Saturday, October 11, 2008

పేరడీ

పేరడీ
మౌనం గానే యెదగమనీ మొక్క నీకు చెబుతుందీ
యెదిగినకొద్ది ఒదగమనే అర్ధమందులో ఉంది
అప్పులుపాలైన చొటే దబ్బువిలువ తెలుస్తుందీ
దారులన్ని మూసుకు పోతే కొత్త దారి కంపిస్తుందీ
ఖర్చులెక్కు వైనాయని దిగులు పదకు నేస్తమా
క్రొత్త అప్పు దొరికె దారులు ఉన్నాయి లే
ఖర్చులెక్కు వైనాయని దిగులు పడకు నేస్తమా
క్రొత్త అప్పు దొరికె దారులు ఉన్నాయి లే
అప్పులెక్కు వవుతున్నయని బాధ పడకు నేస్తమా
అప్పు వెనక వడ్డీతంటా లుంటాయి లే

సంసార మన్నది మొదలవ గానె ఖర్చె పుట్టిందీ
ఖత్చు చెయటం మొదలవగానే
అప్పే పుట్టిందీ
యీ అప్పుచెసి బ్రతకటం లో ఆనంద నిధి ఉన్నదీ
తీర్చటం మానిన వాడికి అసలు సొంత మైపొతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ
తలచుకుంటె సాధ్యమిదీ
చెమతనీరు చిందకా నుదుతిరాత మార్చుకో
అప్పు లేని బ్రతుకే లేదనీ గుర్తుంచుకో
అప్పుమీద అప్పె చెసీ చెతిగీత మర్చుకూ
అప్పు తీర్చిన కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే వ్రాయాలీ

నీ అప్పుచెసె తెలివి చూసీ దైవాలే తరియించగా
నీ అదుగుల్లొ గుడి కట్టీ, నీ తోటివారూ పూజించగా
నీ సంకల్పానికి సమస్త జనమూ పారిపోవాలీ
అప్పు తీర్చనట్టి వారికి ఆదర్శం నువు కావాలీ

మౌనం గానే యెదగమనీ మొక్క నీకు చెబుతుందీ
యెదిగినకొద్ది ఒదగమనే అర్ధమందులో ఉంది

No comments: