Tuesday, February 2, 2010

దారుణం

చిన్నారి వైష్ణవి దారుణ హత్య సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఒక ఉదంతం

. కూతురి మరణం తెలిసి ప్రాణాలు వదిలిన ప్రభాకర్ ఇంకామానవ సంబంధాలకి జీవం ఉందని రుజువు చేసుకున్న తండ్రి
. .
ఇవ్వన్నీ ప్రక్కన పెడితే ప్రతీ మగవాడూ వివాహంచేసుకునే ముందు బాగా ఆలోచించి, కష్టమైనా ఏదైనా ఒకే భార్యతోనే అని నిర్ణయించుకునే పెళ్లి చేసుకోవాలి. తర్వాతి పరిణామాలకి అతడ్ని నమ్మి వచ్చినమరొక మనిషిi జీవితాన్ని సమస్యల వలయం లోకి నెట్టివేసేహక్కు ఎవరిచ్చారు

పెద్దల ఆస్తి పాస్తుల గొడవలేవి పిల్లలకి తెలీదు. అభం,శుభం తెలిఇని పిల్ల పేరుమీద ఆస్తి పెట్టి ఆపిల్లకి బ్రతుకే లేకుండా చేసారు.
తప్పెవరిది
ఏది ఏమైనా ఇలాంటి నరహన్తకుల్ని ఏమి చేయాలి?

5 comments:

పరిమళం said...

అతి హేయమైన మానవ మృగాలకి ఎ శిక్ష విధించినా అది తక్కువే !

Saahitya Abhimaani said...

Main reason for this kind of horrendous crimes perpetrated is that there is no fear of punishment thanks to those so called human rights activists ensuring that there is no capital punishment and shameless lawyers who will argue in any manner for the money paid to them.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఏకపత్నీవ్రతానికీ ఈ సంఘటనకీ సంబంధం లేదనుకుంటా. ఏకపత్నీవ్రతుల ఇళ్ళలో కూడా ఇలాంటి సంఘటనలు జఱుగుతూనే ఉంటాయి. కుబేరులకి ఇద్దఱు ముగ్గుఱు భార్యలుండడం ప్రపంచంలో మామూలే. కానీ అన్నిచోట్లా ఇలా జఱగదు.

తెలుగు వెబ్ మీడియా said...

రెండవ భార్య మీద వ్యామోహంతో మొదటి భార్య పిల్లలని నిర్లక్ష్యం చేసేవాళ్ళని నా జీవితంలో కూడా చూశాను. రెండవ భార్యలుగా వెళ్ళేవాళ్ళు మగవాడి డబ్బుని చూసే పెళ్ళి చేసుకుంటారు కానీ అతని మీద ప్రేమతో పెళ్ళి చేసుకోరు.

bloggerbharathi said...

naa jeevitam lo kuda chusanu anadam kante nenu kuda chusanu anadam sariyainademo alochinchandi