Sunday, September 30, 2007

Spitting from the bus...where the civilisations goes?

        నిన్న మధ్యాన్నం అనుకుంటాను ఒక అతను బాగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని టక్ చేసుకుని బైకే మీద వేగంగా వెళ్తున్నాడు. నేను సిటీ బస్సు లోంచి బయటకి చుస్తూ అనుకున్నాను ఎంత హడావుడి గా వెళ్తున్నడా అని మధ్య మధ్య లో ఫోన్ మట్లాడుతూ పది నిముషాల్లో చేరుకుంటానని చెబుతున్నాడు. చూస్తుండగానే మా బస్సు లోంచి శుభ్రంగా నమిలిన గుట్కా పాన్ ఎవరో
తుపుక్కున బయటకి ఉమ్మేసారు. ఫోన్ ముగించి చూసుకున్న అతని తెల్ల చొక్కా కాస్తా రంగు మారిపోయి ఆఫీసు
కే కాకుండా రోడ్ మీద నడవడానికి రాని పరిస్టితి. అతన్ని చూస్తుంటే చాలా బాదః గా అనిపించింది. కానీ ఏమి చేవ్యలేని అసహాయ పరిస్టితి.
తర్వాత రెండు మూడు రోజులకు మళ్ళి అతడు నేను ఎక్కిన బస్సు లోనే కనిపించాడు.
నేనే ఎం జరిగిందని పలకరించాను . అతను చెప్పిన మాట విని చాలా బాధ వేసింది, ఆ రోజు అతను ఇంటర్వ్యూ కి ఫైనల్ గా వెళ్తున్నాడు. ఆ రోజు క్లియర్ ఐతే అతడి లైఫ్ సెటిల్ అయినట్లే
. కానీఆ రోజు జరిగినదానివల్లా ఇంటర్వ్యూ కి వెళ్ళలేక పోయాడు . నన్నేం చెప్పమంటారు?

No comments: