Tuesday, January 26, 2010

బస్సులోంచి బయటకి ఉమ్మేసారు

నిన్న మధ్యాన్నం అనుకుంటాను ఒక అతను బాగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని టక్ చేసుకుని బైకే మీద వేగంగా వెళ్తున్నాడు. నేను సిటీ బస్సు లోంచి బయటకి
చుస్తూ అనుకున్నాను ఎంత హడావుడి గా వెళ్తున్నడా అని మధ్య మధ్య లో ఫోన్ మట్లాడుతూ పది నిముషాల్లో చేరుకుంటానని చెబుతున్నాడు. చూస్తుండగానే మా బస్సులోంచి శుభ్రంగా నమిలిన గుట్కా పాన్ ఎవరో
తుపుక్కున బయటకి ఉమ్మేసారు. ఫోన్ ముగించి చూసుకున్న అతని తెల్ల చొక్కా కాస్తా రంగు మారిపోయి ఆఫీసు
కే కాకుండా రోడ్ మీద నడవడానికి రాని పరిస్టితి. అతన్ని చూస్తుంటే చాలా బాదః గా అనిపించింది. కానీ ఏమి చేవ్యలేని అసహాయ పరిస్టితి
తర్వాత రెండు మూడు రోజులకు మళ్ళి అతడు నేను ఎక్కిన బస్సు లోనే కనిపించాడు.

నేనే ఎం జరిగిందని పలకరించాను . అతను చెప్పిన మాట విని చాలా బాధ వేసింది, ఆ రోజు అతను ఇంటర్వ్యూ కి ఫైనల్ గా వెళ్తున్నాడు. ఆ రోజు క్లియర్ ఐతే అతడి లైఫ్సెటిల్ అయినట్లే
     కానీఆ రోజు జరిగినదానివల్లా ఇంటర్వ్యూ కి వెళ్ళలేక పోయాడు . నన్నేం చెప్పమంటారు?అజాగ్రత్త, నిర్లక్ష్యం ఖరీదు
ఒక జీవితం అని తెలుసుకోవాలి

6 comments:

జయ said...

మనుషుల్లో సంస్కారం ఎప్ప్టికి పెరుగుతుందో తెలియట్లేదు. ఈ విధంగా నాకే అయితే ఎలా ఉంటుంది అని ఒక్క సారి అలోచించుకుంటే మళ్ళీ ఎప్పటికి ఇటువంటి అసహ్యమైన పనులు చేయరు.

తెలుగు వెబ్ మీడియా said...

సంస్కారంలో చదువుకున్నవాళ్ళకీ, చదువురానివాళ్ళకీ తేడా ఏమీ లేదు. మా అమ్మమ్మ గారు ఉండేది పల్లెటూరిలో. వాళ్ళ ఇంటికి చెప్పులు వేసుకుని వెళ్ళినా గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి. అంత పరిశుభ్రత వాళ్ళది. వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ఇంటికి వచ్చినవాళ్ళు గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కుంటారు. వైజాగ్ RTC కాంప్లెక్స్ దగ్గర గోడ మీద ఇక్కడ ఉచ్చలు పొయ్యరాదు అని వ్రాసినా పట్టించుకోని సంస్కార రహితులని ఏమనుకోవాలి?

Anonymous said...

అయ్యో పాపం !
అలాంటి వెధవల బాధ తట్టుకోలేకే చాల అపార్ట్మెంట్లల్లో , కాంప్లెక్స్ ల్లో మూలలకీ వివిధ మతాలకి చెందిన దేవుడి బొమ్మలు పెట్టడం మొదలెట్టారు కొంత కాలం క్రితం. ఇప్పుడు రోడ్ల మీద, వేసుకొనే బట్టల మీద ఏమేసుకోవాలి ప్చ్!
అస్సలు, ఆ వెధవల ఫోటోలు తీసి సులభ్ కాంప్లెక్స్ ల్లో పెడితే సరి.

తెలుగు వెబ్ మీడియా said...

ఒక చిల్లర వ్యాపారి కూడా తన దుకాణానికి దగ్గర్లో దేవుడి బొమ్మలు పెట్టాడు. దారినపోయేవాళ్ళు అక్కడ ఉచ్చలు పొయ్యడం, ఉమ్ములు వెయ్యడం మానేసి దేవుని ఫొటోలకి దండం పెట్టడం మొదలు పెట్టారు. ఆ వ్యాపారి అక్కడ హుండీ కూడా పెట్టాడు. రోజూ హుండీ నిండా డబ్బులు వస్తున్నాయి. ఆ వ్యాపారికి తన దుకాణం చుట్టుపక్కల ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడడంతోపాటు, హుండీ ఆదాయం కూడా లాభం కలిగించింది.

మాలా కుమార్ said...

చదువులు , సంపాదన సంస్కారాన్ని ఇవ్వవు. అవి స్వతహా రావలసిందే . హుం.

తెలుగు వెబ్ మీడియా said...

అదృష్టం ఏమిటంటే నా షాప్ పక్కన ఖాళీ స్థలం లేదు. దేవుడి ఫొటోలు పెట్టకపోయినా ఎవరూ మూత్రాలు పొయ్యరు, ఉమ్ములు వెయ్యరు. ఖాళీ జాగ పక్కన షాప్ ఉన్నా, ఇల్లు ఉన్నా కంపు కొడుతుంది.