Thursday, October 23, 2008

//ఓహో యత్రికుడా //

ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా
ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా
ఉదయారుణ కాంతిబింబ సదనము దేశ పయనిన్తువోహూ
 ఉదయపూర్న మృదుల గాన సుధలు చల్లి మధుపధాన

శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల
వదలి కదలి వచ్చితి వోహో //ఓఓ హోయాత్రికుడా //

ఆంధకార పూర్ణదిశా బంధనమ్ము సడలించుక
సింధువాహతురంగ మశ్చందనమ్ము గదలించుక
సింధుఫారపూర్వదిషా సుందర తీరమ్ము చేరునో యాత్రికుడా // ఓహో యాత్రికుడా //

శీతల హెమంతకాల శిధిలజీర్న పర్ణశాల
వదలికదలివచ్చితివోహోయాత్రికుడా //ఓహో యాత్రికుడా //
ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా
ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా

చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ము లూగ
చిత్ర చిత్ర కలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ
మిత్రవరా నేడు నీ పవిత్రయాత్ర సాగింతు వొహో
ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా//యాత్రికుడా//
(ఈ పాటరచయిత మరియు గాయకులు శ్రీ సాలూరి
రా జెశ్వర్ రావు గారు )

5 comments:

సుజాత వేల్పూరి said...

జయభారతి గారు,
చాలా అద్భుతమైన పాట. నా దగ్గరుండాలి రికార్డ్. పోతే ఈ పాటని రాసుకున్నది రాజేశ్వర రావు గారే! రేపు, అంటే అక్టోబర్ 25 న ఆయన తొమ్మిదో వర్థంతి! మంచి నివాళి ఘటించారు.

దిన్నెల కృష్ణ కుమార్ said...

You can hear a wonderful radio program on saluri garu at radio.maganti.org . Many beauties of saluri garu were played in that broadcast along with this song.

Amar said...

nice work . Weldon.

Anonymous said...

రాజేశ్వరరావు గారి అదోవిధమైన గొంతుక ఈ పాటల్లో మరచిపోలేను. ఏదో వార్ ట్యూన్* లా సాగే ఈ పాట అధ్బుతంగా వుంటుంది.
మరో పాట ' పాట పాడుమా కృష్ణ, పలుకు తేనె లొలుకునటుల ' ఇందులో 'సామవేద సారము సంగీతము సాహిత్యమెగా ఆ..ఆ..ఆ.' అనే చోట ఎంత హాయిగా అంటారో!
" ఆ తోటలోనొకటి ఆరాధనాలయము , ఆలయము గోడపై అందగాడెవరే " అనే పాటలో ఎంత అలవోకగా పల్లెపడుచు హొయలొలికిస్తారో ...

మీ అభిరుచి బాగుంది.

bloggerbharathi said...

మీ వ్యాఖ్య నన్నెంతో ప్రోత్సహించింది.పాట పాడుమా కృష్ణ, పలుకు తేనె లొలుకునటు, ఆతోటలోఅన్న
పాట నా దగ్గరుండాలి , వెతికి వ్రాస్తాను