Friday, October 10, 2008

ఫూజ పాట

నిరాకార నిరంజనానీకు హారతీ
మా సీతా రాములకూ మనసు హారతీ, నామనసు హారతీ
నా మనసు హారతీ //నిరాకార//
ఆహమనే గుణము నీకు ఆవహన చేసినాను
అశ అనే గుణము నీకు ఆసన మమరించినాను //నిరాకార; //

తామసమనే గుణము నీకు స్నానము గావించినాను
శాంతమనే గుణము నీకు సేవలుగా చెసినాను //నిరాకార//

దీక్ష యనే గుణము నీకు తిలకము గా తీర్చినాను
ద్వెషమనే గుణము నీకు భూషణమమరించినాను// నిరాకార;//

స్థూల సూక్ష్మ దేహమునే చూచి చూచి కంద్ఢ్ల చూచి
కారణ హ్రుత్ కమలమనే ఘన ప్రమిదగ చెసినాను నిరాకార;

మదమచ్చర మనే గుణము,మల్లె పువుల పూజ చెసి
సందేహమనె గుణము చందనమమరించినాను // నిరాకార //

తిక్షయనే గుణము నీకు వస్త్రయజ్ఞోపవీతము చేసినాను
అజ్ఞానమనె గుణము అక్షతలు అర్పించినాను // నిరాకార //

మొహనమనె గుణము నీకు మొదమలరవత్తి చేసి ,
లొభమనె చమురు పోసి దీపము వెలిగించినాను // ని //

నీమమనె గుణము నీకు నీరాజనమిచ్చినాను
డంభమనె గుణము నీకు దర్పణ గావించినాను //ని //

అంబుజాక్షి కొన్నిగుణములాచమనామిచ్చినాను
భక్తియనే గుణము నీకు భక్షణ గావించినాను //ని //

కామమనె గుణము కై వత్తి వెలిగించినాను
దూషణమనె గుణము నీకు ధూపముగావించినాను // ని //

క్రోదమనె గుణము నీకు కర్పూరవిడెము చేసినాను
ఇఛ్ఛయనె గుణము నీకు దక్షణగావించినాను //ని//

మంచి గుణములన్ని నీకు మంత్రపుష్పమిచ్చినాను
రాగమనె గుణము నీకు భోగముచేయించినాను // ని //

ప్రెమయనె గుణమునీకు ప్రదక్షిణము చేసినాను
సాహసమనె గుణము నీకు సాష్టాంగంబిచ్చినాను //ని /

సత్యమనె గుణము నీకు చామరంబు విసిరినాను
రాజసమనె గుణము నీకు రాజోపరిచారమిదిగొ

మాయ యనె తెరనుతీసి మమతలన్ని రోసి వేసి
ప్రత్యక్షముగ చిన్మాత్రుడవై ప్రతిఫలించు రామచంద్ర // ని //

No comments: