Sunday, January 17, 2010

అమ్మ దొంగా నిన్ను

అమ్మ దొంగా నిన్ను
చూడకుంటే నాకు బెంగా //అమ్మ దొంగా నిన్ను //

కొంగట్టుకు తిరుగుతూ
ఏవో ప్రశ్న లడుగుతూ
కిలకిల మని నవ్వుతూ
కాలం గడిపే నిన్ను
చూడకుంటే నాకు బెంగా //అమ్మ దొంగా నిన్ను

కథ చెప్పేదాకా కంట నిదుర రాకా
కథ చెప్పేదాకా నన్ను కదలనీకా
మాట తోచ నీకా
మూతిముడిచి చుసెవూ //అమ్మ దొంగా నిన్ను//

ఎపుడో ఒక అయ్యా నిన్ను ఎగరేసుకుపోతే
నిలవలేక నా మనసూ నీ వైపే లాగితే
గువ్వ ఎగిరిపోఇనా గూడు నిదుర పోవునా //అమ్మ దొంగా నిన్ను//

నవ్వితేనీ కనులా ముత్యలూ రాలూ
ఆ నవ్వే నిను వీడక ఉంటె అది చాలూ
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలం నీ బ్రతుకూ కలల దారి నడవాలీ వూ //అమ్మ దొంగా నిన్ను//

4 comments:

Valli said...

మా అమ్మ ఇప్పుడు అదే అంటూంది అత్తా. "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా అని".
నీ బ్లాగులన్నీ చదివాను. బాగున్నాయి. అమ్మకి కూడా చూపించాను.

-వల్లి సుసర్ల

ప్రేరణ... said...

నాకు చాలా ఇష్టమైన పాట.
మా అమ్మాయిని మిస్ అవుతూ UKలో వున్న తనకి మెయిల్ చేసాను ఈ పాటను.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.