్ళి మధ్యానం కూడా ఇంటికి భోజనానికి వచ్చి , 
బట్టలు మార్చుకుని, అన్నం తిని,కంచం కడిగి పెట్టి
మళ్ళి బట్టలు మార్చుకుని,పుస్తకాలు కావలసినవి మాత్రమే తీసుకుని
రెండుకాళ్ళ బండెక్కి హాయిగా బడికి వెళ్ళే వాళ్ళం .
ఇంత పుస్తకాల మోతా   ఉండేదికాదు, ఇప్పుడు అదే దూరానికి మా పిల్లల్ని ఆటో లో పంపుతున్నామనుకోండి ఇది వేరే విషయం.కాలానుగుణంగా  పోతున్నాం (ఇది సమర్ధించుకొవటమే)
మేము అప్పుదూ సంతోషంగానే ఉన్నాం. (కొంచం, కొంచం వివక్ష  తేడాలు తెలుస్తున్నై కనక )
ఈ కాలం లో   కొందరు పిల్లల్ని వాళ్ళు అడిగినట్లు చదివించి, కావలసినట్లు తిండి బట్ట ఇచి  తమ కడుపుని కాల్చుకుని వాళ్ళ కోరికలు తిరుస్తుంటే , వాళ్ళ ఆశలకి పెద్దల జివితాన్ని కాలరాయడానికి కూడా వెనక్కి వెళ్ళట్లేదు. వాళ్లకి వాల్లనుకున్నదే ,అప్పుడే కావాలి.( అందరిని అనడం లేదు. నేను చూసిన కొన్ని జీవితాలు ఇది
వ్రాయడానికి నన్ను పురికోల్పినై. )
నేనే ప్పుడూ సంతోషంగా ఉండేందుకే ప్రయత్నిస్తా   ఇలాంటి సమయాలలో ఇలా అనుకుంటేనే ప్రయత్నించడానికి కుదురుతుందేమో.
అనుకున్నట్లు నేననుకున్నది అనుకున్నట్లు సరిగా భావం చెప్పానో లేదో తెలియుడు. అర్ధం చేసుకోండి,

1 comment:

Anonymous said...

Your observation is fine. we have to provide opportunity to our children to know about harden-ships in their life. Otherwise they will never know what is full sphere of life. They will think what ever we ask our parents are providing, so no problem.

Once the children grow up and they will start earning at that time also they don't know priority on which they have to give more emphasis. Just spend whatever comes.Whatever their salary their savings wont be much.
I saw in my village who faced financial problem in their childhood they studied well and they well settled. Who doesn't faced any financial problems in their they are not much concentrated on their studies and got settled some how.