Wednesday, February 24, 2010

ఆత్మాభిమానం

         
        నాకెందుకో ఈ రోజు నా చిన్నతనం లో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. బహుశ అప్పుడు నేను మూడు లేక  నాలుగో తరగతి  చదువుతూ ఉన్నాననుకుంట.


         మా నాయినమ్మ గారి తద్దినానికని మా మేనత్తలు, బాబాయి లు, వాళ పిల్లలు  వచ్చారు. బహుశ    సంవస్సరీకాలనుకుంటా.  కొత్తగా కలిసిన అత్తల పిల్లలు. మేము, ఇంకేముంది ఆటలు, పాటలు . తద్దినం కాబట్టి పిల్లలనెవరినీ ఆ చాయలకి కూడా రానివ్వలేదు. పెద్దవాళ్ళు తమతమ పనుల్లో తీరిక లేకుండా ఉంటె పిల్లలు తమ ఆటల్లో మునిగిపోయాం.  భోజననికింకా చాలా టైం ఉండటం వల్లా ప్రోద్దున్నేప్పుడో తిన్న చద్దింనం ఆటల్లో అరిగిపోవడం వల్లా ఆకలి గుర్తుకు వచ్చి అందరం ఎం తిందామా అని ఎదురు చూస్తున్నాం .


     ఇంతలో మా అత్తయ్య కూతురు పళ్ళెం లో బాగా పండిన టమాటాలు కొన్ని పట్టుకుని వచ్చింది. . నేను, మా చిన్నాక్క, మా వదిన ముగ్గురము  కూచుని టమాటా ముక్కలు తరుగుతుంటే ఆశగా చూస్తున్నాను. ముక్కలు తరగటం పూర్తి అయింది   పంపకాల దగ్గరకి వచ్చేవరకు వాళ్ళిద్దరికీ  ఆరేసి ముక్కలు, నాకు నాలుగు ముక్కలు ఇచ్చారు.  నాకు  బాధ మొదలయ్యింది. వాళ్ళు పెద్దవాళ్ళు కనక నాకే ఎక్కువ ఇవ్వాలని నా అభిప్రాయం . చిన్నదాన్ని కదా, తమరీకిద్దరికీ  సమంగా రావాలని వాళ్ళ ఆలోచన. మొత్తానికి నన్ను వాళ్ళు చిన్నబుచ్చడం  నచ్చని నేను, ఆత్మాభిమానం  అడ్డు వచ్చి , వాళ్ళు నన్ను చిన్నబుచ్చడం అన్న దాన్ని భరించలేని నేను, కడుపులో ఎలకలు పరిగెడుతున్నా నాకేం వద్దనేసాను
  
         అదే చాలనుకున్న  మా వాల్లిద్దరూ గబా గబా  లగించేస్తుంటే, కావాలని మనసు  లాగుతున్న, ఆత్మాభిమానం కోసం, వదిలేసుకున్నా . కానీ ఇన్నేళ్ళు అయినా నా కు ఆ సంఘటన ఇంకా మెదులుతూనె ఉంది.  ఎర్రటి టమాటా ముక్కలు, దాని మిద చల్లిన పంచదార  కడుపులో ఆకలి  ఇవ్వెవీ నా ఆత్మాభిమానాన్ని రాజీపడనివ్వలేదు.
       

3 comments:

శ్రీకర్ బాబు said...

అబ్బో అంత చిన్నప్పుడే ఆత్మాభిమానాలు.... నిజమే! చిన్నప్పుడు మొండి పట్టుదల, మంకు పట్టు ఎక్కువగా ఉంటాయి,

మాలా కుమార్ said...

అవును , ఆ వయసులో అలా మరీ అనిపిస్తుంది . ఓలాంటి మొండితనం వస్తుంది .
పెద్దగయ్యాకైతే సర్దుకు పోతారు .

Anonymous said...

ఇది మీ చిన్నప్పటి ఘటన అని వ్రాశారు. ఇప్పుడు మీరలా లేరని ఆశిస్తాను. ప్రతి చిన్నవిషయానికీ ఆత్మాభిమానం చూపడం మంచి లక్షణం కాదు. కొన్నిసార్లు మనం దిగిరావడం వల్లనే అవతలివారు కూడా దిగొస్తారు.